Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

ఇంటర్వ్యూ

interview
బాల‌య్య సొంత మ‌నిషిలా చూసుకొన్నారు - శ్రీ‌వాస్ తో ముఖాముఖి
 
మాస్ సినిమాలే శ్రీ‌రామ‌ర‌క్ష‌.. అని న‌మ్ముతున్న కాలం ఇది. సినిమా అంటే కోట్ల‌తో ముడిప‌డిన వ్యాపారం,. అలాంట‌ప్పుడు ఫార్ములా క‌థ‌ల్ని ఎంచుకోవ‌డంలో త‌ప్పేం లేదు. శ్రీవాస్ రూటు కూడా అదే. ల‌క్ష్యం నుంచి.. డిక్టేట‌ర్ వ‌ర‌కూ ఆయ‌న సినిమాలన్నీ మాస్‌, యాక్ష‌న్ ఎలిమెంట్స్‌తో సాగేవే. అందులోనూ ఫ్యామిలీ ఎమోష‌న్స్‌ని జోడించి కుటుంబ ప్రేక్ష‌కుల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పిస్తారాయ‌. డిక్టేట‌ర్ స‌క్సెస్ సూత్రం కూడా ఇదే. ఈ సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం.. బాక్సాఫీసు ద‌గ్గ‌ర బాగానే ప‌రుగెడుతోంది. ఈ సందర్భంగా శ్రీ‌వాస్ తో గో తెలుగు జ‌రిపిన ముఖాముఖీ ఇది.
 
* పండ‌గ స‌క్సెస్ కొట్టేసిన‌ట్టేనా?
- ఇంకా అనుమానాలెందుకు?  ఈ సినిమా చూసిన ప్రేక్ష‌కులు, తీసిన మేం.. కొన్న బ‌య్య‌ర్లు అంతా హ్యాపీగా ఉన్నారు. పండ‌క్కి ఇదే ప‌ర్‌ఫెక్ట్ సినిమా అంటున్నారంతా.

* పెద్ద గా ప్ర‌యోగాల జోలికి పోకుండా ఫక్తు క‌మ‌ర్షియ‌ల్ సినిమానే ఎందుకు ఎంచుకొన్న‌ట్టు?
- బాల‌య్య అప్ప‌టికే 98 సినిమాలు చేసేశారు. అన్నిర‌కాల పాత్ర‌లూ పోషించారు. కొత్త‌గా చూపిద్దాం అనుకొన్న ప్ర‌తీ యాంగిల్ ఆయ‌న ట‌చ్ చేసిందే. అలాంటి క‌థానాయ‌కుడితో కొత్త క‌థ‌తోసినిమా తీయాల‌నుకోవ‌డం చాలా పెద్ద టాస్క్‌. అందుకే.. అంద‌రికీ తెలిసిన క‌థ‌నే కొత్త‌గా చూపిద్దామ‌నుకొన్నాం. ఆ విష‌యంలో స‌క్సెస్ అయ్యాం.

* అస‌లు బాల‌య్య కోస‌మే డిక్టేట‌ర్ క‌థ రాసుకొన్నారా, లేదంటే... క‌థ రాసుకొన్న త‌ర‌వాత బాల‌య్య‌ని సంప్ర‌దించారా?
- బాల‌య్య కోస‌మే రాసుకొన్న క‌థ ఇది. లౌక్యం సినిమా త‌ర‌వాత బాల‌య్య నుంచి క‌బురొచ్చింది. మ‌నం క‌ల‌సి ఓ సినిమా చేస్తున్నాం.. అన్నారు. అప్ప‌టికి క‌థ ఏదీ సిద్ధంగా లేదు. మా ప్రాజెక్టు కుదిరిన త‌ర‌వాత‌.. డిక్టేట‌ర్ క‌థ అల్లుకొన్నాం.

* బాల‌కృష్ణ - శ్రీ‌వాస్ క‌ల‌యిక అంటే అప్ప‌ట్లో కాస్త చ‌ర్చ‌నీయాంశ‌మైంది.. అభిమానుల్లోనూ అనుమానాలు ఉండేవి..
- నిజ‌మే.. ఇది షాకింగ్ కాంబినేష‌న్‌. చాలామంది బాల‌కృష్ణ‌తో నేనేదో కామెడీ సినిమా తీసేస్తున్నానేమో అనుకొన్నారు. కానీ బాల‌కృష్ణ స్థాయికి త‌గిన క‌థ రాసుకొన్నాం. అది మా తొలి విజ‌యం.

* లౌక్యంలో కామెడీ బాగా ప్ల‌స్ అయ్యింది.. ఈ సినిమాలో అదేం క‌నిపించ‌లేదు..
- నిజ‌మే. కాక‌పోతే ఓ విష‌యాన్ని గుర్తు పెట్టుకోవాలి. బాల‌కృష్ణ‌లాంటి ఫోర్స్ ఉన్న క‌థానాయ‌కుడితో కామెడీ చేయ‌కూడ‌దు. చాలా డిగ్నిఫైడ్ గా తీర్చిదిద్దిన పాత్ర అది. స‌డ‌న్‌గా కామెడీ చేస్తే పాత్ర ఔచిత్యం దెబ్బ‌తింటుంది. లౌక్యంలో నాకు ఆ స‌మ‌స్య ఎదురుకాలేదు. హీరో కామెడీ చేసినా.. జ‌నం చూశారు. అది ప్ల‌స్స‌య్యింది కూడా. ఈసినిమాలో ఎక్క‌డా.. బాల‌కృష్ణ పాత్ర‌ని ప‌రిధి దాటి చూపించలేదు. ఆయ‌న పాత్ర అండ‌ర్ ప్లే చేశాం.. శ‌క్తిమంత‌మైన డైలాగులు కూడా చాలా సెటిల్డ్‌గా ప‌లికించాం.

* స్టార్ క‌థానాయ‌కుడు దొరికితే కొత్త క‌థ‌లు రాసుకోలేమా?
- కొత్త క‌థ చెప్పాల‌ని నాకూ ఉంటుంది. కానీ.. దాన్ని స్టార్ తో సినిమాని వేదిక చేసుకోకూడ‌దు. నాలో ప్ర‌తిభ ఆవిష్క‌రించుకోవాలంటే.. షార్ట్ ఫిల్మ్ తీసుకొంటే చాలు. సినిమాపై వంద‌ల‌మంది ఆధార‌ప‌డి ఉంటారు. వాళ్ల‌ని రోడ్డుకి ఈడ్చేయ‌కూడ‌దు. మంచి సినిమా తీశారు.. కొత్త క‌థ చెప్పారు అన‌క‌పోయినా ఫ‌ర్వాలేదు. మీ సినిమా వ‌ల్ల జ‌నాలు రోడ్డుమీద ప‌డ్డారండీ అనే మాట విన‌కూడ‌దు.

* సంక్రాంతికి కావాల‌నే బ‌రిలో దిగారా?
- అదేం కాదు. సినిమా ఎప్పుడు మొద‌లైందో... అప్పుడే రిలీజ్ డేట్ ఫిక్స‌య్యాం.

* కానీ స‌రైన థియేట‌ర్లు దొర‌క‌లేదు క‌దా?
- అవును. ఉన్న థియేట‌ర్లు పంచుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఒక ద‌శ‌లో బ‌య్య‌ర్లు భ‌య‌ప‌డ్డారు. ముందే అన్ని ఏరియాలూ టేబుల్ ప్రాపిట్‌తో అమ్మేశాం. వాళ్ల‌కు కావ‌ల్సిన స్థాయిలో థియేట‌ర్లు దొర‌క‌లేదు. దాంతో ప‌రిస్థితి అర్థం చేసుకొని ఒక్కో ఏరియాకూ 15 శాతం డిస్కౌంట్ ఇచ్చాం. దాంతో బ‌య్య‌ర్లూ.. మేం కూడా హ్యాపీ.

* మోక్ష‌జ్ఞ అప్పుడ‌ప్పుడూ సెట్ కి వ‌చ్చేవాడ‌ట క‌దా?
- అవును.. త్వ‌ర‌లో తాను కూడా హీరో అవుతున్నాడుగా. షూటింగ్ వాతావ‌ర‌ణం అల‌వాటు అవుతుంద‌ని మోక్ష‌జ్ఞ‌ని మేమే సెట్‌కి ర‌మ్మ‌నేవాళ్లం.

* మోక్ష‌జ్ఞ కోసం క‌థ సిద్థం చేస్తున్నారా?
- బాల‌కృష్ణ వార‌సుడితో సినిమా చేయాల‌ని అంద‌రికీ ఉంటుంది. నాకూ ఉంది. కానీ.. త‌న తొలి సినిమాకి ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌న్న‌ది క‌థే నిర్ణ‌యించాలి.

* కోన వెంక‌ట్ ని పూర్తిగా ప‌క్క‌న పెట్టేశారా?
- అదేం కాదు... త‌ను వేరే ప‌నుల్లో బిజీగా ఉన్నాడు..

* చివ‌రిగా బాల‌కృష్ణ‌తో ప‌నిచేయ‌డం ఎలా అనిపించింది?
- ముందు అంద‌రూ భ‌య‌పెట్టారు. ఆయ‌న‌కు కోపం ఎక్కువ అన్నారు. కానీ ఆయ‌న చాలా కూల్‌. నిజాయ‌తీగా ఉండే వ్య‌క్తులంటే బాల‌య్య‌కు చాలా ఇష్టం. నేను ఆయ‌న ముందు అలానే ఉండేవాడ్ని. అందుకే త‌న ఇంటి మ‌నిషిలా చూసుకొన్నారు. షూటింగ్ పూర్త‌యిన రోజు సెట్లో ఉన్న‌వాళ్లంద‌రికీ డ‌బ్బులు పంచారు. ఆయ‌న తోటి వారిని గౌర‌వించే విధానం చూసి ఆశ్చ‌ర్య‌పోయా.

* త‌దుప‌రి సినిమా ఎప్పుడు?
- ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు సాగుతున్నాయి. త్వ‌ర‌లోనే ఆ వివ‌రాలు చెబుతా. 
మరిన్ని సినిమా కబుర్లు
anasuya in and as police