Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
dictator movie release  on sankranti

ఈ సంచికలో >> సినిమా >>

'నాన్నకు ప్రేమతో..' ఎన్టీఆర్‌ క్లాస్‌ టచ్‌

ntr class touch

బాబాయ్‌ మాస్‌ అయితే అబ్బాయ్‌ క్లాస్‌. 'డిక్టేటర్‌' మాస్‌ సినిమాగా ఆడియన్స్‌ ముందుకొస్తోంటే, 'నాన్నకు ప్రేమతో..' అంటూ క్లాస్‌ టచ్‌ ఉన్న టైటిల్‌తో సంక్రాంతి సంబరాలకి ఒకరోజు ముందుగానే ధియేటర్లలో సందడి చేయనున్నాడు జూనియర్‌ ఎన్టీయార్‌. జనవరి 13న సుకుమార్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌ మూవీగా మన ముందుకు రానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జంటగా రకుల్‌ ప్రీత్‌సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. టీజర్‌లోనే సినిమా కథేంటో ఆడియన్స్‌ అంచనాకి వచ్చేసేలా చాలావరకు చూపించేశారు. నాన్న సెంటిమెంట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్‌ అభిమానులు చాలా ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా కోసం ఎన్టీఆర్‌ న్యూలుక్‌లో దర్శనమిస్తున్నాడు. ఇంతవరకూ ఏ హీరో ట్రై చేయని గెటప్‌తో ఎన్టీఆర్‌ ఫుల్‌ కాన్ఫిడెన్స్‌తో పోటా పోటీ బరిలోకి దిగుతున్నాడు ఈ సినిమాతో. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన మ్యూజిక్‌ బాగా ఆట్టుకుంటోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ మరోసారి తన గొంతును సవరించుకోవడం మరో విశేషం. ట్రైలర్స్‌లో ఎన్టీఆర్‌ తన డైలాగ్స్‌, లుక్స్‌తో ఆకర్షిస్తున్నాడు. ఈ సినిమాలో ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తొలిసారిగా తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకుంటోంది. ఎన్టీఆర్‌కు ఇది 25వ చిత్రం కావడం మరో విశేషం. 

మరిన్ని సినిమా కబుర్లు
hungama of soggadu