Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
movie review

ఈ సంచికలో >> సినిమా >>

ఇంటర్వ్యూ

interview

ఎన్నికోట్లు పెట్టినా.. తిరిగొచ్చేస్తాయ‌న్న‌ న‌మ్మ‌కం ఉంది!- బెల్లంకొండ‌ సాయి శ్రీ‌నివాస్‌

22 ఏళ్ల వ‌య‌సు.. మంచి హైటు
చూడ్డానికి బాగుంటాడు.
డాన్సులు ఇర‌గ‌దీస్తాడు..
ఫైట్లూ కుమ్మేస్తాడు..
పైగా ఓ అగ్ర‌స్థాయి నిర్మాత కొడుకు..!  - ఇంకేం కావాలి?  చెల‌రేగిపోవొచ్చు. అల్లుడు శీనులో బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ అదే చేశాడు. ఏ క‌థానాయ‌కుడికీ ల‌భించ‌నంత గ్రాండ్ ఎంట్రీ.. శ్రీ‌నివాస్‌కి ద‌క్కింది. తొలి సినిమాకే రూ.40 కోట్లు ఖ‌ర్చుపెట్టారు. అంతా.. రాబ‌ట్టుకొన్నారు కూడా. ఇక రెండో సినిమా నుంచీ... త‌న‌ని తాను నిల‌బెట్టుకోవాలి, నిరూపించుకోవాలి!  స్పీడున్నోడుతో ఆ అవ‌కాశం వ‌చ్చేస్తుంద‌ని శ్రీనివాస్ న‌మ్మ‌కం. ఈ చిత్రం శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా శ్రీ‌నివాస్‌తో... గో తెలుగు చిట్ చాట్‌!

 
* హాయ్‌...
- హాయండీ...

* బాగా స్పీడు స్పీడుగా ఉన్నారు..
- (న‌వ్వుతూ) అవునా...?!  నిన్నే స్నేహితుల‌తో సినిమా చూశా. నాకైతే బాగా న‌చ్చేసింది. నా ఫ్రెండ్స్ కూడా `సినిమా అదిరిపోయింది` అన్నారు.

* నాన్న‌గారి మాటేంటి?
- గ‌ట్టిగా ఓ హ‌గ్ ఇచ్చారు. అమ్మ మొహంలో ఎక్స్‌ప్రెష‌న్ లేదు. క్లైమాక్స్‌లో అంద‌రూ ఎమోష‌న్ అయిపోయారు. చాలామంది క‌ళ్ల‌లో నీళ్లు తిరిగాయి.

* మ‌రీ అంత ఎమోష‌న‌ల్ క్లైమాక్స్ అంటే... తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎక్కుతుందంటారా?
- సుంద‌ర‌పాండ్య‌న్ మెయిల్ హైలెట్ క్లైమాక్సేనండీ.  ఆసినిమా చూసిన కొన్ని రోజుల వ‌ర‌కూ.. నా మైండ్ స‌రిగా ప‌నిచేయ‌లేదు. అంత‌లా హాంట్ చేసింది. ఇక్క‌డి ప్రేక్ష‌కుల‌కూ త‌ప్ప‌కుండా అలాంటి ఫీలింగే క‌లుగుతుంది. ఈ రోజులో థియేట‌ర్‌లోంచి బ‌య‌ట‌కు అడుగుపెట్టిన వెంట‌నే సినిమాని మ‌ర్చిపోతున్నాం. కానీ స్పీడున్నోడు అలా కాదు.. క‌చ్చితంగా ఒక్క నిమిష‌మైనా సినిమా గురించి ఆలోచిస్తారు.

* త‌మిళంలో శశి కుమార్ న‌టించారు. ఆ పాత్ర మీకు సెట్ట‌వుతుంద‌ని అనిపించిందా?
- శ‌శి పాత్ర‌లో ఎవ‌రైనా సెట్ట‌యిపోతారండీ. అది ఏ క‌థానాయ‌కుడికైనా న‌ప్పే క్యారెక్ట‌ర్‌. నాలాంటి కొత్త‌వాళ్ల‌కూ, స్టార్ హీరోకైనా అతికిన‌ట్టు సరిపోతుంది. కాబ‌ట్టి.. ఎలాంటి సందేహాలూ రాలేదు.

* తొలి సినిమాలో డాన్సులు, ఫైటింగులు బాగా చేశారు. స్పీడున్నోడు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస‌రికి ఈ విష‌యాల్లో అంచ‌నాలు రెట్టింపు అవుతాయి క‌దా?
- అవునండీ.. ఆ సంగ‌తి నాకూ తెలుసు. అందుకే అల్లుడు శ్రీ‌ను కంటే.. ప‌ది రెట్లు ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డ్డాను.

* బ‌డ్జెట్ కూడా అదే స్థాయిలో అయ్యింద‌ట‌..
- క‌థ‌కు అనుగుణంగానే ఖ‌ర్చు పెట్టారు. తొలి సినిమా కోసం రూ.40 కోట్లు పెట్టారు. ఆ డ‌బ్బుల‌న్నీ తిరిగొచ్చేశాయి క‌దా?  పెట్టిన ప్ర‌తీ రూపాయీ మ‌ళ్లీ రాబ‌ట్టుకోవ‌చ్చ‌న్న న‌మ్మ‌కం ఉంది.

* అల్లుడు శీనుతోనే మీ నాన్న‌గారు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయార‌ని ఓ టాక్‌...
- అబ్బే... అలాంటిదేం లేదండీ. నా తొలి సినిమాకి ఎంత ఖ‌ర్చు పెట్టారో అదంతా దాదాపుగా వ‌చ్చేసింది. అంత‌కు ముందు ఆయ‌న పంపిణీ చేసిన కొన్ని సినిమాలు భారీ న‌ష్టాలు చ‌విచూడాల్సివ‌చ్చింది. ఆ న‌ష్టం కూడా నా ఎకౌంట్‌లో వేసేస్తానంటే ఎలా?

* చూస్తుంటే రెండో సినిమాకూడా మాస్‌నే న‌మ్ముకొన్న‌ట్టుంది... మీ వ‌య‌సులో ప్రేమ‌క‌థ‌లు బాగా న‌ప్పుతాయి క‌దా?
- కావొచ్చు.. కానీ అలాంటి స్వ‌చ్ఛ‌మైన అంద‌మైన ప్రేమ క‌థ‌లు దొర‌కాలి క‌దా?  మాస్ క‌థ‌లే అయినా.. నేను మ‌రీ ఊర మాస్‌సినిమాలే చేయ‌లేదు. స్పీడున్నోడులో ఫ్యామిలీ ఎమోష‌న్స్ కూడా ఉంటాయి.

* సెంటిమెంట్ కోసమే త‌మ‌న్నాతో స్పెష‌ల్ సాంగ్ చేయించారా?
-  నా తొలి సినిమాలో భారీ కాస్టింగ్ ఉంది. స‌మంత‌ని క‌థానాయిక‌గా తీసుకొన్నాం. ప్ర‌కాష్ రాజ్ , బ్రహ్మానందం లాంటి హేమాహేమీల‌ను తీసుకొన్నాం. స్పీడున్నోడుకీ స్టార్ క‌థానాయిక‌నే ఎంచుకొందాం అనుకొన్నాం. కానీ.. క‌థ రీత్యా కొత్తమ్మాయి అయితేనే బాగుంటుంద‌నిపించింది. అందుకే సోనారిక‌ని ఎంచుకొన్నాం. అయితే భీమినేని మాత్రం `మ‌న సినిమాలో ఓ స్పెష‌ల్‌సాంగ్ ఉంటే బాగుంటుంది` అన్నారు. స్పెష‌ల్ సాంగ్ అంటే డాన్సులు బాగా చేసే అమ్మాయి కావాలి. అలాంటి క‌థానాయిక తెలుగులో త‌మ‌న్నా ఒక్క‌ర్తే. అందుకే త‌న‌ని తీసుకొన్నాం.

* బోయ‌పాటి శ్రీ‌ను సినిమాలో త‌మ‌న్నానే క‌థానాయిక అంటున్నారు..
- కావొచ్చు. అన్నీ కుదిరితే త‌మ‌న్నానే క‌థానాయిక‌గా తీసుకొంటాం.

* రెండో సినిమానే బోయ‌పాటి శ్రీ‌నుతో చేయాలి క‌దా?
- అవును.. ఆ స‌మ‌యంలో కొన్ని క‌థ‌లు చెప్పారు. కానీ కుద‌ర్లేదు. ఈసారి మాత్రం క‌చ్చితంగా ఉంటుంది.

* క‌థ‌ల విష‌యంలో మీ నాన్న‌గారి ఇన్వాల్ మెంట్?
- త‌ప్ప‌కుండా ఉంటుంది. ఎందుకంటే సినీ రంగంలో ఆయ‌న‌కున్న అనుభ‌వం చాలా గొప్ప‌ది. అలాగ‌ని పూర్తిగా ఆయ‌నే ప్ర‌భావితం చూపించారు. స్పీడున్నోడు క‌థ‌, స‌న్నివేశాల విష‌యంలో ఏమాత్రం జోక్యం చేసుకోలేదు. అయితే మార్కెటింగ్ విష‌యంలో మాత్రం డాడీ స‌ల‌హాలు బాగా ప‌నికొచ్చాయి.

* కొత్త క‌థ‌లు వింటున్నారా?
- అల్లుడు శ్రీ‌ను ముందు చాలా క‌థ‌లు విన్నా. ఆ త‌ర‌వాత కూడా ఇంచుమించు 40 క‌థ‌లు విన్నా. అందులో స్పీడున్నోడు నాకు బాగా న‌చ్చింది. విజ‌య్‌కుమార్ కొండా ఓ క‌థ చెప్పారు. దాన్ని అట్టిపెట్టాం. అది కూడా త్వ‌ర‌లోనే ఉంటుంది.

* ఒకే... ఆల్ ద బెస్ట్‌
- థ్యాంక్యూ...

-కాత్యాయని
మరిన్ని సినిమా కబుర్లు
kalyanram act in puri direction