Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
lavanya  lucky

ఈ సంచికలో >> సినిమా >>

సమ్మర్‌లో నితిన్‌ కూల్‌ కూల్‌గా!

nitin as cool

వరుస సినిమాలతో హిట్టు మీద హిట్టు కొట్టి కొన్నాళ్ళు మంచి ఊపు మీద కనిపించిన నితిన్‌ కెరీర్‌ మళ్ళీ కొంచెం స్లో అయ్యింది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో నితిన్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'ఆ ఆ' సినిమా షూటింగ్‌ మొదలై చాలా కాలమే అయ్యింది. ఈ సినిమాను నిజానికి సంక్రాంతికే వచ్చేస్తుందని ప్రచారమైతే జరిగిందిగానీ, సినిమా సంక్రాంతి సీజన్‌లో అభిమానుల ముందుకు రాలేకపోయింది. తాజాగా వినిపిస్తున్న గాసిప్స్‌ని బట్టి సమ్మర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

క్రేజీ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. మరో హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ కూడా నటిస్తోంది. తక్కువ బడ్జెట్‌తోనే ఈ సినిమాను తెరకెక్కించాలనుకున్నప్పటికీ, షూటింగ్‌ లేట్‌ కావడంతో బడ్జెట్‌ అనుకున్న దాని కన్నా ఎక్కువే అవుతుందట. దాంతో సినిమాలో క్వాలిటీ కూడా పెరగనుందట. సో ఈ మధ్య కాస్త స్లో అయిన నితిన్‌కి త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో రానున్న 'అఆ' మంచి విజయాన్ని తెచ్చి పెడుతుందని చెప్పడం నిస్సందేహమే. కూల్‌ కూల్‌గా సమ్మర్‌లో ఆడియన్స్‌ ముందుకు వచ్చేస్తోన్న నితిన్‌, తిరిగి సక్సెస్‌ ట్రాక్‌లో సూపర్‌ ఎక్స్‌ప్రెస్‌లా దూసుకుపోవాలని ఆశిద్దాం.

మరిన్ని సినిమా కబుర్లు
bunny look super