Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Fits | Epilepsy | Ayurvedic Treatment | మూర్ఛలు, ఫిట్స్ | Dr Murali

ఈ సంచికలో >> శీర్షికలు >>

నాటుకోడి పులుసు - పి . శ్రీనివాసు

కావలిసిన పదార్ధాలు: నాటుకోడి ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, లవంగాలు, యాలకులు, దనియాలు, జీడిపప్పు, అల్లంవెల్లుల్లి ముద్ద, టమాటాలు, గసగసాలు,దాల్చిన చెక్క, నిమ్మకాయ, కారం 

తయారుచేసే విధానం: ముందుగా బాణలిలో నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి అవి వేగాక నాటుకోడి ముక్కలను వేసి పసుపు, కారం ,అల్లంవెల్లిల్లి ముద్ద, టమాట ముక్కలను వేసి కలిపి  రెండు విజిల్స్ వచ్చేవరకు కుక్కర్ లో ఉడికించాలి. ఈలోపల లవంగాలు, దనియాలు, జీడిపప్పు, యాలకులు, గసగసాలు, దాల్చిన చెక్క వీటన్నింటినీ ముద్దగా చేసి వుంచాలి. రెండు విజిల్స్ రాగానే మూతతీసి తయారుచేసిన మసాలా ముద్దను ఉడుకుతున్న నాటుకోడి పులుసులో వేసి 10 నిముషాల తరువాత స్టవ్ కట్టేయాలి. చివరగా ఒక నిమ్మకాయ రసాన్ని వేసి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే వేడి వేడి నాటుకోడి పులుసు రెడీ..  

మరిన్ని శీర్షికలు
vastu vastavalu