Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
charan  and sukumar combination movie  comming soon

ఈ సంచికలో >> సినిమా >>

రాణా ఫుల్‌ బిజీ అయిపోయాడు

rana so bussy

'లీడర్‌' సినిమాతో తెలుగు సినిమా తెరంగేట్రం చేసిన ఆరడుగుల ఆజానుబాహుడు దగ్గుబాటి రానా. శేఖర్‌ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా రానాకు ఫర్వాలేదనిపించింది. ఆ తరువాత చాలా సినిమాలు చేశాడుగానీ, 'బాహుబలి' ఇచ్చిన పాపులారిటీ అంతకు ముందు రాణా చేసిన చిత్రాలేవీ ఆయనకు ఇవ్వలేదు. 'బాహుబలి' సినిమాతో ఒక్కసారిగా రానా రేంజ్‌ పెరిగిపోయింది. చేసింది నెగెటివ్‌ రోల్‌ అయినా, రాణా పేరు మార్మోగిపోయేలా చేసిందా సినిమా. ఆ తరువాత 'రుద్రమదేవి'తో కూడా ఆయనకు మంచి పేరు లభించింది.

తెలుగులో ఇలా ఉండగానే, అటు హిందీలోనూ, తమిళంలోనూ కూడా తన హవా చూపిస్తున్నాడు రానా. తాజాగా తమిళంలో రానా నటించిన 'బెంగుళూర్‌ నాట్కల్‌' సినిమా విజయం సాధించడంతో ప్రఖ్యాత డైరెక్టర్‌ బాల దృష్టిలో పడ్డాడు రానా. సౌత్‌ డైరెక్టర్స్‌లో ప్రత్యేక స్థానం ఉన్న బాల దర్శకత్వంలో ప్రతీ హీరో సినిమా చేయాలనుకుంటాడు. ఇప్పుడు ఆ ఛాన్స్‌ రానాను వరించింది. ఈ సినిమాను తెలుగు, తమిళం రెండు భాషల్లోనూ తెరకెక్కించే యోచనలో ఉన్నారట. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లనుంది. ఇవికాక రానా తెలుగులో 'బాహుబలి ది కన్‌క్లూజన్‌', 'లీడర్‌' సీక్వెల్‌లోనూ నటించనున్నాడు. మరో వైపు హిందీలో 'ఘాజీ' సినిమాలో కూడా నటిస్తున్నాడు. టోటల్‌గా రానా ఫుల్‌ బిజీగా గడుపుతున్నాడు. 

 

మరిన్ని సినిమా కబుర్లు
hot anchors  skin shows competition