Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

ఇంటర్వ్యూ

interview

నా బెడ్‌రూమ్‌లో ఒంట‌రిగా ప‌డుకోలేను! - హ‌న్సిక‌చేస్తున్న సినిమాల‌తో ఓసారి..

న‌డుపుతున్న ప్రేమాయ‌ణాల‌తో మ‌రోసారి..
సేవా కార్య‌క్ర‌మాల‌తో ఓసారి..
ఏదోలా వార్త‌ల్లో నిలిచే క‌థానాయిక‌... హ‌న్సిక‌.  స‌దా మీడియా విష‌యంలో.. సెంట్రాఫ్ ఎట్రాక్ష‌న్‌గా నిలుస్తుంటుంది. తెలుగులో సినిమాలు త‌గ్గినా.. హ‌న్సిక టాప్ హీరోయిన్ గానే చ‌లామ‌ణీ అవుతోంది. త‌మిళంలో మాత్రం... హ‌న్సిక ఫుల్ బిజీ. ఆమె కాల్షీట్లు దొర‌క‌డ‌మే గ‌గ‌నం అయిపోతోంది.  ఇప్పుడు క‌ళావ‌తిగా భ‌య‌పెట్ట‌డానికి రెడీ అయ్యింది.  ఈ శుక్ర‌వారం ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ సంద‌ర్భంగా త‌న సినిమాల గురించీ, త‌నపై పుట్టుకొచ్చిన గాసిప్పుల గురించీ.. ఇలా చెప్పుకొచ్చింది.


* హాయ్‌.. హ‌న్సిక‌
- హాయ్‌...

* తెలుగు ప్రేక్ష‌కుల్ని మ‌ర్చిపోయిన‌ట్టున్నారు..
- (న‌వ్వుతూ) అదేం లేదండీ. నాకు ఇంత క్రేజ్‌, పేరు... రావ‌డానికి కార‌ణం తెలుగు ప్రేక్ష‌కులే. ఇక్క‌డి సినిమాల‌తోనే నేను ఎదిగా. అలాంటి ప‌రిశ్ర‌మ‌నీ, ప్రేక్ష‌కుల్నీ ఎందుకు మ‌ర్చిపోతాను?

* కానీ తెలుగు సినిమాలు చేయ‌డం లేదు క‌దా?
- చేయ‌కూడ‌దు అని రూలేం పెట్టుకోలేదు. న‌టిగా నాకు మంచి సినిమాల్లో న‌టించ‌డ‌మే ప్ర‌ధానం.. ఏదో చేతికి అందేశాయి క‌దా అని వ‌చ్చిన సినిమాలు చేసుకొంటూ వెళ్ల‌లేను. ప్ర‌స్తుతానికి నాకు త‌మిళ‌నాట మంచి పాత్ర‌లు దొరుకుతున్నాయి.. తెలుగులో మంచి క‌థ దొరికితే... ఎట్టిప‌రిస్థితుల్లోనూ వ‌దులుకోను.

* ఈమ‌ధ్య తెలుగులో క‌థ‌లేం వినిపించ‌లేదా?
- విన్నాను. కానీ ఏదీ న‌న్ను ఎగ్జ‌యిట్ చేయ‌లేదు. అలాంటి పాత్ర కోసం నేనూ చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నా.

* ప‌దేళ్ల నుంచీ తెలుగులో న‌టిస్తున్నారు.. ఇంకా తెలుగు నేర్చుకోలేదు..
- అవును.. ఆ విష‌యంలో గిల్టీగా ఫీల‌వుతున్నా. తెలుగు భాష నాకు బాగానే అర్థం అవుతుంది. కానీ... తిరిగి తెలుగులో మాట్లాడ‌లేనంతే.  అతి త్వ‌ర‌లో తెలుగు నేర్చుకొని.. నా పాత్ర‌కు నేనే డ‌బ్బింగ్ చెప్పుకొంటాన‌నే న‌మ్మ‌కం నాకుంది.

* ఇంత‌కీ డ‌బ్బింగ్ సినిమా క‌ళావ‌తి  విశేషాలేంటి?
- ఇది డ‌బ్బింగ్ సినిమా అయినా.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంది. మీ అంద‌రికీ తెలిసిన న‌టీన‌టులే ఇందులో ఉన్నారు. సిద్దార్థ్‌, త్రిష నేనూ... ఇలా అంద‌రం తెలిసిన‌వాళ్ల‌మే క‌దా. అందుకే దీన్నీ ఓ తెలుగు సినిమాగానే చూడండి.

* ఇందులో గ‌ర్భ‌వ‌తిగా న‌టించార‌ట‌..
- అవును.. నా కెరీర్‌లో చాలా వైవిధ్య‌మైన పాత్ర ఇది. ద‌ర్శ‌కుడు సుంద‌ర్ సి.. ఈ పాత్ర గురించి చెప్ప‌గానే షాక‌య్యా. నేను గ‌ర్భ‌వ‌తిగా క‌నిపిస్తే... ప్రేక్ష‌కులు రిసీవ్ చేసుకొంటారా, లేదా? అని ఆలోచించా. కానీ.. నాకు ఛాలెంజ్ అంటే చాలా ఇష్టం. ఇలాంటి పాత్ర‌ల్లోనే న‌న్ను నేను పూర్తిగా నిరూపించుకోగ‌ల‌ను అనిపించింది.

* బేసిగ్గా.. హార‌ర్ సినిమాల్ని చూడ్డానికి మీరు ఇష్ట‌ప‌డ‌తారా?
- నో.. నెవ్వ‌ర్‌. నాకు హార‌ర్ సినిమాలంటే చాలా భ‌యం. దాదాపు ప‌ద‌మూడేళ్ల త‌ర‌వాత తొలిసారి హార‌ర్ సినిమా చూశా. అదే.. చంద్ర‌క‌ళ‌. అదీ మా అమ్మ‌ని ప‌క్క‌న కూర్చోబెట్టుకొని చూడాల్సివ‌చ్చింది. బేసిగ్గా నాకు భ‌యం ఎక్కువ‌. నా బెడ్‌రూమ్‌లో ఒక్క‌దాన్నే ప‌డుకోవ‌డానికి కూడా భ‌య‌ప‌డ‌తా. అలాంటిది హార‌ర్ సినిమాల్ని ఎలా చూస్తా. న‌టించ‌డం మాత్రం ఈజీనే.. (న‌వ్వుతూ)

* ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో త్రిష‌తో గొడ‌వ‌లు ప‌డ్డార‌ని టాక్‌...
- అదేం కాదు. నాకు త్రిష ఎప్ప‌టి నుంచో తెలుసు. మేమిద్ద‌రం ఈ సినిమాతో మ‌రింత క్లోజ్ అయిపోయాం. ఇలాంటి పుకార్లు ఎలా పుడ‌తాయో నాకు అర్థం కాదు.

* మీపై ర‌క‌ర‌కాల రూమ‌ర్లు వ‌స్తుంటాయి.. వాటిపై ఎందుకు స్పందించ‌రు?
- స్పందించాల్సిన అవ‌సరం ఏమిటి? ఒక‌దాని గురించి మాట్లాడితే.. మ‌రో పుకారు బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఇలా ఎన్నింటిక‌ని స‌మాధానం చెప్పుకోను. మ‌రీ అంత‌గా అనిపిస్తే.. ట్విట్ట‌ర్ ఉంది క‌దా.. అందులో నా భావాల్ని బ‌య‌ట‌పెడ‌తా.

* యాపిల్ పిల్ల అనే ఇమేజ్ మీకెప్పుడైనా ఇబ్బంది క‌లిగించిందా?
- ఇబ్బంది ఎందుకు.. అలా పిలిస్తే చాలా గ‌ర్వంగా ఫీల‌వుతా. కానీ ఓ నిజం చెప్ప‌నా... నాకు యాపిల్స్ అంటే ఇష్టం ఉండ‌దు.

* అదేంటి?
- అవును... అస‌లు నాకెప్పుడూ తిండి ధ్యాసే ఉండ‌దు. దేశముదురు టైమ్‌లో తెగ తినేదాన్ని. అందుకే అంత లావుగా ఉండేదాన్ని. ఆ త‌ర‌వాత నా డైట్‌ని పూర్తిగా కంట్రోల్‌లో పెట్టా.

* శింబుతో మీ బంధం ముగిసిన‌ట్టే అనుకోవొచ్చా?
- నా వ్య‌క్తిగ‌త జీవితం గురించి మాట్లాడ‌డం నాకు ఇష్టం ఉండ‌ద‌ని ముందే చెప్పా. శింబు తో ఎపిసోడ్‌.. ఎప్పుడో ముగిసిపోయిన క‌థ‌. దాని గురించి మ‌ళ్లీ మ‌ళ్లీ మాట్టాడ‌డం ఎందుకు?  నా గురించీ, నా సినిమాల గురించీ, నా న‌ట‌న గురించీ  ఏమైనా అడ‌గండి.. చెబుతా. గాసిప్పుల గురించి ఏం మాట్లాడుకొన్నా టైమ్ వేస్ట్‌.

* రాబోతున్న సినిమాలేంటి?
- తమిళంలో నాలుగు సినిమాలు చేస్తున్నా..

* బాలీవుడ్‌లో మ‌ళ్లీ ఎప్పుడు?
- ప్ర‌స్తుతానికైతే ఆ ఆలోచ‌న‌లేదు. మంచి క‌థ వ‌స్తే.. ఎప్పుడైనా, ఎక్క‌డైనా న‌టించ‌డానికి సిద్ధ‌మే.

మరిన్ని సినిమా కబుర్లు
manoj ready...