Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష

movie review

చిత్రం: నాన్నకు ప్రేమతో 
తారాగణం: ఎన్టీఆర్‌, జగపతిబాబు, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, తాగుబోతు రమేష్‌, ఆశిష్‌ విద్యార్థి తదితరులు 
సంగీతం: దేవిశ్రీప్రసాద్‌ 
ఛాయాగ్రహణం: విజయ్‌ కె చక్రవర్తి 
నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర 
దర్శకత్వం: సుకుమార్‌ 
నిర్మాత: బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ 
విడుదల తేదీ: 14 జనవరి 2016 

క్లుప్తంగా చెప్పాలంటే 
అనారోగ్యంతో బాధపడ్తున్న రమేష్‌ చంద్ర ప్రసాద్‌ (రాజేంద్రప్రసాద్‌) అస్వస్థతకు గురవుతాడు. డాక్టర్లు అతను ఎక్కువ కాలం బతికే అవకాశం లేదని చెప్తారు. తండ్రి అనారోగ్యం గురించి తెలుసుకున్న అభిరామ్‌కి, తన తండ్రి మనోవేదనతో బాధపడుతున్నాడని అర్థమవుతుంది. తన పరిస్థితికి కారణం కృష్ణమూర్తి (జగపతిబాబు) అని కొడుక్కి వివరిస్తాడు రమేష్‌ చంద్ర ప్రసాద్‌. తనయుడిని ఓ కోరిక కూడా కోరతాడు. ఆ కోరికను నెరవేర్చే క్రమంలో కృష్ణమూర్తితో అభిరామ్‌ తలపడ్తాడు. ఈ క్రమంలో అభిరామ్‌ ఎదుర్కొనే సమస్యలేమిటి? తండ్రి కోరికను అభిరామ్‌ తీర్చాడా? కృష్ణమూర్తి, అభిరామ్‌ తండ్రికి చేసిన అన్యాయమేంటి? అన్నవి తెరపై చూడాల్సిందే. 

మొత్తంగా చెప్పాలంటే 
అభిరామ్‌ పాత్రలో ఎన్టీఆర్‌ నటించాడని అనలేం, జీవించేశాడు. 'టెంపర్‌' సినిమాలో హై ఓల్టేజ్‌ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్న ఎన్టీఆర్‌, ఈ సినిమాకొచ్చేసరికి సెటిల్డ్‌ పెర్ఫామెన్స్‌తో మెప్పించాడు. అద్భుతమైన నటనా ప్రతిభతో ఎన్టీఆర్‌ మెస్మరైజ్‌ చేశాడనడం కరెక్ట్‌. స్టైలిష్‌ లుక్‌తో, స్టైలిష్‌ డాన్సులతో, స్టైలిష్‌ బాడీ లాంగ్వేజ్‌తో కెరీర్‌ బెస్ట్‌ పెర్ఫామెన్స్‌ ఇచ్చాడు ఎన్టీఆర్‌. 

సరైన అవకాశమొస్తే రాజేంద్రప్రసాద్‌ నటనతో ఎలా చేలరేగిపోతారో అందరికీ తెలిసినదే. జగపతిబాబు కూడా సేమ్‌ టు సేమ్‌. రిచ్‌ స్లైలిష్‌ గెటప్‌లో జగపతిబాబు అల్టిమేట్‌గా ఉన్నారు. ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అనడానికి వీల్లేకుండా ఆకట్టుకున్నారు ఈ ఇద్దరూ. హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో అలరించింది. గ్లామర్‌ కూడా బాగానే పండించింది. సొంత డబ్బింగ్‌ చెప్పుకోవడం ద్వారా రకుల్‌ ఓ మెట్టు పైకెక్కింది హీరోయిన్‌గా. ఈ సినిమా ఆమె కెరీర్‌లో ఓ స్పెషల్‌ మూవీగా నిలుస్తుంది. మధుబాల కాస్సేపే కనిపించినా, బాగా ఆమె పాత్ర రిజిస్టర్‌ అవుతుంది. రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌ తమ పాత్రలకు తగ్గట్టుగా నటించి, అలరించారు. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగా చేశారు. 

కథ పాతదే. కథనం విషయంలో దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. గత సినిమాలో కన్‌ఫ్యూజన్‌ క్రియేట్‌ చేసినా, ఈసారి ఆ తప్పు చేయలేదు. ఆడియన్స్‌కి కన్‌ఫ్యూన్‌ లేకుండా కథనాన్ని నడిపించాడు. డైలాగ్స్‌ విషయంలోనూ మంచి మార్కులు పడతాయి. మ్యూజిక్‌ బాగుంది. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా సినిమాకి హెల్ప్‌ అయ్యింది. సినిమాటోగ్రఫీ సింప్లీ సూపర్బ్‌. లొకేషన్స్‌ని చాలా అందంగా చూపించాడు సినిమాటోగ్రాఫర్‌. స్టైలిష్‌ సినిమాకి స్టైలిష్‌గా సినిమాటోగ్రఫీ ఉంది. లెంగ్త్‌ కొంచెం ఎక్కువనిపిస్తుందిగానీ, ఎడిటింగ్‌ కూడా ఓకే. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ విభాగాలు సినిమాకి తగ్గట్టుగా పనిచేశాయి. 

అందరికీ తెలిసిన విషయమే, డైరెక్టర్‌ సుకుమార్‌ లెక్కల మాస్టారని. ఆయన సినిమాలు చూస్తుంటే అన్నీ లెక్కల్లానే కనిపిస్తాయి. ఒక్కోసారి ఆల్‌ జీబ్రాలా ఉంటే, ఒక్కోసారి క్లియర్‌గా అర్థమయ్యే లెక్కలా ఉంటుంది. కన్‌ఫ్యూజన్‌లేని ఫార్ములా అయితే సుకుమార్‌ లెక్క బాగా అర్థమవుతుంది. 'నాన్నకు ప్రేమతో' సినిమా క్లాస్‌ ఆడియన్స్‌ని అలరిస్తుంది, మంచి సినిమా చూశామన్న ఫీల్‌ని మిగుల్చుతుంది. మంచి పాయింట్‌ని చెప్పదలచుకున్నప్పుడు ఒక్కోసారి ఎంటర్‌టైన్‌మెంట్‌ తప్పనిసరవుతుంది. ఆ లెక్కలు వేసుకోకుండా సినిమా చేయడం రిస్కే. కానీ, ఆ రిస్క్‌లోనూ మంచి మెసేజ్‌ ఇవ్వాలన్న మంచి ఆలోచన వర్కవుట్‌ అయితే ఆ కిక్కే వేరు. ఈ సినిమా వరకూ అన్నీ కుదిరాయి. మాస్‌ ఆడియన్స్‌ కొంచెం నిరాశ చెందుతారు. అదొక్కటీ చిన్న మైనస్‌. అది తప్పితే సినిమాకి చేసిన పబ్లిసిటీ, సినిమాకి వచ్చిన ఓపెనింగ్స్‌, సినిమాలోని కంటెంట్‌ అన్నీ పాజిటివ్‌ థింగ్స్‌. ఎన్టీఆర్‌ కెరీర్‌లో ఇదో మంచి సినిమా అవుతుందనడం నిస్సందేహం. ఫస్టాఫ్‌తో పోల్చితే సెకెండాఫ్‌లో కొంచెం సెంటిమెంట్‌ పాళ్ళు ఎక్కువయ్యాయి. క్లయిమాక్స్‌లో ఆడియన్స్‌ని కట్టిపడేశారంటే, సినిమా సూపర్‌ సక్సెస్‌ అయినట్టే కదా. 

ఒక్క మాటలో చెప్పాలంటే 
ఎన్టీఆర్‌ క్లాస్‌ సక్సెస్‌తో.. 

అంకెల్లో చెప్పాలంటే: 3.25/5 

మరిన్ని సినిమా కబుర్లు
movie review