Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

సీతమ్మఅందాలు రామయ్య సిత్రాలు - చిత్ర సమీక్ష

seetamma andalu ramayya sitralu - movie review

చిత్రం: సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు 
తారాగణం: రాజ్‌ తరుణ్‌, ఆర్తన, రాజా రవీంద్ర, శంకర్‌, షకలక శంకర్‌, రణధీర్‌, ఆదర్శ్‌, సురేఖా వాణి, శ్రీలక్ష్మి, హేమ తదితరులు. 
సంగీతం: గోపీ సుందర్‌ 
ఛాయాగ్రహణం: విశ్వ డిబి 
నిర్మాణం: శ్రీ శైలేంధ్ర ప్రొడక్షన్స్‌ 
దర్శకత్వం: శ్రీనివాస్‌ గవిరెడ్డి 
నిర్మాతలు: ఎన్‌.శైలేంద్రబాబు, కె.వి. శ్రీధర్‌రెడ్డి, హరీష్‌ దుగ్గిశెట్టి 
విడుదల తేదీ: 29 జనవరి 2016 


క్లుప్తంగా చెప్పాలంటే 
లైఫ్‌ గురించి పెద్దగా పట్టింపుల్లేని ఓ సరదా విలేజ్‌ కుర్రాడు రామ్‌ (రాజ్‌తరుణ్‌). తానుండే రామచంద్రాపురం ఊళ్ళోనే రామ్‌, సీతామహాలక్ష్మి (ఆర్తన)ని చిన్నప్పటినుంచీ ప్రేమిస్తుంటాడు. ప్రేమించిన అమ్మాయి కోసం ఇష్టమైన ఆట క్రికెట్‌ని కాదనుకున్న రామ్‌, సీతకు తన ప్రేమను తెలియజేయడంలో విఫలమవుతుంటాడు. ఉన్నత చదువుల కోసం పట్నం వెళ్ళిపోతుంది సీత. సెలవుల్లో సీత వస్తోందంటే చాలు, ఆమెకు తన ప్రేమ తెలియజేయడానికి విఫలయత్నాలు చేస్తాడు రామ్‌. రామ్‌ తన ప్రేమను వ్యక్తం చేయడంలో సఫలమయ్యాడా? ఈ క్రమంలో రామ్‌ ఎదుర్కొనే ఇబ్బందులేమిటి? అన్నవి తెరపై చూడాల్సిందే. 


మొత్తంగా చెప్పాలంటే 
పల్లెటూరి కుర్రాడిలా, గోదావరి జిల్లాలకు చెందిన సగటు యువకుడిగా రాజ్‌తరుణ్‌ ఆకట్టుకున్నాడు. తొలి సినిమా అదే నేటివిటీతో చేసిన రాజ్‌తరుణ్‌ మళ్ళీ అలాంటి నేటివిటీలోనే కనిపించాడు. ఇలాంటి పాత్రలు అతనికి కొట్టిన పిండి. చూడ్డానికి బక్కగా ఉంటాడుగానీ, స్క్రీన్‌ మీద ఎనర్జీతో చెలరేగిపోవడంలో రాజ్‌తరుణ్‌ సూపర్‌. హీరోయిన్‌ ఆర్తన అందంగా ఉంది. నటన పరంగా బాగానే చేసింది. మిగతా పాత్రధారులంతా తమ తమ పాత్రల పరిధిమేర బాగా చేశారు. షకలక శంకర్‌ గ్యాంగ్‌ కామెడీ పండింది. రాజా రవీంద్ర, హీరోయిన్‌ తండ్రిగా బాగా చేశాడు. 
అందరికీ తెలిసిన కదే. తెరపై ఎన్నోసార్లు చూసేసిన కథే. కానీ ప్రేమకథ ఎన్నిసార్లు తెరపై వచ్చినా కొత్తగానే ఉంటుంది. కొత్తదనంతో ప్రయత్నించిన ప్రతిసారీ లవ్‌ స్టోరీస్‌ సక్సెస్‌ అవుతూనే ఉన్నాయి. తగినంత ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫీల్‌ ఉంటే రొటీన్‌ కథలైనా బాగానే ఉంటాయి. ఈ సినిమా విషయంలో రెండోదే జరిగింది. కథ ఓకే. కథనం ఫర్వాలేదు. సరదాగా సరదాగా సినిమా ఉండేలా చూసుకోవడంలో దర్శకుడు సఫలమయ్యాడు. పాటలు బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఓకే. ఎడిటింగ్‌ ఇంకాస్త అవసరమినిపిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణపు విలువలు బాగున్నాయి. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి. 
ఫస్టాఫ్‌ సరదా సరదాగా సాగిపోతుంది. విలేజ్‌ నేటివిటీలో వచ్చే సన్నివేశాలు, హీరోయిన్‌ కోసం హీరో ప్రయత్నాలు వంటివి ఇంట్రెస్టింగ్‌గానే ఉంటాయి. సెకెండాఫ్‌లో కథలో ఆసక్తికరమైన సన్నివేశాలు తెరపైకొస్తాయి. ఇక్కడా ఎంటర్‌టైన్‌మెంట్‌ మిస్‌ అవలేదు. ఓవరాల్‌గా ఫన్‌తోనే నెట్టుకొచ్చేశాడు దర్శకుడు. క్రికెట్‌ నేటి యూత్‌కి ఇంట్రెస్టింగ్‌ గేమ్‌ కావడంతో దాని చుట్టూ కథ అల్లుకున్న దర్శకుడు అందులో సఫలమయ్యాడు. ఎంటర్‌టైనింగ్‌ సీన్స్‌తోపాటు, ఏమోషనల్‌ సీన్స్‌ కూడా ఆకట్టుకుంటాయి. 


ఒక్క మాటలో చెప్పాలంటే 
సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు సూద్దాం రారండీ 
అంకెల్లో చెప్పాలంటే: 2.7/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka