Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
pounch patas

ఈ సంచికలో >> శీర్షికలు >>

వాస్తు - వాస్తవాలు - సూర్యదేవర వేణుగోపాల్ M. A ( జ్యోతిష్యం)

 

ఇంటికి లోపలి భాగం లో గాని వెలుపలి భాగం లో గాని ఇంటికి గాని గదులకు గాని నీచస్థానాలలో ద్వారాలు అమర్చకూడదు. నీచ దిశలైన దక్షిణ నైరుతి,పశ్చిమ నైరుతి, ఉత్తర వాయవ్యం, మరియు తూర్పు ఆగ్నేయం లందు దర్వాజాలు అమర్చకూడదు. ఈ దిశలందు దర్వాజాలు ఉంచి ఈ స్థానాల గుండా నడక సాగడం ప్రమాద హేతువు. అనేక రకాలైన ప్రమాదాలు గృహస్తుకు కలుగుతాయి. కనుక ఉచ్చ స్థానాలైన తూర్పు, ఉత్తర ఈశాన్యం, దక్షిణ ఆగ్నేయం మరియు పడమర వాయవ్యం నందు డోర్లు అమర్చి ఈ దిశలగుండా నడక సాగితే మనిషి జీవితం అబివృద్దిని పొందుతుంది.

ఈ దర్వాజాలను అమర్చే సందర్భంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సింహద్వారం ప్రక్కన తప్పనిసరిగా కిటికీ ఉండాలి. కిటికీ లేకుండా సింహద్వారం ఉండ కూడదు. డోర్ కనుక మధ్యలో ఉంటే ఈ డోర్ కు ఇరు వైపులా తప్పనిసరిగా కిటికీలు ఉండాలి. సింహద్వారం మిగిలిన ద్వారాల కన్నా ఎత్తులో మరియు వెడల్పు లో ఎంతో కొంత పెద్దగా ఉండాలి. సింహా ద్వారాన్ని మించిన కొలతతో లోపలి దర్వాజాలు ఉండకూడదు. దర్వాజాలకు ఎదురుగా దర్వాజా ఉండుట మంచిది. అలా ఉంచలేని పక్షం లో కనీసం కిటికీని  అయినా ఉంచాలి. దర్వాజాలకు ఎదురుగా బోర్ లు బావులు, సెప్టిక్ ట్యాంక్ లు ఉండరాదు. దర్వాజాలకు ఎదురుగా పిల్లర్ కూడా ఉండరాదు. ఇటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.

దర్వాజలు కిటికీ లు ఒకే రకమైన కలప తో చేయించుట మంచిది. లేదా 2 రకాలైన కలపతో అయినా ఫరవాలేదు. అంతేకాని 2 రకాలకన్నా ఎక్కువ జాతి తో కలప ఉండకూడదు. వేప కలప వాడినట్లైతే గడప మాత్రం వేరే కలపతో ఉండాలి. గడపకు వేప కలప వాడకూడదు. ఇంటికి వాడే కలప బాగా ఆరుదల కట్టే అయి ఉండాలి. పచ్చి కట్టే వాడ కూడదు. పాత కలప, పుచ్చిపోయిన కలప వాడరాదు. దర్వాజాలను తొర్రలున్న కట్టేతో చేయించరాదు. పిడుగు పడిన గృహ కలపను నూతన గృహానికి వినియోగించరాదు.

దర్వాజాలు అమర్చే సందర్భంలో తప్పనిసరిగా వాస్తు పండితుని సలహా అవసరం.  అన్నీ జాగ్రత్తలు తీసుకొని దర్వాజాలు అమర్చాలి. మంచి దిశకు ఉన్న దర్వాజ మంచి ఫలితాన్ని అందిస్తుంది. దర్వాజాకు ఎదురుగా చెట్లు కానీ నీటిప్రవాహపు పోటు గానీ ఉండరాదు. దర్వాజా సెంటర్ నందు ఆలయాల నీడ లేదా ధ్వజ స్తంభం ఉండకూడదు. ఆలయం ఉండకూడదు. దర్వాజులు వేసేటప్పుడు గాని తీసే తప్పుడు గాని భయంకరమైన ధ్వనులు రాకూడదు. దర్వాజలపై క్రూర మృగాల బొమ్మలు ఉంచరాదు. దర్వాజాలకు ఎదురుగా మెట్లు ఉండకూడదు. మరుగు దొడ్లు దర్వాజాకు ఎదురుగా రాకూడదు. గోడ మూలలు దర్వాజలో ఉండరాదు. ఈ విధంగా దర్వాజా లు అన్నీ జాగ్రత్తలు తీసుకొని అమర్చితే మంచి లాభం కలుగుతుంది...

మరిన్ని శీర్షికలు
navvunalugu yugaalu