Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
hungama of soggadu

ఈ సంచికలో >> సినిమా >>

ఎక్స్‌ప్రెస్‌లా దూసుకొచ్చేస్తున్న 'రాజా'

raja  arriving like express

'రాజాది రాజానప్పా..' అంటూ 'రన్‌ రాజా రన్‌' సినిమాతో దూసుకొచ్చి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న శర్వానంద్‌, ఇంకోసారి 'రాజా'ని నమ్ముకున్నాడు. ఈ సంక్రాంతికి రాజాలా ఎక్స్‌ప్రెస్‌ వేగంతో 'ఎక్స్‌ప్రెస్‌ రాజా' సినిమాతో ఆడియన్స్‌ ముందుకొచ్చేస్తున్నాడీ యంగ్‌ హీరో. 'ఎక్స్‌ప్రెస్‌ రాజా'తో ఇంకో సక్సెస్‌ తన ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నాడు శర్వానంద్‌. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' సినిమాతో విజయం సాధించిన మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో తెరకెక్కబోతోంది ఈ సినిమా. చిన్న సినిమా అయినప్పటికీ పెద్ద సినిమాలతో పోటీగా సంక్రాంతి బరిలో దిగడానికి సిద్ధంగా ఉంది ఈ సినిమా. సక్సెస్‌ఫుల్‌ బ్యానర్‌గా ఎంతో ప్రఖ్యాతి గాంచిన యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

క్రాంతి పోటీలో నిలవడం ద్వారా తమ సినిమాలో కంటెంట్‌ వుందని చెప్పకనే చెబుతున్న 'ఎక్స్‌ప్రెస్‌ రాజా' టీమ్‌, ఈ సంక్రాంతికి సంచలన విజయాన్ని నమోదు చేస్తామనే ధీమా వ్యక్తం చేస్తోంది. చిన్న సినిమాలకు ఏమాత్రం మంచి టాక్‌ వచ్చినా, ఆ హిట్‌ ఆషామాషీగా ఉండదు. ఆ నమ్మకం హీరో శర్వానంద్‌లో స్పష్టంగా కన్పిస్తోంది. ఈ చిత్రంలో శర్వానంద్‌ సరసన సురభి హీరోయిన్‌గా నటించింది. సినిమా యూనిట్‌ నమ్మకం నిజమవ్వాలని 'రాజా' శర్వానంద్‌కి సక్సెస్‌ సెంటిమెంట్‌ అవ్వాలనీ ఆశిద్దాం. 

మరిన్ని సినిమా కబుర్లు
nani as hero krishnagadi veera premagaadha