Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nitin as cool

ఈ సంచికలో >> సినిమా >>

'సరైనోడు'గా బన్నీ లుక్‌ కెవ్వు కేక

bunny look super

'రేసుగుర్రం' సినిమాలో డిఫరెంట్‌ షేడ్స్‌తో ఫుల్‌ ఎనర్జీతో చెడుగుడు ఆడేశాడు బన్నీ. పోలీస్‌ గెటప్‌లో కనిపించింది కొద్ది సేపే అయినప్పటికీ సినిమాలో ఎనర్జీని పీక్స్‌లో చూపించింది. ఈ సినిమా బాక్సాఫీస్‌కి వసూళ్ల వర్షం కురిపించడమే కాకుండా, బన్నీ కెరీర్‌లో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఇదంతా డ్రస్స్‌ మాయే అనడంతో అతిశయోక్తి కాదు. అందుకే తనకి బాగా కలిసొచ్చిన ఈ ఖాకీ డ్రెస్‌తోనే మళ్లీ బన్నీ నెక్స్ట్‌ సినిమా 'సరైనోడు' కూడా తెరకెక్కబోతోందని సమాచారం. ఈ సినిమాలో కూడా బన్నీ పోలీసాఫీసర్‌ పాత్రలో కనిపించనున్నాడట. బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, కేధరిన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌ ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఆది పినిశెట్టి ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు.

అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ సినిమా కథ ఉంటుందని డైరెక్టర్‌ బోయపాటి తెలిపారు. అంజలి, బన్నీ కాంబినేషన్లో తెరకెక్కిన ఐటమ్‌ సాంగ్‌ ఆట్టుకునే విధంగా వుంటుందట. బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ఏప్రిల్‌ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే యోచనలో చిత్రయూనిట్‌ ఉంది. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు ఆరవింద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondichooddam