Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
movie review

ఈ సంచికలో >> సినిమా >>

బాహుబలి' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ !

bahubali relese date fix

దర్శ ధీరుడు రాజమౌళి రూపొందించిన 'బాహుబలి ది బిగినింగ్‌' తెలుగు సినిమా కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పింది. 'బాహుబలి' బిగినింగ్‌తో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అన్న ఉత్కంఠను రేకెత్తించాడు రాజమౌళి. ఈ ప్రశ్నకి సమాధానం దొరకాలంటే మరొక్క సంవత్సరం ఆగాల్సిందే. 'బాహుబలి ది కన్‌క్లూజన్‌'లో రాజమౌళి, ఆ ప్రశ్నకు సమాధానమిస్తాడు. ఈ చిత్రానికి రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేశారు చిత్ర బృందం. 2017 ఏప్రిల్‌ 14న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని ప్రకటించడం జరిగింది.

'బాహుబలి ది బిగినింగ్‌' విడుదల విషయంలో కొంత కన్‌ఫ్యూజన్‌ తలెత్తిన విషయం తెలిసిందే. అనుకున్న సమయానికన్నా కొంచెం ఆలస్యంగా 'బాహుబలి ది బిగినింగ్‌' విడుదలయ్యింది. కానీ ఇప్పుడు మాత్రం జక్కన్న మరింత పక్కా ప్రణాళిక ప్రకారం రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసేసి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. ఇప్పటికే 'బాహుబలి' కంక్లూజన్‌కి సంబంధించి ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల చిత్రీకరణ మొదలయినట్లు సమాచారం. ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రాణా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాపై మొదటి పార్ట్‌ కన్నా ఎక్కువ అంచనాలు ఉన్నాయి. 

మరిన్ని సినిమా కబుర్లు
Verma introduced one more  Beauty