Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
tuntari movie review

ఈ సంచికలో >> సినిమా >>

నారా రోహిత్‌తో ఇంటర్వ్యూ

interview with  nara rohit

బాల‌కృష్ణ సినిమాలో చిన్న పాత్ర అయినా చాలు! - నారా రోహిత్‌

సిక్స్ ఫీట్ హైట్ ఉంటాడు..
కానీ ఫైట్స్‌ని న‌మ్ముకోలేదు..!
పొలిటిక‌ల్ స‌పోర్ట్‌ ఉంది!
కానీ ఆ బ్యాక్ గ్రౌండ్ న‌మ్ముకోలేదు!
మాస్‌, మ‌సాలా జోలికెళ్లలేదు..
ఫార్ములా క‌థ‌ల్ని ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌లేదు.

బాణం నుంచి ఒక‌టే దారి... కొత్త త‌ర‌హా క‌థ‌ల్లో, కొత్త పాత్ర‌ల్లో త‌న‌ని తాను చూసుకోవ‌డ‌మే ధ్యేయంగా ముందుకెళ్తున్నాడు... నారా రోహిత్‌. సోలోతో హిట్ కొట్టి.. ప్ర‌తినిధితో ప్రేక్ష‌కుల్ని ఆలోచ‌న‌ల్లో ప‌డేశాడు. ఇప్పుడు తుంట‌రితో అల్ల‌రి చేయ‌డానికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఈ సంద‌ర్భంగా నారా రోహిత్‌తో గో తెలుగు జ‌రిపిన చిట్ చాట్‌..!


* హాయ్ రోహిత్‌..
- హాయండీ...

* ఈమ‌ధ్య మ‌రీ బిజీ బిజీ అయిపోయారు..
- అవునండీ.. చేతిలో ఆరు సినిమాలున్నాయి. రోజూ షూటింగ్ హ‌డావుడే. అందుకే ఇంత బిజీ

* ఆరు సినిమాలు... ఆరు పాత్ర‌లు - సెట్లో క‌న్‌ఫ్యూజ్ అయిపోవ‌డం లేదా?
- అలాంటి భ‌యాలేం లేవండీ. ఎందుకంటే ఆరు పాత్ర‌లూ ఆరు ర‌కాలు. ఒక‌దాంట్లో పాత్ర‌కీ, మ‌రో సినిమాలో పాత్ర‌కీ ఎలాంటి సంబంధ‌మూ ఉండ‌దు. కాబ‌ట్టి సెట్‌కి వెళ్ల‌గానే ఆ పాత్ర‌లోకి వెళ్లిపోతుంటా.

* కెరీర్ మొద‌ట్లో ఇంత స్పీడుండేది కాదు... ఇప్పుడే ఎందుకిలా..?
- అప్పుడు కూడా ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసేద్దాం అనుకొనేవాడ్ని. కానీ... నేను ఎదురుచూసిన క‌థ‌లు దొర‌క‌లేదు. ఇప్పుడే ఆ అవ‌కాశం వ‌స్తోంది. ఇక మీద‌టా ఇదే స్పీడు చూపిస్తా.

* బొద్దుగా క‌నిపిస్తున్నారు.. స‌న్న‌బ‌డాల‌న్న ఆలోచ‌న లేదా?
- ఆలోచ‌న లేక కాదండీ. టైమ్ లేక‌. స‌న్న‌బ‌డితే బాగుంటుంద‌ని నాకూ ఉంది. తుంట‌రి కోసం సిక్స్ ప్యాక్ చేద్దామ‌నుకొన్నా. అయితే.. సినిమా త‌ర‌వాత సినిమా చేస్తూ పోవ‌డం వ‌ల్ల సిక్స్ ప్యాక్ చేయ‌డానికి స‌మ‌యం దొర‌క‌లేదు. తుంట‌రి లాంటి క‌థ‌లు సిక్స్ ప్యాక్ చేయ‌క‌పోయినా వ‌ర్క‌వుట్ అయిపోతాయి. అందుకే... ఈసారికి ఇలా కానిచ్చేశానంతే.

* తుంట‌రి - సావిత్రి రెండు సినిమాలూ రెండు వారాల వ్య‌వ‌ధిలో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాయి. మీ సినిమాకి మీరే పోటీ అంటే.. ఎలా?
-  పోటీ కాదు.. అలా క‌లిసొచ్చేశాయంతే. అయినా ఈ రోజుల్లో ఏ సినిమా జీవిత‌కాల‌మైనా రెండు వారాలే. ప‌ద్నాలుగు రోజులు సినిమా ఆడితే గొప్పే!  రెండు థియేట‌ర్ల‌లోనూ నా సినిమానే ఆడితే అంత‌కంటే.. ఆనందం ఏముంటుంది?  క‌థాప‌రంగా సావిత్రికీ, తుంట‌రికీ ఏమాత్రం పోలిక లేదు. కాబ‌ట్టి సినిమా ప్రేమికులు రెండు సినిమాల్నీ ఇష్ట‌ప‌డ‌తార‌న్న న‌మ్మ‌కం ఉంది.

* మాన్ కారాటే సినిమ‌లో మిమ్మ‌ల్ని ఆక‌ట్టుకొన్న అంశాలేంటి? 
- విధి, క‌ష్టం.. ఈ రెండింట్లో ఏది గొప్ప‌ది అనే పాయింట్ చాలా చ‌క్క‌గా చెప్పారు. దానికి వినోదం.. ఓ ప్రేమ క‌థ జోడించారు. ఆ మేళ‌వింపు నాకు బాగా న‌చ్చింది.

* ఉన్న‌ది ఉన్న‌ట్టు తీశారా, మార్పులు చూపించారా?
- రీమేక్ అనేస‌రికి మ‌న నేటివిటీకి త‌గిన‌ట్టుగా మార్చాల్సిందే. కొన్ని మార్పులు చేశాం. కుమార్ నాగేంద్ర ప్ర‌తిభ అక్క‌డే బ‌ట‌య‌ప‌డుతుంది.

* జోరు ఫ్లాప్... అయినా ఆయ‌న్ని న‌మ్మ‌డం వెనుక ఉన్న ఉద్దేశం?
- మీరు జోరు చూశారు.. నేను గుండెల్లో గోదారి చూశా.. (న‌వ్వుతూ)

* సినిమాల సంగ‌తి స‌రే.. పెళ్లెప్పుడు?
- ఇంత బిజీలో పెళ్లేంటండీ బాబూ. ఇంట్లో కంటే సెట్స్‌లోనే ఎక్కువ‌గా ఉండాల్సి వ‌స్తుంది. ఈ ద‌శ‌లో పెళ్లి చేసుకొంటే... వెంట‌నే మా ఆవిడ విడాకులు ఇచ్చేస్తుంద‌.ఇ. (న‌వ్వుతూ)

* ఈ యేడాదైనా చేసుకొంటారా?
- క‌ష్టం.. వ‌చ్చే యేడాది చూద్దాం.

* బాల‌కృష్ణ వందో సినిమాలో మీరూ న‌టిస్తార‌న్న వార్త‌లొస్తున్నాయి..
- అలాంటిదేం లేదు. నిజంగా అదే జ‌రిగితే.. బాల‌కృష్ణ‌గారి సినిమాలో చిన్న పాత్ర‌యినా నిర‌భ్యంత‌రంగా చేసేస్తా. ఆఖ‌రికి వాయిస్ ఓవ‌ర్ ఇమ్మ‌న్నా ఓకే.

* ఇటీవ‌ల సెల‌బ్రెటీలు ప‌బ్లిక్ ఫంక్ష‌న్ల‌లో నోరు జారుతున్నారు... ఈ పోక‌డ గ‌మ‌నించారా?
- నా మ‌టుకు నేను చాలా సైలెంట్‌. చాలా త‌క్కువ‌గా మాట్లాడుతుంటా. సెల‌బ్రెటీ హోదా ఉన్న‌ప్పుడు కాస్త ఆచి తూచి మాట్లాడాలి. ఎందుకంటే అంద‌రి దృష్టీ మ‌న‌పైనే ఉంటుంది. అలాంట‌ప్పుడు ఇంకా జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే. 

* కొత్త‌గా ఏమైనా సినిమాలొప్పుకొన్నారా?
- ప్ర‌స్తుతం ఆరు సినిమాలున్నాయి. మ‌రో ఆరు క‌థ‌లు సిద్ధంగా ఉన్నాయి. మే నుంచి కొత్త సినిమా ఒక‌టి మొద‌లవ్వ‌బోతోంది. ఆ సినిమా వివ‌రాలు త్వ‌ర‌లో చెబుతా.

* ఓకే... ఆల్ ద బెస్ట్‌
- థ్యాంక్స్‌

మరిన్ని సినిమా కబుర్లు
NTR singing sensetion in kannada film industry