Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
boxoffice hero sharvanand

ఈ సంచికలో >> సినిమా >>

మెగాస్టార్‌ చిరంజీవి 'కత్తి'లాగున్నాడు

megastar chiranjeevi

చిరంజీవి 150వ చిత్రంగా 'బ్రూస్‌లీ'తో రీఎంట్రీ ఇచ్చాడు. ఇక 151వ చిత్రంగా తెరకెక్కుతున్న తమిళ్‌ సినిమా 'కత్తి' రీమేక్‌కు సర్వం సిద్ధమవుతోంది. వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఒరిజినల్‌ ఫ్లేవర్‌ ఏ మాత్రం తగ్గకుండా, తెలుగు నేటివిటీకి కనెక్ట్‌ అయ్యేలా చిన్న చిన్న మార్పులు చేర్పులు చేస్తున్నారట. చిరంజీవి రీఎంట్రీలో వస్తున్న ఈ సినిమాకు అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ను జోడించి పక్కా మాస్‌ సినిమాగా తెరకెక్కించాలనే యోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు చిరు ఈ సినిమాలో మీస కట్టుతో కనిపించనున్నట్లు సమాచారం. ఈ గెటప్‌కి సంబంధించిన ఒక ఫోటో తాజాగా బయటికి వచ్చింది. చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా మార్చిలో ఈ సినిమా ప్రారంభోత్సవం జరగనున్నట్లు సమాచారం.

చిరంజీవి పక్కన హీరోయిన్‌గా నయనతారను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కొంతమంది సీనియర్‌ హీరోయిన్ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాలో హీరోయిన్‌గా అందంగా కనిపించిన రమ్యకృష్ణ పేరు కూడా హీరోయిన్స్‌ లిస్టులో ఉంది. 'అఖిల్‌' సినిమా పరాజయంతో వి.వి.వినాయక్‌ ఈ సినిమాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి, పక్కా ప్రణాళికతో ముందుకెళ్లున్నాడు. ఎంతో మంది డైరెక్టర్లను కాదని, తనకు లభించిన ఈ అరుదైన అవకాశాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాడు వినాయక్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన 'ఠాగూర్‌' సూపర్‌ విజయాన్ని అందుకుంది. 

మరిన్ని సినిమా కబుర్లు
nagarjuna upri movie ready to release