Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview

ఈ సంచికలో >> సినిమా >>

శౌర్యం చూపించడానికి మనోజ్‌ రెడీ

manoj ready...

ఇంత వరకూ రఫ్‌ లుక్‌లో మాస్‌ హీరోలా కనిపించే మంచు మనోజ్‌ క్లాస్‌ గెటప్‌ వేశాడు. ఇంజనీర్‌ పాత్రలో మనోజ్‌ కొత్తగా డీసెంట్‌గా కనిపిస్తున్నాడు. గెటప్‌తోనే కాదు సినిమాలో కూడా కూల్‌గా మెచ్యూర్డ్‌గా కనిపించి ప్రేక్షకులకు కొత్తదనాన్నివ్వబోతున్నాడట. 'పోటుగాడు', కరెంట్‌ తీగ' వంటి సినిమాలు కాస్త నిరాశపర్చడంతో ఇకపై చేయబోయే సినిమాలపై ఇంకా అదనంగా ఫోకస్‌ పెట్టాలని నిర్ణయించుకున్న మనోజ్‌, కొత్త రూట్‌లో ట్రై చేస్తున్నాడు. అలా వస్తోన్న సినిమానే 'శౌర్య'. చాలా గ్యాప్‌ తర్వాత దశరధ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రెజీనా హీరోయిన్‌గా నటిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్లకు పెద్ద పీట వేసే దర్శకుల్లో దశరధ్‌ ఒకరు.

ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా మంచు వారబ్బాయికి మంచి పేరు తెచ్చిపెట్టే లిస్ట్‌లో చేరనుందని సినీ వర్గాల్లోనూ ప్రచారం జరుగుతోంది. దాదాపుగా షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ నెల 31న ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ జరగనుంది. థ్రిల్లింగ్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే నెల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

మరిన్ని సినిమా కబుర్లు
venkee ready to entertainment