Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview with tamanna

ఈ సంచికలో >> సినిమా >>

ఆమె అందం నయనానందం

she is so beauty

మూడు పదుల వయసులోనూ చూపు తిప్పుకోని అందం ఆమెది. అందుకే ఆమెకు అవకాశాలు తన్నుకొస్తున్నాయి. తెలుగులోనూ, తమిళంలోనూ కూడా ఆమెదే పైచేయి అన్నంతగా దూసుకుపోతోంది ముద్దుగుమ్మ నయనతార. ఇప్పటికి దక్షిణాది హీరోయిన్లలో అధిక రెమ్యునరేషన్‌ అందుకుంటున్న టాప్‌ 5 హీరోయిన్లలో ఆమె పేరూ ఖచ్చితంగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. తాజాగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న వెంకటేష్‌ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అంతేకాదు చిరంజీవి 150వ సినిమాలోనూ నయనతారనే హీరోయిన్‌గా సెలెక్ట్‌ చేసినట్లు సమాచారం.

దటీజ్‌ నయనతార మరి. ఇవే కాక తమిళంలో ఆమె చేతిలో ఆరు సినిమాలకు పైగానే ఉన్నాయి. అందుకే నయనతార నేటి సీనియర్‌ హీరోయిన్లలో ఫుల్‌ బిజీగా ఉన్న హీరోయిన్‌. ఎంతో మంది కొత్త హీరోయిన్లు పరిచయం అవుతున్నప్పటికీ ఆమె స్థానం పదిలంగా ఉందంటే అందుకు కారణం ఆమె అందం, అభినయం. ప్రేక్షకులు ఆమెపై పెట్టుకున్న అంతులేని అభిమానం. తొలి సినిమా నుంచి ఇప్పటిదాకా చేసే ప్రతి సినిమాలోనూ వైవిధ్యం కోసం తాపత్రయ పడటం, ప్రతి సినిమానీ తొలి సినిమాలా భావించి కష్టపడటం ఇవన్నీ తనను ఇప్పుడు ఈ స్థాయిలో ఉంచాయని నయనతార చెబుతుంది. తెలుగులో దాదాపు అందరు అగ్రహీరోలతోనూ నటించేసిన నయనతార, చిరంజీవితోనూ నటించేస్తే ఆ ఒక్క లోటూ ఆమెకు తీరిపోతుంది. 

మరిన్ని సినిమా కబుర్లు
run team comming