Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
rashi khanna  was beauty...

ఈ సంచికలో >> సినిమా >>

సుక్కు డైరెక్షన్‌లో క్లాస్‌లుక్‌లో చరణ్‌?

charan  and sukumar combination movie  comming soon

తన సినిమాల్లో హీరో అంటే ఏదో ఒక స్పెషల్‌ మార్కు ఉండాలని కోరుకునే సుకుమార్‌ తాజాగా 'నాన్నకు ప్రేమతో' సినిమాలో ఎన్టీఆర్‌ను క్లాస్‌ లుక్‌లో డిఫరెంట్‌గా చూపించి విజయం సాధించాడు. ఆ సినిమా టైంలోనే బన్నీతోనూ, రాంచరణ్‌తోనూ తన నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌ ఉండబోతున్నాయని చెప్పిన సుకుమార్‌ ఇప్పుడు రాంచరణ్‌ కోసం ఒక స్టోరీ రెఢీ చేసేశాడట. ఆ స్టోరీని చరణ్‌కు ఇటీవల వినిపించినట్లు, చరణ్‌ అందుకు ఓకే చెప్పినట్లు కూడా సమాచారం. రొమాంటిక్‌ అండ్‌ థ్రిల్లింగ్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో రాంచరణ్‌ను, సుకుమార్‌ ఒక డిఫరెంట్‌ లుక్‌లో చూపించే ప్రయత్నంలో ఉన్నాడట. సుకుమార్‌ సినిమాల్లో ఓ మ్యాజిక్‌ వుంటుంది. ఇంటెల్లిజెంట్‌గా ఉంటాయి. క్లాస్‌ టచ్‌తో ఉండే సుకుమార్‌ సినిమాలకి ఓవర్‌సీస్‌లో మంచి మార్కెట్‌ ఉంటుంది. ఆ విషయం 'నాన్నకు ప్రేమతో' సినిమా ప్రూవ్‌ చేసింది. ఓవర్సీస్‌ మార్కెట్‌పై ఎప్పటినుంచో కన్నేసినా, నిఖార్సయిన ఓవర్‌సీస్‌ విజయం రామ్‌చరణ్‌ని ఊరిస్తూనే ఉంది. ఆ లోటు సుకుమార్‌ సినిమాతో రామ్‌చరణ్‌ తీర్చుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం సురేందర్‌ రెడ్డి డైరెక్షన్‌లో రాంచరణ్‌ చేస్తున్న 'తనీఒరువన్‌' రీమేక్‌ తర్వాత సుకుమార్‌ సినిమా పట్టాలెక్కనుంది. 

 

మరిన్ని సినిమా కబుర్లు
rana so bussy