Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
bahubali relese date fix

ఈ సంచికలో >> సినిమా >>

ఇంకో బ్యూటీని దించుతున్న వర్మ

Verma introduced one more  Beauty

సాధారణంగా రాంగోపాల్‌ వర్మ సినిమాల్లో హీరోయిన్స్‌కి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆయన తన సినిమాల్లో హీరోయిన్‌గా వచ్చే ముద్దుగుమ్మల కోసం ప్రత్యేకంగా వేట మొదలు పెడతాడు. ఇక రియల్‌ స్టోరీస్‌ తెరకెక్కించే సందర్భంలో అయితే వర్మ రూటే సెపరేటు. ఆయా పాత్రకు సూటబుల్‌ హీరోయిన్ని కరెక్ట్‌గా సెట్‌ చేస్తాడు. పరిటాల రవి స్టోరీని తెరకెక్కించిన 'రక్త చరిత్ర' సినిమా కోసం పరిటాల సునీత క్యారెక్టర్‌ కోసం రాధికా ఆప్టేను పరిచయం చేశాడు. ఆ పాత్రలో ఆమె ఒదిగిపోయింది. ఇప్పుడు వర్మ మరో సెన్సేషన్‌ 'వంగవీటి' సినిమాలో వంగవీటి రత్నకుమారి పాత్ర కోసం నైనా గంగూలి అనే ముద్దుగుమ్మని తెలుగు తెరకు పరిచయం చేయబోతున్నాడు వర్మ.

వంగవీటి రత్నకుమారి పాత్ర అంటే అభినయానికి స్కోప్‌ ఉన్న పాత్ర కావడంతో అంతటి సామర్ధ్యం ఉన్న హీరోయిన్‌ ఉంటేనే ఆ పాత్రకు ప్రాణం పోయడం జరుగుతుంది. అందుకే తీక్షణమైన కంటిచూపుతో ఆకర్షించే శక్తి సామర్ధాలున్న స్మితాపాటిల్‌ స్థాయి సామర్ధ్యం కలిగిన నైనా గంగూలిని తన సినిమాలో హీరోయిన్‌గా సెలక్ట్‌ చేయడం జరిగిందని వర్మ తెలిపారు. గ్లామరస్‌ హీరోయిన్స్‌ని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయడంలోనే కాదు, తమ నటనతో పాత్రకు ప్రాణం పోయగల పాత్రల్లో నటించే హీరోయిన్స్‌ని ఎంపిక చేయడంలోనూ వర్మ తనదైన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నాడు. 

మరిన్ని సినిమా కబుర్లు
tuntarodu  comming fast