Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kalyanram act in puri direction

ఈ సంచికలో >> సినిమా >>

కమల్‌తో మరోసారి రమ్యకృష్ణ

ramyakrishna with kamal

'బాహుబలి' సినిమాకి రమ్యకృష్ణ ఇచ్చిన వెయిట్‌కి సినిమాకి ఆమెనే హీరో అన్పించేంతగా కన్పిస్తుంటుంది. ఆ పాత్రకి అంతటి హుందాతనాన్ని తీసుకురావడం రమ్యకృష్ణకే సాధ్యపడిందనడంలో ఎంత మాత్రమూ అతిశయోక్తి కాదు. అందుకే ఆ సినిమాలోని శివగామి' పాత్ర అంత పాపులర్‌ అయ్యింది. ఆ తరువాత 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాలో నాగార్జునకు పోటీగా నటించింది. యంగ్‌ హీరోయిన్‌ అయిన లావణ్యకు ధీటుగా గ్లామర్‌ ప్రదర్శించింది. అందుకే ఆమె నటనకు విశ్వనటుడు కమల్‌ హాసన్‌ కూడా ఫిదా అయిపోయి తన పక్కన హీరోయిన్‌గా చేయాలని కోరారట. గతంలో 'పంచతంత్రం' సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. తాజాగా మళయాల దర్శకుడు టీ.కే రాజీవ్‌ కుమార్‌ దర్శకత్వంలో కమల్‌ నటించబోతోన్న ఒక సినిమాలో తన భార్య పాత్రలో రమ్యకృష్ణను నటించమని అడిగినట్లు సమాచారం. ఈ సినిమాకు ఇళయరాజా మ్యూజిక్‌ అందించనున్నారు. అంతే కాదు ఈ సినిమాలో కమల్‌ కూతురు శృతిహాసన్‌ కూడా గెస్ట్‌ రోల్‌లో కనిపించనుందని కోలీవుడ్‌ వర్గాల టాక్‌. ఇప్పటికే 'బాహుబలి 2' షూటింగ్‌తో బిజీగా ఉన్న రమ్యకృష్ణ, తన భర్త కృష్ణవంశీ దర్శకత్వంలో 'రుద్రాక్ష' అనే ఫాంటసీ మూవీలో కీలకపాత్ర పోషించనుందని సమాచారం. సో టోటల్‌గా ఈ సీనియర్‌ ముద్దుగుమ్మ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో కూడా హీరోయిన్‌గా బిజీ బిజీగా గడపడం విశేషం. 

మరిన్ని సినిమా కబుర్లు
nani movie dates fix ready