Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
vastu vastavalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

15-01-2016 నుండి 21-01-2016 వరకు వారఫలాలు - శ్రీకాంత్

మేష రాశి : ఈ వారం మొత్తంమీద సమయాన్ని సద్వినియోగం చేసుకొనే దిశగా ప్రణాలికలను తయారుచేసుకోవడం ఉత్తమమైన లక్షణం. ఉద్యోగంలో ఎదుటివారి ఆలోచనలకు అనుగుణంగా ప్రవర్తించుట మేలు. ప్రయాణాలు చేయకండి అవసరమైతే వాయిదా వేయుట ఉత్తమం. మిత్రులతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. చర్చల్లో కాస్త నిదానంగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. మానసికంగా దృడంగా లేకపోతే నూతన్ సమస్యలు ఏర్పడే అవకాశం కలదు జాగ్రత్త. దూరప్రదేశం నుండి నూతన అవకాశం లభిస్తుంది.  నూతన పనులలో సమయపాలన పాటించుట వలన మేలుజరుగుతుంది. కుటుంబ సభ్యుల ఆలోచనలను స్వీకరించుట మంచిది. ఆరోగ్యం విషయంలో మాత్రం అశ్రద్ద వద్దు.

 

వృషభ రాశి  ఈవారం మొత్తంమీద చేపట్టు పనుల విషయంలో సరైన ఆలోచనలతో ముందుకు వెళ్ళుట సూచన. ప్రణాళికా బద్దంగా నడుచుకొనుట వలన లబ్దిని పొందుతారు. ఇష్టమైన వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. ఉద్యోగంలో మిశ్రమఫలితాలు ఉంటాయి, నలుగురిని కలుపుకొని వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. ముఖ్యమైన పనులకోసం చేసే ప్రయాణాలు చేయకండి,సాధ్యమైనంత వరకు వాటిని వాయిదా వేయుట మేలు. అధికమైన ఆలోచనలను పక్కనపెట్టండి. పెద్దలతో చేసే చర్చలు ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది, నూతన ప్రయత్నాలు వస్తాయి. సంతానం నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు. వారితో కలిసి నూతన పనులను చేపడుతారు.
                       

మిథున రాశి : .ఈవారం మొత్తంమీద ప్రయాణాలలో సమయాన్ని అధికభాగం గడిపే అవకాశం ఉంది. నూతన ప్రయత్నాల విషయంలో ఏదో ఒక ఆటంకం వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో భాద్యతలు పెరుగుతాయి,అలాగే స్వల్ప మనస్పర్థలు మీకన్నా పెద్దవాళ్ళతో వచ్చే అవకాశం ఉంది. చాలావరకు అన్ని విషయాల్లో సర్దుబాటు విధానం చాలావరకు మేలుచేస్తుంది. ఉద్యోగంలో పనిభారం ఉంటుంది. సంతానం విషయంలో మీరు తీసుకొనే నిర్ణయాలు కీలకమైనవి అయ్యే అవకాశం ఉంది. ధనమునకు సంభందించిన విషయాల్లో మీయొక్క ప్రయత్నాలు మిశ్రమఫలితాలను కలుగజేస్తాయి. మీయొక్క ఆలోచనలు అలాగే మాట్లాడేవిధానంలో స్వల్ప మార్పులు చేసుకొనే ప్రయత్నం చేయుట లబ్దిని చేకూరుస్తుంది.
 

కర్కాటక రాశి : ఈవారం మొత్తంమీద నలుగురిలో మీరు ఆశించిన గుర్తింపును పొందుతారు. సామజిక సేవాకార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. నూతన పనులను ఆరంభించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. తల్లితరుపు బంధువుల యొక్క ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురిచేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో తొటిఉద్యొగులతొ స్వల్ప మనస్పర్థలు ఏర్పడే అవకాశం కలదు కావున సర్దుబాటు అవసరం. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులు పెట్టకండి అలాగే అనుభవజ్ఞుల సూచనల మేర నడుచుకోవడం వలన మేలుజరుగుతుంది. గతకొంతకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగంలో మార్పుడికి అవకాశం ఉంది ప్రయత్నం పెంచుత అవసరం.               


సింహ రాశి : ఈవారం మొత్తంమీద కుటుంబంలో ఊహించని మార్పులకు అవకాశం ఉంది కావున ఓపికగా వేచిచూసే దోరణి అవసరం. ముఖ్యంగా స్త్రీ / పురుష ,సంభందమైన విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే మాట పడవలసి రావోచ్చును. వ్యాపారపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనల మేర నడుచుకోండి. మిత్రుల ద్వార లబ్దిని పొందుతారు. ఉద్యోగంలో ప్రణాళిక బద్దంగా ముందుకు వెళితే నలుగురిలో గుర్తింపును పొందుతారు. అధికారులకు అనుగుణంగా నడుచుకోండి, వారి ప్రశంశలు పొందుతారు. మీయొక్క మాటతీరు కొంతమందిని ఇబ్బంది పెట్టేదిగా ఉంటుంది. కుటుంబంలో సభ్యులతో కలిసి ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. జీర్ణవ్యవస్థ పరమైన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది జాగ్రత్త.              


కన్యా రాశి : ఈవారం మొత్తంమీద నూతన ఆలోచనలను కలిగి ఉంటారు. అధికసమయం చర్చలకు ఇస్తారు. నచ్చిన వ్యక్తులతో కలిసి కొత్త కొత్త పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. అనవసరమైన విషయాలకు అలాగే వివాదాలకు దూరంగా ఉండుట సూచన. వ్యాపారపరమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. నూతన పరిచయాలకు అవకాశం ఉంది. మిత్రులతో కలిసి విందులలో పాల్గొంటారు. కోపాన్ని కాస్త అదుపులో ఉంచుకొనుట వలన కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు సర్దుకుంటాయి. స్త్రీ / పురుష సంభందమైన విషయాల్లో  మార్పులకు ఆస్కారం కలదు. వాటిని స్వాగతించుట మంచిది. ఉద్యోగంలో అధికారులతో కలిసి చేపట్టిన పనుల మూలాన శ్రమ అలాగే పనిభారం పెరుగుతుంది.                        

 

తులా రాశి : ఈవారం మొత్తంమీద ఉద్యోగంలో అధికారులతో కలిసి నూతన పనులను ఆరంభిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో బాగుంటుంది. బంధువుల నుండి ఆశించిన సహకారం లభిస్తుంది. మీయొక్క ఆలోచన విధానం సరిచుకోవడం మేలు. మానసికంగా దృడమైన ఆలోచనలు కలిగి ఉండుట వాటికి సమయం ఇవ్వడం వలన మేలుజరుగుతుంది. దూరప్రదేశంలో ఉన్న మిత్రుల నుండి గతకొంతకాలంగా మీరు ఎదురుచుస్తున్న విషయాలు తెలుస్తాయి. ఉద్యోగంలో మీయొక్క లక్ష్యాలను పూర్తిచేసే దిశగా అడుగులు వేయుట ఉత్తమం. దొరికిన దానితో సంతృప్తి లేకపోవడం వలన చాలావిషయాల్లో నిరాశాను పొందుతారు. సమయానికి భోజనం చేయుట అలాగే అనుభవజ్ఞుల సూచనలు పాటించుట మంచిది.           

 

వృశ్చిక రాశి  : ఈవారం మొత్తంమీద కుటుంబంలో సభ్యులకు మీయొక్క ఆలోచనలు తెలియజేస్తారు. శ్రమించుట ద్వార మీయొక్క వ్యక్తిగత పనులను పూర్తిచేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఇతరులతో సత్సంభందాలు కలిగి ఉండుట సూచన. మీయొక్క పూర్వీకుల నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు, ఈ విషయంలో మీ భాద్యతలు నెరవేర్చే ప్రయత్నం మంచిది. వాహనముల వలన ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త. సాధ్యమైనంత వరకు ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. తలపెట్టిన పనులను మధ్యలో వదిలేసే అవకాశం కలదు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండుట వలన వివాదాలను తగ్గించుకొనే అవకాశం కలదు. వ్యాపారంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు.      
 

ధనస్సు రాశి  : ఈవారం మొత్తంమీద సంతానం విషయంలో కొంత ఒత్తిడిని పొందుటకు అవకాశం కలదు. వారికి కాస్త సమయం ఇవ్వడం వలన మేలుజరుగుతుంది. కుటుంబంలో కీలకమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. చిన్న చిన్న ఇబ్బందులు కలిగిన ఆశించిన ఫలితాలు పొందుతారు. మిత్రులనుండి సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో అధికారులతో కలిసి చర్చల్లో పాల్గొంటారు.వారికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం వలన లబ్దిని పొందుతారు. గతకొంత కాలంగా పెండిగ్ లో ఉన్న విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారపరమైన విషయాల్లో నూతన మార్పులు చోటుచేసుకొనే అవకాశం ఉంది. స్వల్పఅనారోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం ఉంది.  
 

మకర రాశి : ఈవారం మొత్తంమీద తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. అనవసరమైన ఖర్చులను అదుపులో ఉంచుకొనే ప్రయత్నం చేయుట మంచిది. కుటుంబసభ్యులతో మీయొక్క ఆలోచనలను పంచుకుంటారు. పెద్దలతో చేయు చర్చలు మిశ్రమఫలితాలు కలుగజేస్తాయి. బద్ధకం వీడడం సూచన. దూరప్రదేశప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు. బంధువుల నుండి వచ్చు సమాచారం విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. స్వల్పఅనారోగ్య సమస్యలు ఏర్పడుతాయి జాగ్రత్త. విలువైన వస్తువులను కొనుగోలు చేయాలనుకొనే మీ ఆలోచనలను వాయిదా వేయుట మంచిది. వ్యాపారంలో బాగానే ఉంటుంది.                    

 

 కుంభ రాశి : ఈవారం మొత్తంమీద మిత్రులతో కలిసి లేదా మీయొక్క వ్యాపారభాగస్వామితో కలిసి నూతన ప్రణాళికలు సిద్దం చేసుకొనే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. పెట్టుబడుల విషయంలో అనుకూలమైన సమయం కావున అనుభవజ్ఞుల సూచనల మేర నడుచుకోవడం మూలాన మరింత లబ్దిని పొందుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల నుండి మన్ననలు పొందుటకు అవకాశం ఉంది. మీయొక్క ఆలోచనలు నలుగురికి ఉపయోగపడుతాయి. సామాజికసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్వల్పఅనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది కావున తగిన జాగ్రత్తలు తీసుకోండి. జీవితభాగస్వామితో కలిసి నూతన ఆలోచనలు చేస్తారు.           

 

మీన రాశి : ఈవారం మొత్తంమీద మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఇష్టపడుతారు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వీటికి సమయాన్ని ఇస్తారు. అధికారులతో మనస్పర్థలు ఏర్పడే అవకాశం ఉంది కావున మీ పరిధులలో మీరు ఉండుట సూచన. కుటుంబంలో సభ్యులతో మాట పట్టింపులకు పోకండి. విదేశీప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అక్కడినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ఉన్నత విద్యకోసం చేయు ప్రయత్నాలు మిశ్రమఫలితాలు కలుగజేస్తాయి. అనుభవానికి ప్రాముక్యత ఇవ్వడం వలన మేలుజరుగుతుంది. సంతానం విషయంలో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. దైవసంభందమైన కార్యక్రమాల్లో మీకు నచ్చిన వారితో కలిసి పాల్గొనే అవకాశం ఉంది.    

మరిన్ని శీర్షికలు
sahiteevanam