Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
tuntarodu  comming fast

ఈ సంచికలో >> సినిమా >>

హాట్‌ సీన్స్‌లో ఆమె ఇన్‌వాల్వ్‌ అయిపోతుందట.

srutihasan involves in hot sceans

సహజంగానే శృతి హాసన్‌ అంటే నటనకూ, అందానికి పెట్టింది పేరు. ఆమె నటనలో ఎక్కడా పేరు పెట్టే ఆస్కారమే ఉండదు. విశ్వనటుడి కూతురు కదా మరి. అదంతే. అయితే నటించేటప్పుడు అమ్మడు తన పాత్రలో ఇన్‌వాల్వ్‌ అయిపోయి నటిస్తుందట. అందుకే ఆ సీన్‌ అంత బాగా రక్తి కడుతుంది అంటోంది ముద్దుగుమ్మ శృతిహాసన్‌. హాట్‌ హాట్‌ సీన్స్‌లో అయితే తనను తానే మైమరిచిపోయి నటిస్తుందట. ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం వల్ల తనకు ఏ మాత్రం ఇబ్బంది కలగదంటోంది ఈ హాటెస్ట్‌ భామ శృతి హాసన్‌.

అది నటనే కదా అని చెబుతుందీ భామ. ప్రస్తుతం రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ 'ప్రేమమ్‌' లో నటిస్తోంది. ఈ సినిమాలో నాగచైతన్యతో రొమాన్స్‌ చేస్తూ బిజీగా ఉంది శృతిహాసన్‌. అంతేకాదు ఇంతవరకూ సింగింగ్‌, డాన్సింగ్‌, యాక్టింగ్‌ వంటి టాలెంట్స్‌తో అలరించిన శృతి ఈ సినిమాతో తొలిసారిగా తెలుగులో డబ్బింగ్‌ కూడా చెప్పబోతోంది. తెరపై హాట్‌ హాట్‌గా కనబడే శృతి ఇప్పుడు స్వీట్‌ స్వీట్‌గా మాట్లాడేస్తానంటోంది. తెలుగుతో పాటు హిందీ, తమళంలో కూడా హవా చూపిస్తున్న శృతి, ఇకపై తెలుగు తెరపై తన సొంత గొంతుతోనే అలరిస్తానంటోంది. 

మరిన్ని సినిమా కబుర్లు
megastar fitness improved with dance