Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

వేదిక

గతసంచికలో ఏం జరిగిందంటే.... http://www.gotelugu.com/issue145/409/telugu-serials/vedika/vedika/

 “త్వరగా రా చంద్రా, అసలైనా ఇంత లేట్ అయిందే,” గాబరాగా ఆవిడ. 

అర్ధంకాక, గబగబా వెళ్లి ఎదురుగా సోఫాలో కూర్చున్నాను.   

 

డాన్స్ రిహార్సల్స్ గురించి నేను నోరు తెరిచే లోగా,  “మీ పేరెంట్స్, 

నీరూ ఆంటీ, జగదీష్ సహా అందరూ కొన్ని గంటలుగా నీకు ఫోన్ చేస్తున్నారుగా.  చూసుకోలేదా?”  ఆదుర్దాగా తేజశ్విని గారు. 

“లేదండీ, రిహార్సల్స్ కదా.  ఫోన్ ఆఫ్ చేసాను,” అంటూ బాగ్ నుండి ఫోన్ తీసి చెక్ చేసాను. 

నిజమే మిస్డ్-కాల్స్ ఎక్కువే ఉన్నాయి. 

 

తజశ్విని గారు లేచి వచ్చి,  పక్కనే కూర్చున్నారు.  

“కాల్స్ రిటర్న్ చేద్దువులే. ముందు విషయం  విను.   హార్ట్-ఎటాక్ వచ్చి, భూషణ్ గారు హాస్పిటల్లో ఉన్నారట.   ఆయన  పరిస్థితి ఎటూ చెప్పలేకుండా ఉందట.  మూడోసారట కదా! నీరూ ఆంటీ  చాలా బాధ పడుతుంది. 

ఆయన నీ కోసమే అడుగుతున్నారట. నీవు వెంటనే  ఇండియాకి బయలు దేరు చంద్రా. రేపు సాయంత్రం ఫ్లైట్ కి అన్ని ఏర్పాట్లు చేసాను.  మరేమీ ఆలోచించకు.  నేను చూసుకుంటానుగా.”  అన్నారామె, నా భుజంపై చేయి వేసి.   

** 

ఇండియాకి తిరుగు ప్రయాణమయ్యాను.  బ్యాగేజీ చెకిన్ చేయడానికి లైన్లో నిలబడ్డాను.  

భూషణ్ అంకుల్ పరిస్థితి గురించి ఆదుర్దాగా ఉంది. ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి, ఇంత సీరియస్ అయ్యారంటే, మరి నేను వెళ్ళేప్పటికి 

ఎలా ఉంటారో అని దిగులుగా ఉంది.  నా కోసమే అడుగుతున్నారు కాబట్టి, నేను వస్తున్నానని తెలిస్తే, కోలుకోవచ్చునేమో కూడా’ అన్నాడు జగదీష్.  

 

నెక్స్ట్ పాసెంజర్ ప్లీజ్,” అన్న టికెటింగ్ క్లార్క్ పిలుపుతో, ఆలోచనల నుండి తేరుకుని, వెళ్లి లగేజ్ చెకిన్ చేసి, బోర్డింగ్ పాస్ తీసుకున్నాను.  

 

దూరంగా వెయిటింగ్ ఏరియా లో, వెయిట్ చేస్తున్న విక్రమ్, తేజశ్విని గార్ల 

వద్దకి వెళ్లాను... 

నేను చెన్నై వెళుతున్నానని తెలిసి, డల్లాస్ నుండి వచ్చాడు విక్రమ్... 

** 

“కమాన్, ఫ్లైట్ కి టైం ఉందిగా.  కాఫీ షాప్ కి వెళదాము. నాకు ఆకలిగా కూడా ఉంది,” అంటూ నా చేతి నుండి హ్యాండ్ లగేజ్ అందుకున్నాడు విక్రమ్. 

 

కాఫీ హౌజ్ లో ఓ కార్నర్ టేబిల్ వద్దకు వెళ్లి కూర్చున్నాము. 

  

బాటిల్ నుండి వాటర్ సిప్ చేసి టేబిల్ పైనుంచారు తేజశ్విని గారు. 

“చూడమ్మా చంద్రా,  భూషణ్ గారి ఆరోగ్యం కుదుట పడుతుందిలే... దిగులు పడకు..

అక్కడ నువ్వు  కాస్త సెటిల్ అయ్యాక, మేము చెప్పిన విషయం అలోచించి, మీ పేరెంట్స్ తో కూడా సంప్రదించు.   నీ నుండి ‘ఓకే’ రాగానే, రెక్కలు కట్టుకుని, నిశ్చితార్దం చేసుకోడానికి మీ ముందు వాలిపోతాం నేను, విక్రమ్. వాళ్ళ డాడీ సహా,” అంది తేజశ్విని ఆంటీ.. 

 

విని, తలొంచుకుని మౌనంగా ఉండిపోయాను.   

 

“మామ్  ప్లీజ్.  ఇప్పుడు కూడానా? ఇక్కడైనా, కాసేపు ఆ సంగతి వదిలేయి.  ... చంద్రకళని వొత్తిడి చేయ వద్దని మీకు ఇది వరకే చెప్పాను.  అయినా మీరు, ఊరుకోలేదు.  ‘మా విక్రమ్ ని పెళ్లి చేసుకో’ మంటూ తనని వొత్తిడి చేస్తున్నారు.   

అదీ, భూషణ్ అంకుల్ గురించి వర్రీలో ఉన్నప్పుడు కూడా........ ఏంటి మామ్ మీరు,” కోపంగా విక్రమ్.    

 

“అది కాదురా.  నువ్వలా అన్నావనే,  నేరుగా తన పేరెంట్స్ ని అడగకుండా, 

చంద్రకళతోనే మాట్లాడాము.  తప్పేముంది?  వొత్తిడి చేయడం లేదు. 

తను ఆలోచించి నిర్ణయం తీసుకునే  అవకాశం ఉందికదా కన్నా,” శాంతంగా తేజశ్విని గారు. 

 

నేనే కల్పించుకున్నాను.  “పర్వాలేదు విక్రమ్.  ఎందుకు కోప్పడతావు?  మీ పేరెంట్స్ ఏ తప్పూ చేయలేదు,” అన్నాను. 

 

“ఓకే, థట్స్ ఫైన్...,” కాస్త రిలాక్స్ అయ్యాడు. 

“సరే, మీ కాఫీ ఫ్లేవర్స్  నాకు తెలుసు.  నీకిష్టమైన బేబీ-కార్న్ కూడా తెస్తాను. 

మరో గంటలో,  నీవు సెక్యూరిటి లైన్ లోకి వెళ్ళాలి కదా,”  నాతో అంటూ సీట్ నుండి పైకి లేచాడు. 

** 

అమెరికాలో బేబీ కార్న్ ఫ్రిటర్స్, వెనెలా కాఫీ ఎంజాయ్ చేయడం, బహుశ 

ఇది ఆఖరిసారౌతుందేమో, అనుకున్నాను. 

డల్లాస్ లో మెడిసిన్ చదువుతున్న విక్రమ్, సెలవలకి వచ్చినప్పుడల్లా, నా చేత రకరకాల ఫుడ్స్ టేస్ట్  చేయిస్తుంటాడు.  నాకు తెలుగు భాష ఇష్టమని, తెలుగులో చక్కగా  మాట్లాడ్డం నేర్చుకున్నాడు. 

మంచి స్నేహితుడుగా మారాడు విక్రమ్.  మనస్సు విప్పి అన్నీ షేర్ చేసుకునేటంతగా.  

** 

రెండు చేతుల్లో ట్రేలతో వచ్చి, స్నాక్ – కాఫీ, టేబిల్స్ మీద సర్దాడు, విక్రమ్.. 

“పెద్ద హర్రీ ఏమి లేదు.  ఎంజాయ్ యువర్ కార్న్ ఎండ్ కాఫీ... ,” అన్నాడు.... 

 

అలాగే అన్నట్టు తలాడించి, కాఫీ అందుకుని విక్రమ్ వంక చూసాను.   

ఏమిటన్నట్టు చూసాడు.  ఏమీ లేదన్నాను... 

 

కాఫీ సిప్ చేస్తూ, నిరుడు అకాడెమి ఓపెన్ హౌజ్ సందర్భంగా జరిగిన సంఘటన గుర్తు చేసుకున్నాను...  

 

ఆ రోజు క్రిస్టమస్ పార్టీ అయ్యాక,  నాతో మాట్లాడాలంటూ నా ఎదురుగా 

కూర్చునప్పటి విక్రమ్ నా కళ్ళెదుట నిలిచాడు.... 

 

“ఏమిటి విషయం?” అని నేనడిగినప్పుడు,  ”నేనంటే ఇష్టమేనా? నా లైఫ్ పార్టనర్ అవ్వమని నిన్ను అడిగితే, నీకు సమ్మతమేనా? ఎటువంటి సంకోచం లేకుండా చెప్పు. నేను ఆక్సెప్ట్ చేస్తాను,”  అని విక్రమ్ నన్ను సూటిగా అడిగినప్పుడు, నేను తడబడి పోవడం కూడా  బాగా గుర్తు.. 

 

అది చాలదన్నట్టు, “చూడు కళా, నీవు మరెవరినన్నా ఇష్ట పడుతుంటే, చెప్పు...నేనేమనుకోను... నేను నిన్ను పూర్తిగా సపోర్ట్ చేస్తాను,” అని విక్రమ్ అనడంతో,, అతనికి, జగదీష్ విషయం వివరించడం సులువైపోయిన వైనం గుర్తొచ్చింది..  

 

అతరువాత, తరచితరచి  నానుండి  అన్ని విషయాలు రాబట్టాడు విక్రమ్. జగదీష్ తో నాకున్న అనుబంధం గురించి - రాణి విషయంగా తలెత్తిన మా సమస్యలు - అంకుల్ నా వద్ద చేసిన అభ్యర్ధన గురించి కూడా 

చెప్పుకొన్నాను మరి.  

 

వెనెలా కాఫీ సిప్ చేస్తున్నా, ఆలోచనలతో, రుచి తెలియడం లేదు. 

 

“ఏమ్మా చంద్రా, మౌన వ్రతం పట్టినట్టుగా ఉన్నావు?” తేజశ్విని గారు అడగడంతో, తేరుకొన్నాను.   

ఎయిర్ పోర్టు లో  ఉన్నానన్న సంగతి స్పృహ లోకి వచ్చింది. 

 

“సరే, స్నాక్ ఫినిష్ చెయ్యి.  కార్న్ చల్లగా అయితే, బాగోదు...నేను ఐదు నిముషాల్లో వస్తాను,” అంటూ ఆవిడ వాష్ రూమ్ వైపుగా కదిలారు... 

 

వెళుతున్న ఆవిడనే చూస్తున్న నన్ను,  చేతిపై తట్టాడు విక్రమ్.... 

“నేనూ నోటిస్ చేసాను.  సీరియస్ ఆలోచనలో ఉన్నావే కళా? అడిగాడు.

సన్నగా నవ్వుతూ కాఫీ ఫినిష్ చేసాను. 

 

“ఒకటి మాత్రం గుర్తు పెట్టుకో.   నీకు అప్పుడు చెప్పాను – ఇప్పుడూ చెబుతున్నాను. ఒకవేళ, జగదీష్, తప్పని సరి సిట్యుయేషన్ లో రాణితో సెటిల్ అయితే -  దిగాలు పడిపోకు...నీ కోసం నేనున్నాను.   నాకు నువ్వంటే చాలా ఇష్టం.   పైగా నాకేం తొందర లేదు. వెయిట్ చేయ గలను.  

“నాకిక   కనబడకు – వినబడకు’ అని నువ్వు , అనేంత మటుకు, నేను వెయిట్ చేయ గలను,” ఆగి నవ్వుతున్న నా వంక చూసాడు. 

వాట్ ఇస్ దిస్ కళా? నేను సిన్సియర్ గా చెపుతుంటే, ఆ రోజు కూడా ఇలాగే నవ్వావు,” అంటూ నా చెవి పట్టుకున్నాడు.  

 

“అదిగో, మీ మమ్మీ వచ్చేసారు. పద విక్రమ్, నాకు ఇక ఫ్లైట్ కి టైం అవుతుంది,” అన్న నాతో పాటు లేచి టర్మినల్ వైపు నడిచాడు.  

****

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nagaloka yagam