Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
no selfish

ఈ సంచికలో >> సినిమా >>

రామ్‌గోపాల్‌ వర్మ రూటే సెపరేటు

ramgopalvarma route supperate

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ రూటే సెపరేటు. ఆయన చెయ్యాలనుకున్నది చేస్తాడంతే. 'వంగవీటి' టైటిల్‌తో రామ్‌గోపాల్‌ వర్మ విజయవాడ రౌడీ రాజకీయాల్ని తెరపై చూపించాలనుకుంటున్నట్లు ప్రకటించగానే ఎంతో వివాదం నడిచింది. వర్మకు కొందరు హెచ్చరికలు పంపారు. ముంబై అండర్‌ వరల్డ్‌ మాఫియానే వర్మ లెక్క చేయలేదు. బెజవాడ రౌడీ రాజకీయాల్ని లెక్క చేస్తాడా? బస్తీమే సవాల్‌ అన్నాడు. విజయవాడ వస్తున్నానంటూ డేటు, టైమ్‌ కూడా చెప్పాడు. అంతకన్నా ముందు వర్మ 'వంగవీటి' సినిమా కోసం తయారుచేసిన పాటని కూడా విడుదల చేశాడు. సినిమాలో ఏయే పాత్రలుంటాయో వివరించాడు. ఇన్ని చేసిన వర్మ 'వంగవీటి' టైటిల్‌ డిజైన్‌ కూడా రిలీజ్‌ చేయడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటేస్తున్నాయి. సినిమాలో హీరో ఫిక్సయ్యాడు. 'నా వంగవీటి ఇతడే' అని మొదట్లోనే రివీల్‌ చేశాడు మెయిన్‌ పాత్రధారిని. ఏదేమైనప్పటికీ 'వంగవీటి' తెలుగు సినిమా పరిశ్రమలో విడుదలకు ముందు కాదు, ప్రారంభానికి ముందు సంచలనం సృష్టించిన సినిమా. వర్మ ఈజ్‌ బ్యాక్‌ అనేలా ఈ సినిమా ఉంటుందని సమాచారమ్‌. 

మరిన్ని సినిమా కబుర్లు
samanta feel senmentally...