Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

తుంటరి చిత్రసమీక్ష

tuntari movie review

చిత్రం: తుంటరి 
తారాగణం: నారా రోహిత్‌, లతా హెగ్దే, కబీర్‌ సింగ్‌, వెన్నెల కిషోర్‌, షకలక శంకర్‌, పూజిత తదితరులు. 
సంగీతం: సాయి కార్తీక్‌ 
ఛాయాగ్రహణం: 
నిర్మాణం: 
దర్శకత్వం: కుమార్‌ నాగేంద్ర 
నిర్మాతలు: అశోక్‌, నాగార్జున 
విడుదల తేదీ: 11 మార్చి 2016

క్లుప్తంగా చెప్పాలంటే 
నలుగురు యువకులు హాలీడేస్‌ ఎంజాయ్‌ చేస్తుంటారు. వారికి ఓ సాధువు కనిపిస్తాడు. ఆ సాధువు ఓ పేపర్‌ ఇస్తాడు. ఆ పేపర్‌ నాలుగు నెలల తర్వాతిదని తెలుసుకుంటారు ఆ యువకులు. అయితే అందులో ఉన్నట్లుగానే వారి జీవితంలో ముఖ్యమైన సంఘటన జరుగుతుంది. దాంతో ఆ పేపర్‌లో ఉన్న మిగతా అంశాలపై దృష్టిపెడతారు. ఓ వ్యక్తి బాక్సింగ్‌ ఛాంపియన్‌ అవుతాడనీ 5 కోట్లు గెలుస్తాడనీ తెలుసుకుని, ఆ వ్యక్తి కోసం అన్వేషణ మొదలు పెడ్తారు. వారికి రాజు అనే యువకుడు దొరుకుతాడు. లైఫ్‌లో లక్ష్యం అంటూ లేకుండా సరదాగా గడిపేసే రాజు బాక్సర్‌ ఎలా అవుతాడు? పేపర్‌లో చదివిన ఏ ఘటన వారికి రాజుపై నమ్మకం కలిగేలా చేస్తుంది? ఓ ఆషామాషీ కుర్రాడు బాక్సింగ్‌ ఛాంపియన్‌ అవడమేంటి? అనేది తెరపై చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే 
నారా రోహిత్‌ తనవంతుగా తన పాత్రకు న్యాయం చేయడానికి ప్రయత్నించాడు. హ్యూమర్‌ పండించేందుకు నారా రోహిత్‌ చేసిన ప్రయత్నం అభినందించదగ్గ విషయం. అయితే ఫిజిక్‌ విషయంలో కేర్‌ తీసుకుని ఉండాల్సింది. నటనతో ఆకట్టుకున్నాడు. ఇప్పటిదాకా చేసిన చిత్రాలకు భిన్నంగా కనిపించాడు నారా రోహిత్‌ ఈ చిత్రంలో.

హీరోయిన్‌ గ్లామరస్‌గా బాగానే ఉంది. నటన విషయంలో ఇంకా మెరుగవ్వాలి. వెన్నెల కిషోర్‌, షకలక శంకర్‌ నవ్వించారు. కబీర్‌సింగ్‌ విలనిజం ఆకట్టుకుంటుంది. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర నటించారు.

కథ కొత్తగా ఉంటుంది. కథనం విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. రీమేక్‌ సినిమా కావడంతో నేటివిటీని జాగ్రత్తగా దర్శకుడు సెట్‌ చేసుకున్నాడు. అక్కడివరకూ దర్శకుడికి మార్కులు పడతాయి. అయితే పాటల ప్లేస్‌మెంట్‌ విషయంలో దర్శకుడు కన్‌ఫ్యూజ్‌ అయ్యాడు. డైలాగ్స్‌ బాగానే ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ బాగుంది. పాటలు ఫర్వాలేదు. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. విశాఖ అందాల్ని కెమెరాలో అద్భుతంగా బంధించారు. నిర్మాణపు విలువలు బాగున్నాయి. ఎడిటింగ్‌ ఇంకా అవసరం అనిపిస్తుంది.

ఫస్టాఫ్‌ సరదా సరదాగా సాగిపోతుంది. ఇంట్రెస్టింగ్‌గా వెళుతుంది కథ. సెకెండాఫ్‌ వచ్చేసరికి కాస్త డల్‌ అనిపిస్తుంది. క్లయిమాక్స్‌కి వచ్చేసరికి సినిమాలో పేస్‌ పెరుగుతుంది. కామెడీ బాగానే ఉన్నా, అక్కడక్కడా అనవసరమైన సందర్భాల్లోనూ కామెడీ జొప్పించారు. పాటలు కూడా షడెన్‌గా వచ్చేస్తుంటాయి. అది కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుందిగానీ, తెలుగు సినిమా కమర్షియల్‌ పంథాలో నడవాలి గనుక, అది యాక్సెప్టబుల్‌ అనుకోవచ్చు. ఓవరాల్‌గా సినిమా ఓకే అనిపిస్తుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే 
ఈ తుంటరి జస్ట్‌ ఓకే

అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
interview with  nara rohit