Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
movie review

ఈ సంచికలో >> సినిమా >>

సంక్రాంతి పుంజు 'డిక్టేటర్‌'

dictator movie release  on sankranti

బాలకృష్ణని సంక్రాంతి హీరో అని అభిమానులు అంటుంటారు. సంక్రాంతికి బాలయ్య సినిమా వచ్చిందంటే అది పెద్ద హిట్‌ గ్యారంటీ అని అభిమానులు ఫిక్స్‌ అయిపోతారు. ఈ సంక్రాంతికి బాలయ్య నుంచి 'డిక్టేటర్‌' సినిమా వస్తోంది. తన ఫాన్స్‌ మహా మాస్‌ అభిమానులనీ, వారిని అలరించేలా తన 'డిక్టేటర్‌' ఉంటుందని బాలయ్య చెప్పడంతో అభిమానులు, 'డిక్టేటర్‌' సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

శ్రీవాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలకృష్ణ తాజా సినిమా 'డిక్టేటర్‌' సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అంజలి, సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా బాలయ్యకు 99వ చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. 'డిక్టేటర్‌'తో పెద్ద హిట్‌ కొట్టి, వందో సినిమాకి ఇంకా హుషారుగా బాలయ్య రెడీ అవుతాడని బాలయ్య అభిమానులు నమ్ముతున్నారు. ఆ వయసేంటి, ఆ స్టెప్పులేంటి, ఫైట్స్‌లో ఆ రిస్క్‌లేంటి? అనే తరహాలో బాలయ్య 'డిక్టేటర్‌'ని డైనమిక్‌గా ఆడియన్స్‌ ముందుకు తీసుకొచ్చేస్తున్నాడు. చాన్నాళ్లుగా టాలీవుడ్‌కు దూరమైన ఐటెంబాంబ్‌ ముమైత్‌ ఖాన్‌ ఈ సినిమాలో ఐటెంసాంగ్‌ చేస్తుండడం, అప్పుడెప్పుడో బాలకృష్ణ సరసన హీరోయిన్‌గా నటించిన రతి ఈ సినిమాలో బాలకృష్ణకు పోటీగా విలన్‌ పాత్రలో నటించడం వంటి స్పెషాలిటీస్‌తో 'డిక్టేటర్‌' సినిమా సంక్రాంతికి దాదాపు 1000 ధియేటర్లలో సందడి చేయనుంది. 

మరిన్ని సినిమా కబుర్లు
ntr class touch