Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
movie review

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష

movie review

చిత్రం: ఎక్స్‌ప్రెస్‌ రాజా 
తారాగణం: శర్వానంద్‌, సురభి, సప్తగిరి, ప్రభాస్‌ శ్రీను, హరీష్‌ ఉత్తమన్‌, ఊర్వశి, ధన్‌రాజ్‌, బ్రహ్మాజీ, షకలక శంకర్‌, సుప్రీత్‌, నాగినీడు తదితరులు 
సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజు 
ఛాయాగ్రహణం: కార్తీక్‌ ఘట్టమనేని 
నిర్మాణం: యు.వి. క్రియేషన్స్‌ 
దర్శకత్వం: మేర్లపాక గాంధీ 
నిర్మాతలు: వి.వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి 
విడుదల తేదీ: 14 జనవరి 2016 

క్లుప్తంగా చెప్పాలంటే 
పనీ పాటా లేని కుర్రాడు రాజా (శర్వానంద్‌)కి అమ్ము (సురభి) అనే అమ్మాయిని చూడగానే ప్రేమ పుడుతుంది. తొలి చూపులోనే ఆమెను ప్రేమించేస్తాడు రాజా. అమ్ము తొలుత నిరాకరించినా, ఆ తర్వాత రాజాతో ప్రేమలో పడుతుంది. ఈలోగా ఓ కుక్క పిల్లను కిడ్నాప్‌ చేస్తాడు రాజా. అక్కడినుంచి కథ అనేక మలుపులు తిరుగుతుంది. ఆ కుక్కని కిడ్నాప్‌ చేయడంతో రాజా జీవితంలో అనుకోని అనేక సంఘటనలు జరుగుతాయి. అవేంటి? అన్నది తెరపై చూస్తేనే బాగుంటుంది. 

మొత్తంగా చెప్పాలంటే 
శర్వానంద్‌ మంచి నటుడు. సరైన పాత్ర దొరికితే జీవించేస్తాడు. అతని గత చిత్రాలన్నీ ఆ విషయాన్ని నిరూపించాయి. కమర్షియల్‌ సక్సెస్‌ అందింది మాత్రం 'రన్‌ రాజా రన్‌' సినిమాతోనే. ఆ కోవలోనే ఈ ఎంటర్‌టైనింగ్‌ కాన్సెప్ట్‌కి జై కొట్టాడు శర్వానంద్‌. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా ఉండే తన పాత్రకు ప్రాణం పోసేశాడు. 

సురభి గ్లామరస్‌గా కనిపించింది. క్యూట్‌ అప్పీల్‌తో ఆకట్టుకుంటుంది. నటనలోనూ మంచి మార్కులేయించుకుంటుంది. సరైన అవకాశాలొస్తే, నటిగా టాలీవుడ్‌లో ఇంకా మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. ప్రభాస్‌ శ్రీను కామెడీతో అలరంచాడు. సప్తగిరి మరోసారి తనదైన కామెడీతో ఆకట్టుకున్నాడు. సుప్రీత్‌, హరీష్‌ ఉత్తమన్‌, ఊర్వశి, బ్రహ్మాజీ, ధన్‌రాజ్‌, రఘు కారుమంచి తదితరులంతా కామెడీతో నవ్వులు పూయించారు. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర బాగా చేశారు. 

కుక్క చుట్టూ కథేంటి? అనుకున్నాసరే, స్క్రీన్‌ప్లేతో సినిమాని ఎంటర్‌టైనింగ్‌గా, ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు దర్శకుడు. టేకింగ్‌ దగ్గర్నుంచి, పాత్రల పరిచయం, పాత్రల గమనం అన్నీ చక్కగా ప్లాన్‌ చేసుకున్నాడు. డైలాగ్స్‌ బాగున్నాయి. మ్యూజిక్‌ బాగుంది. పాటలు వినడానికీ, చూడ్డానికీ బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకి కలిసొచ్చింది. నిర్మాణపు విలువలు చాలా బాగున్నాయి. సినిమాలో ఆ రిచ్‌నెస్‌ కనిపించింది. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ డిపార్ట్‌మెంట్స్‌ ఓకే. సినిమాని క్వాలిటీతో రూపొందించారు. 

తొలి సినిమా 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌'తో ఆకట్టుకున్న దర్శకుడు మేర్లపాక గాంధీ, రెండో సినిమాతోనూ అలరించాడు. ఎంటర్‌టైనింగ్‌ సినిమానే అయినా, డిఫరెంట్‌ స్క్రీన్‌ప్లేతో దర్శకుడు తన సత్తా చాటుకున్నాడు. డైరెక్టర్స్‌ మూవీ అనిపించేలా సినిమాని రూపొందించాడు దర్శకుడు. ఫస్టాఫ్‌, సెకెండాఫ్‌ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటూనే, నెక్స్‌ట్‌ జరిగే సీన్‌ విషయంలో ఇంట్రెస్ట్‌ పెరిగేలా చేయగలిగాడు. ఓవరాల్‌గా సినిమా అన్ని క్లాస్‌ల ఆడియన్స్‌నీ అలరించేలా ఉంది. డిఫరెంట్‌ స్క్రీన్‌ప్లేతో నీట్‌ ఎంటర్‌టైనర్‌ అన్పించుకుంటుందీ సినిమా. 

ఒక్క మాటలో చెప్పాలంటే 
సక్సెస్‌ ఎక్స్‌ప్రెస్‌ 

అంకెల్లో చెప్పాలంటే: 3.25/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka