Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview with anasuya

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష

movie review

చిత్రం: క్షణం 
తారాగణం: అడివి శేష్‌, ఆదాశర్మ, అనసూయ భరద్వాజ్‌, వెన్నెల కిషోర్‌, రవివర్మ, సత్యం రాజేష్‌, సత్యదేవ్‌ తదితరులు 
సంగీతం: శ్రీ చరణ్‌ పాకాల 
ఛాయాగ్రహణం: శానీల్‌ డియో 
స్క్రీన్‌ప్లే: రవికాంత్‌ పేరెపు, అడివి శేష్‌ 
దర్శకత్వం: రవికాంత్‌ పేరెపు 
నిర్మాతలు: పరమ్‌ వి పొట్లూరి, కవిన్‌ అన్నె 
విడుదల తేదీ: 26 ఫిబ్రవరి 2016

క్లుప్తంగా చెప్పాలంటే 
అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తుంటాడు రిషి (అడివి శేష్‌). అతనికి ఇండియాలోని తన మాజీ ప్రేయసి శ్వేత (ఆదాశర్మ) నుంచి పిలుపు వస్తుంది. తన కుమార్తె కిడ్నాప్‌ అయ్యిందని శ్వేత, రిషికి చెబుతుంది. ఆ పాప రియా కోసం అన్వేషిస్తుంటాడు రిషి. అయితే ఓ సందర్భంలో శ్వేతకు పాపే లేదనే అనుమానం రిషికి కలుగుతుంది. ఆ అనుమానం నిజమేనా? శ్వేత కుమార్తెను నిజంగానే కిడ్నాప్‌ చేశారా? ఈ మిస్టరీ ఏంటి? అన్నది తెరపై చూస్తేనే బాగుంటుంది.

మొత్తంగా చెప్పాలంటే 
ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోగలడు అడివి శేష్‌. విలన్‌గా అయినా, నెగెటివ్‌ షేడ్‌ ఉన్న పాజిటివ్‌ క్యారెక్టర్‌ అయినా, ఇంకేదైనా చేయగలనని తక్కువ సినిమాలతోనే అడివి శేష్‌ నిరూపించుకున్నాడు. ఈ సినిమాలోనూ నటించడం కాదు, జీవించేశాడు. పాత్రకు తగ్గట్టుగా హావభావాలతో ఆకట్టుకున్నాడు. సెటిల్డ్‌ పెర్ఫామెన్స్‌తో మొత్తం షోని స్టీల్‌ చేశాడు.

ఆదా శర్మకి ఈ సినిమాలో మంచి పాత్ర దక్కింది. పాత్రకు తగ్గ నటనతో ఆకట్టుకుంది. అనసూయ బాగానే చేసింది. బుల్లితెరపై సరదా సరదాగా కనిపించిన అనసూయ ఇందులో డిఫరెంట్‌గా కనిపించింది. సత్యం రాజేష్‌ కామెడీతో ఆకట్టుకున్నాడు. వెన్నెల కిషోర్‌, రవి వర్మ, సత్యదేవ్‌ తదితరులంతా ఓకే. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర బాగానే చేశారు.

కథ, కథనం వంటి అన్ని విషయాల్లోనూ దర్శకుడు చాలా కేర్‌ తీసుకున్నాడు. సినిమాలోని ప్రతి సన్నివేశాన్నీ ప్రేక్షకుడి గుండెలకు హత్తుకునేలా తీయడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. డైలాగ్స్‌ బాగున్నాయి. స్క్రీన్‌ప్లే ఇంకా బాగుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకి కీలకం. సినిమాటోగ్రఫీ హాలీవుడ్‌ సినిమాల తరహాలో ఉంది. ఎడిటింగ్‌ కూడా సినిమాకి అవసరమైనంత మేర చాలా బాగుంది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సినిమాకి ప్లస్‌ అయ్యాయి. చిన్న సినిమా అయినా నిర్మాణపు విలువలు చాలా బాగున్నాయి.

థ్రిల్లర్‌ సినిమాల్ని తెరకెక్కించాలంటే దానికి ఎంతో గ్రిప్పింగ్‌ అవసరం. సినిమాలోని ప్రతి సీన్‌ని గ్రిప్పింగ్‌గా చూపగల నేర్పరితనం ఉండాలి. అవన్నీ దర్శకుడిలో ఉన్నాయి. ఇలాంటి సినిమాలకి స్క్రీన్‌ప్లే మేజర్‌ రోల్‌ ప్లే చేస్తుంది. దర్శకుడు, హీరో కలిసి స్క్రీన్‌ప్లేని రసవత్తరంగా రూపొందించారు. ఆద్యంతం ఇంట్రెస్టింగ్‌గా సినిమాని మలచారు. థ్రిల్లర్‌ సినిమాల్ని ఇష్టపడేవారిని సినిమా బాగా ఆకట్టుకుంటుంది. సాధారణ ఆడియన్స్‌ని కూడా ఎట్రాక్ట్‌ చేసేలా ఉందీ సినిమా. స్టార్టింగ్‌ టు ఎండింగ్‌ ఎక్కడా బిగి సడలనివ్వలేదు. సినిమా కోసం అనవసరమైన కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ని జొప్పించలేదు. ఓవరాల్‌గా మంచి థ్రిల్లర్‌ని దర్శకుడు తెరకెక్కించాడు. థ్రిల్లర్‌ జోనర్‌ సినిమాల్ని ఆదరించే ప్రేక్షకులే దీనికి రాజపోషకులు. రొటీన్‌ కమర్షియల్‌ సినిమా కావాలనుకునేవారికి కాస్తో కూస్తో నిరాశపర్చుతుందేమోగానీ, డిఫరెంట్‌ సినిమాల్ని కోరుకునేవారికి మంచి అనుభూతిని మిగల్చడం ఖాయం.

ఒక్క మాటలో చెప్పాలంటే 
క్షణం క్షణం ఉత్కంఠ రేపే డీసెంట్‌ థ్రిల్లర్‌

అంకెల్లో చెప్పాలంటే: 3.5/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka