Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
veekshanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

తెలంగాణా మటన్ కర్రీ - పి . శ్రీనివాసు

కావలిసిన పదార్ధాలు: ఉల్లిగడ్డలు, టమాటాలు, కొబ్బరిపాలు, లవంగాలు, యాలకులు, సాజీర, దాల్చినచెక్క, కొత్తిమీర, మటన్, పెరుగు, పసుపు, కారం, అల్లంవెల్లుల్లి పేస్ట్, నూనె

తయారుచేసే విధానం: ముందుగా మటన్  ముక్కలకు పెరుగు, ఉప్పు, అల్లంవెల్లుల్లి పేస్ట్,  కారం, పసుపు వేసి కలిపి  గంటసేపు అలాగే వుంచాలి. తరువాత కుక్కర్ లో నూనె వేడి కాగానే ఉల్లిపాయలు వేసి  అవి వేగాక తయారుచేసి  మటన్ ముక్కలను , టమాటలను వేసి కలిపి 6 విజిల్స్ వచ్చేవరకూ వుంచాలి. తరువాత కొబ్బరిపాలను పోసి బాగా మరగనివ్వాలి. తరువాత గరం మసాలా పొడిని వేసి, చివరగా కొత్తిమీరను కూడా వేయాలి. అంతే వేడి వేడి తెలంగాణ మటన్ కర్రీ రెడీ..      

మరిన్ని శీర్షికలు
weekly horoscope 5th February  to 11th February