Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
anasuya in and as police

ఈ సంచికలో >> సినిమా >>

వసూల్‌ రాజా శర్వానంద్‌

boxoffice hero sharvanand

యువీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో తెరకెక్కిన శర్వానంద్‌ చిత్రం 'ఎక్స్‌ప్రెస్‌ రాజా', సంక్రాంతికి విడుదలై భారీ వసూళ్లు రాబట్టింది. కేవలం వసూళ్లే కాకుండా ప్రేక్షకులకు వినోదాన్ని కూడా వీరలెవెల్లో అందించింది. ఏ చిన్న హీరో చేయని సాహసం చేశాడు ఈ కుర్రహీరో. సంక్రాంతి బరిలో పెద్ద హీరోలతో పోటీపడి తాను ఏ మాత్రం తీసిపోనంటూ ఎక్స్‌ప్రెస్‌ స్థానంలో నిలిచాడు. నిజంగా శర్వానంద్‌కి ఈ విషయంలో హ్యట్యాప్‌ చెప్పక తప్పదు. ధైర్యంగా తాను చేసిన ప్రయత్నంలో పూర్తిగా విజయం సాధించాడు ఈ ఎక్స్‌ప్రెస్‌ రాజా. ధీటైన విజయంతో సంక్రాంతికి నిజమైన సినిమా పండుగ తీసుకొచ్చాడు. ఈ సినిమా విజయంతో ఊపుమీదున్న శర్వానంద్‌, తాను ఏ రకమైన సినిమా చేయడానికైనా రెడీ అంటూ తన దగ్గరకు వచ్చే డైరెక్టర్స్‌కు పెద్ద క్లూనే ఇచ్చాడు.

ఇంతవరకూ శర్వానంద్‌ అంటే సీరియస్‌గా కనిపించే క్యారెక్టర్స్‌కే సెట్‌ అవుతాడు అనుకునేవారంతా. కానీ ఈ కుర్రహీరో తన ట్రాక్‌ ఛేంజ్‌ చేసుకుని కామెడీ ట్రైన్‌ ఎక్కేసి సక్సెస్‌ గమ్యాన్ని చేరుకున్నాడు. 'రన్‌ రాజా రన్‌' సినిమాతో సూపర్‌ కమర్షియల్‌ సక్సెస్‌ అందుకుని, 'ఎక్స్‌ప్రెస్‌ రాజా'తో రేంజ్‌ పెంచేసుకున్నాడీ యంగ్‌ హీరో. సో.. ఇక ఈ ఫార్ములాతో సెక్సెస్‌ జోన్‌లోకి అడుగు పెట్టిన శర్వానంద్‌ నుండి మరిన్ని మంచి ఎంటర్‌టైనింగ్‌ సినిమాలు రావాలని ఆశిద్దాం. 

మరిన్ని సినిమా కబుర్లు
megastar chiranjeevi