Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview

ఈ సంచికలో >> సినిమా >>

కామెడీలో కొత్త ఏంగిల్‌ చూపిస్తా: సప్తగిరి

saptagiri new look

సప్తగిరి ఈ పేరు వింటేనే కొత్తగా ఉంటుంది. ఇక ఈ పేరున్న వ్యక్తి కామెడీ చేస్తే ఆ కొత్త వింతగా ఉంటుంది కదా. ఆయనే మన కమెడియన్‌ సప్తగిరి. 'పరుగు' సినిమా ద్వారా కమెడియన్‌గా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' సినిమాతో రిజస్టర్‌ అయ్యాడు. 'ప్రేమకథా చిత్రమ్‌' సినిమాతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. కామెడీలో డిఫరంట్‌ స్టైల్‌ చూపించాడు సప్తగిరి. అయితే 'ప్రేమకథా చిత్రమ్‌' నుండీ ఒకే ట్రెండ్‌ కామెడీని ఫాలో అవుతున్నాడు ఈ యంగ్‌ కమెడియన్‌. కమెడియన్లలో బీభత్సమైన ఎనర్జీ ఉన్నోడు సప్తగిరి. లౌడ్‌ కామెడీ అతని ప్రత్యేకత. దీంతోనే ఎక్కువగా సక్సెస్‌ అవ్వడం వల్ల ఈ సక్సెస్‌మంత్రాన్ని ఫాలో అవ్వక తప్పడం లేదంటున్నాడు.

కానీ తన రెగ్యులర్‌ కామెడీతో ప్రేక్షకులకే కాదు, తనకి కూడా బోర్‌ కొట్టేసిందట. దాంతో ఇక ఈ కమెడియన్‌ కామెడీలో కొత్త యాంగిల్‌ని ప్రేక్షకులకు పరిచయం చేస్తానంటున్నాడు. ఇంత వరకూ ఎవరూ చేయని కామెడీని తన బాడీలాంగ్వేజ్‌కి మిక్స్‌ చేసి చూపిస్తానంటున్నాడు. ప్రస్తుతం సప్తగిరి చేతిలో చాలా సినిమాలు చేతిలో ఉన్నాయట. వాటిలో డిఫరెంట్‌ స్టైల్లో డిఫరెంట్‌ లుక్స్‌తో కామెడీ పండిస్తాను. నవ్వుకోవడానికి రెఢీగా ఉండండంటున్నాడు. అయితే మరి సప్తగిరి కామెడీని ఇంకా ఇంకా ఎంజాయ్‌ చేసేద్దామా ! 

మరిన్ని సినిమా కబుర్లు
silk baby in bachelors  party