Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
movie review

ఈ సంచికలో >> సినిమా >>

తమన్నాతో ఇంటర్వ్యూ

interview with tamanna

.ప్ర‌యోగాలు చేయ‌డానికి ఇదే స‌రైన స‌మ‌యం - త‌మ‌న్నా

త‌మ‌న్నా.. ప‌దేళ్లుగా తెలుగు ప్రేక్ష‌కుల చుపుల్ని క‌ట్టిప‌డేస్తున్న అందాల శిల్పం. మిల్కీ బ్యూటీ అనే పిలుపుకు.. అక్ష‌రాలా అర్హురాలు. న‌ట‌న‌, అందం, సంస్కారం, తెలివితేట‌లూ.. ఇవ‌న్నీ క‌ల‌గ‌లిపిన అపురూపం. అంందుకే తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.
బాహుబ‌లితో అంత‌ర్జాతీయ గుర్తింపు సాధించింది. ఇప్పుడు ఊపిరితో మ‌రోసారి అల‌రించ‌బోతోంది. ఈ సినిమాకి తొలిసారి డ‌బ్బింగ్ చెప్పుకొంది త‌మ‌న్నా. ఈ సంద‌ర్భంగా త‌మ‌న్నాతో గో తెలుగు చిట్ చాట్‌.


* హాయ్ త‌మ‌న్నా..
- హాయ్ అండీ..

*  తీరిక లేని షెడ్యూల్స్ మ‌ధ్య 'ఊపిరి' తీసుకోవ‌డానికైనా వీలు దొరుకుతోందా?
-  నిజంగానే లేదు.. కానీ.. ఏ క‌థానాయిక‌కైనా కావ‌ల్సింది ఇదే క‌దా?  మొన్న‌టి వ‌ర‌కూ ఉపిరి కి డ‌బ్బింగ్ చెబుతూనే ఉన్నా. ఈమ‌ధ్యే త‌మిళ సినిమా ఒక‌టి షూటింగ్ ముగించా. ప్ర‌భుదేవాతో సినిమా ఇటీవ‌లే ప‌ట్టాలెక్కింది. బాహుబ‌లి 2 కూడా రేసులో ఉంది. ఇంక స‌మ‌యం ఎక్క‌డ ఉంఉటంది?

* ఇంత బిజీగా ఉంటాన‌ని ఎప్పుడైనా అనుకొన్నారా?
- నిజంగానే అనుకోలేదు. ఏదో ఒక‌ట్రెండు సినిమాలు చేస్తానేమో..?  ఆ త‌ర‌వాత న‌న్ను భ‌రించ‌డం క‌ష్టం. అనుకొనేదాన్ని. నిజంగా తెలుగు ప్రేక్ష‌కులు చాలా మంచివాళ్లు.. న‌న్ను ఇంత‌కాలంగా భ‌రిస్తున్నందుకు.

* ప‌రిశ్ర‌మ‌కొచ్చి ప‌దేళ్లు అయిపోయింది క‌దా?
- యా. అయినా స‌రే నిన్నో, మొన్నో వ‌చ్చిన‌ట్టు అనిపిస్తోంది. బ‌ట్‌.. ప‌దేళ్ల ప్ర‌యాణం అంటే మామూలు విష‌యం కాదు. అందులోనూ క‌థానాయిక‌ల‌కు.

* ఈ ప‌దేళ్ల‌లో ఏం సాధించారు?
- నాపై న‌మ్మకం. త‌మ‌న్నా ఏ పాత్ర ఇచ్చినా చేయ‌గ‌లదు అన్న కాన్ఫిడెన్స్ క‌లిగించాను. ఈ ప్ర‌యాణంలో ఎన్నో మంచి సినిమాలు చేసే అవ‌కాశం ద‌క్కింది. మ‌రీ ముఖ్యంగా బాహుబ‌లితో నా పేరు ప్ర‌పంచ‌మంతా తెలిసింది. అలాంటి సినిమా జీవితకాలంలో ఒక్క‌సారే వ‌స్తుంది.

* మ‌రి ఇంకా స్పీడు పెంచొచ్చు క‌దా?
- అక్క‌ర్లెద్దు.. వ‌స్తున్న సినిమాల‌కు న్యాయం చేస్తే చాలు. చేతిలో ప‌ది సినిమాలుండాలి.. ఒక్క‌రోజు కూడా నా కాల్షీట్లు వృథా కాకూడ‌దు అనుకోను. చేసేది ఒక్క సినిమా అయినా మంచి పాత్ర ద‌క్కాలి. ప‌దేళ్ల‌యిపోయింది క‌దా, ప్ర‌యోగాల‌కు ఇదే స‌రైన త‌రుణం. ఇప్పుడైనా మంచి పాత్ర‌లు చేయ‌క‌పోతే ఎలా?

* ఊపిరిలో అలాంటి పాత్రే ద‌క్కిందా?
- నాదేదో కొత్త పాత్ర అని చెప్ప‌నుగానీ.. నాలుక్‌, బాడీ లాంగ్వేజ్ అంతా డిఫ‌రెంట్ గా ఉంటుంది. పాత్ర ప‌రంగా ప‌క్క‌న పెడితే ఇదో కొత్త సినిమా. తెలుగు ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త అనుభూతి అందిస్తుంది. ఊపిరితో తెలుగు సినిమాలో చాలా మార్పు వ‌స్తుంది. ఇప్ప‌టికే మార్పు మొద‌లైంది.

* ఊపిరి కొత్త‌ద‌నం.. గొప్పద‌నం ఏమిటి?
- ఈ టీమ్ లో అంద‌రూ నిజాయ‌తీగా క‌ష్ట‌ప‌డ్డారు.. అది గొప్ప‌ద‌నం. ఇక నాగ్‌సార్‌ని చూశారుగా.. ఆయ‌న సినిమా మొత్తం వీల్ ఛైర్‌కే ప‌రిమిత‌మైపోయారు. అంత పెద్ద హీరో క‌థ‌ని న‌మ్మి చేసిన ప్ర‌యోగం అది. ఆయ‌న్ని చూసి మ‌నమంతా చాలా నేర్చుకోవాలి.

* సినిమా అంతా వీల్ ఛైర్‌లోనే కూర్చోవాలి అని మిమ్మ‌ల్ని ఎవ‌రైనా అడిగితే..
- త‌ప్ప‌కుండా చేస్తా. ఎందుకంటే న‌టిగా అదో స‌వాల్‌. క‌ళ్ల‌తోనే భావాల‌న్నీ ప‌లికించ‌డం ఆషామాషీ వ్య‌వ‌హారం కాదుగా. ఆ విష‌యంలో నాగ్‌సార్‌కి మంచి మార్కులు ప‌డ‌తాయి.

* నాగ‌చైత‌న్య‌, నాగార్జున‌ల‌తో క‌ల‌సి న‌టించారు.. ఇద్ద‌రిలో క‌నిపించే కామన్ పాయింట్ ఏమిటి?
- వృత్తి ప‌ట్ల వాళ్ల‌కుండే నిబ‌ద్ద‌త ఒకేలా ఉంటుంది. క‌థానాయిక‌ల్ని ఇద్ద‌రూ స‌మానంగా గౌర‌విస్తారు.

* స్పీడున్నోడులో ఓ ఐటెమ్ సాంగ్ చేశారు.. ఇక ముందు కూడా అలాంటి పాట‌ల్లో క‌నిపిస్తారా?
- ప్ర‌త్యేక గీతాలు వ‌స్తే బాగుణ్ణు అని ఎదురుచూడ‌లేదు. వ‌చ్చాయి.. చేశాను. ఇక ముందూ నాకు ఏ ఆఫ‌రైనా న‌చ్చితేనే చేస్తా.

* బాహుబ‌లి 2లో మీ పాత్ర ప‌రిధి ఎంత‌?
- ఇంతో అంతో క‌చ్చితంగా చెప్ప‌లేను. కానీ.. చిన్న పాత్ర అయినా.. బాహుబ‌లిలాంటి సినిమాలో న‌టించ‌డం నాకు ల‌భించిన గౌర‌వం.

* ఊపిరి సినిమాకి డ‌బ్బింగ్ చెప్పుకొన్నారు. మున్ముందూ కొన‌సాగిస్తారా?
- అది స‌మ‌యాన్ని బ‌ట్టి ఉంటుంది. డ‌బ్బింగ్ చెప్పుకోవాలంటే వీలైనంత స‌మ‌యం కేటాయించాలి. నా పాత్ర‌కు నా గొంతు అయితేనే బాగుంటుంది అనుకొన్న‌ప్పుడు త‌ప్ప‌కుండా డ‌బ్బింగ్ చెప్పుకొంటా.

* ఇప్పుడు చేస్తున్న సినిమాలేంటి?
- ప్ర‌భుదేవాతో ఓ సినిమా చేస్తున్నా. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల అవుతుంది.

* ఓకే.. ఆల్ ద బెస్ట్‌
- థ్యాంక్యూ...

-కాత్యాయని
 

మరిన్ని సినిమా కబుర్లు
she is so beauty