Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nagarjuna upri movie ready to release

ఈ సంచికలో >> సినిమా >>

ట్రైలర్‌తో అదరగొట్టేస్తున్న నానీ ప్రేమ గాధ

nani's trailer is excellent

హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కృష్ణగాడి వీర ప్రేమగాధ'. నానీ, మెహ్రెన్‌ కౌర్‌ జంటగా నటిస్తున్న ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌ బుధవారం హైద్రాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ ఆడియో ఫంక్షన్‌కు సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు గెస్ట్‌గా రావడం విశేషం. 'అందాల రాక్షసి' వంటి డిఫరెంట్‌ లవ్‌ స్టోరీని అందించిన హను రాఘవపూడి ఈ సినిమాతో మరో కొత్త లవ్‌ స్టోరీని పరిచయం చేయబోతున్నాడు.

తాజాగా విడుదలైన ట్రైలర్‌ చూస్తుంటేనే నానీ ఖచ్చితంగా మరో హిట్‌కు రెఢీ అయిపోయాడనిపిస్తోంది. 'భలే భలే మగాడివోయ్‌'వంటి చిన్న సినిమాతోనే పెద్ద హిట్‌ అందుకున్న నానీ, ఈ సినిమాతో మరో హిట్‌ అందుకోవడం ఖాయం అని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రేమ, పగ ఆ రెండింటినీ కలగలిపి, వాటిని సాధించడానికి నానీ చేసే చిలిపి అల్లరిని, వీరత్వంను వీర లెవల్లో.. అదీ న్యూ టచ్‌తో ట్రైలర్‌ ద్వారా పరిచయం చేసేశాడు డైరెక్టర్‌. అందుకే ఈ ట్రైలర్‌ విపరీతంగా ఆకట్టుకుంటోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఎంటర్‌టైన్‌మెంట్‌ పరంగా ఇటు ప్రేక్షకుల్లోనూ, అటు సినీ వర్గాల్లోనూ కూడా భారీ అంచనాలే ఉన్నాయి. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam