Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
silk baby in bachelors  party

ఈ సంచికలో >> సినిమా >>

పవన్‌ కళ్యాణ్‌ సినిమాలో అల్లు సిసింద్రీ ?

allu arjun son act  in pavan kalyan movie

బాబీ దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'. ఈ సినిమాకు ఒక కొత్త గ్లామర్‌ అద్దనుంది. స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ముద్దుల తనయుడు అల్లు అయాన్‌ ఈ సినిమాలో నటించనున్నాడని సమాచారమ్‌. ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ ఒక చిన్న బాబుని రక్షించే సీన్‌ ఒకటి ఉంది. ఆ సీన్‌లో అల్లు అయాన్‌ నటించనున్నాడని టాక్‌ విన్పిస్తోంది. దాంతో మెగాఫ్యాన్స్‌ అల్లు ఆర్జున్‌ కొడుకుని ఈ సినిమా ద్వారా తెరపై చూసేందుకు ఎంతో ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు.

ఈ వార్త నిజమో కాదో తెలియదు కానీ ముఖ్యంగా అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ అయితే ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఈ వార్త వాస్తవమైతే రెండేళ్ల లోపే వయసున్న ఈ అల్లు వారి ముద్దుల వారసుడు అల్లు అయాన్‌ తెర పైకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోతుండడం విశేషం. అయితే ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది చిత్రబృందం. 

మరిన్ని సినిమా కబుర్లు
lavanya tripati got  double dhamaka