Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
ramyakrishna with kamal

ఈ సంచికలో >> సినిమా >>

నాని సినిమాకి డేట్‌ ఫిక్స్‌ అయిపోయిందోచ్‌ !

nani movie dates fix ready

గతేడాది 'భలే భలే మగాడివోయ్‌' సినిమాతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు నాని. ఈ సంవత్సరంలో 'కృష్ణగాడి వీర ప్రేమ గాధ' అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. టైటిల్‌తో, టీజర్స్‌తో ఇప్పటికే ప్రేక్షకుల్లో ఒక రకమైన ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేసిన ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో మెహ్రన్‌ కౌర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. నాని నటన ఈ సినిమాలో కొత్తగా ఉంటుంది. తను భయపడుతూనే ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసే విధంగా ఉంటుంది ఈ సినిమాలో నాని పాత్ర. 'భలే భలే మగాడివోయ్‌' చిత్రంలో మతిమరుపుతో నవ్వించిన హిట్‌ కొట్టేసిన నాని, ఇప్పుడు 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' సినిమాలో పిరికితనంతో నవ్వించి మళ్ళీ హిట్‌ కొట్టడానికి వస్తున్నాడు. సైలెంట్‌గా వచ్చి బీభత్సమైన హిట్స్‌ కొట్టేస్తున్న యంగ్‌ హీరోగా, విభిన్న చిత్రాలు చేస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతున్న హీరోగా నాని ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంకోవైపున, సినీ వర్గాల్లో ఇప్పుడీ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ట్రేడ్‌ వర్గాలూ సినిమా రేంజ్‌ చాలా ఎక్కువే ఉంటుందని అంచనా వేస్తుండడం, ఆడియన్స్‌లోనూ సినిమాపై ఆసక్తి ఉండడం అన్నీ నానికి కలిసొచ్చే అంశాలే. ఆల్‌ ది బెస్ట్‌ నాని. 

మరిన్ని సినిమా కబుర్లు
balayya comes guntur takies trailer  function