Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
beauty ready for mega hit

ఈ సంచికలో >> సినిమా >>

చైతూ, అఖిల్‌ గురించి నాగ్‌ ఏమన్నారంటే..

nag says about her sons

అక్కినేని నాగచైతన్య పలు హిట్‌ సినిమాల్ని తన ఖాతాలో వేసుకున్నాడు '100 పర్సెంట్‌ లవ్‌', 'తడాఖా', 'ఒక లైలా కోసం' చిత్రాలు నాగచైతన్య కెరీర్‌లో హిట్‌ అయినవి. అయితే అక్కినేని అఖిల్‌ మాత్రం తొలి సినిమాని అన్నయ్యలానే పరాజయంతో ప్రారంభించాడు. ఈసారెలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో ఉన్నాడు అఖిల్‌. తన కుమారుల కెరీర్‌ గురించి హీరో అక్కినేని నాగార్జున మాట్లాడుతూ, ఇంకా వారికి చాలా వయసుందనీ, 30 ఏళ్ళ తర్వాతగానీ మెచ్యూరిటీ, సరైన సక్సెస్‌లు రావడం కష్టమనీ, మహేష్‌ అయినా ఇంకొకరైనా 30 ఏళ్ళ తర్వాత సరైన సక్సెస్‌లు సొంతం చేసుకున్నారని చెప్పారు. ఫ్లాప్‌కి కుంగిపోయి, హిట్‌కి మిడిసిపడే టైపు కాదు నాగార్జున.

కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాల్ని చవిచూశారాయన. ఆ అనుభవంతోనే చైతూ, అఖిల్‌ల కెరీర్‌ గురించి తనదైన అభిప్రాయాన్ని నాగార్జున కుండబద్దలు గొట్టేశారు. ప్రస్తుతం నాగార్జున 'ఊపిరి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. తొలిసారి నాగ్‌ ఈ చిత్రంలో కార్తీతో కలిసి నటిస్తున్న విషయం తెలిసినదే. తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుంది 'ఊపిరి'. సినిమా అంతా నాగార్జున వీల్‌ ఛెయిర్‌కే పరిమితమవుతారు. ప్రయోగాత్మక సినిమాలు చేసినప్పుడు నటుడిగా కొత్త కొత్త కోణాల్ని టచ్‌ చేసినట్లవుతుందని చెప్పే నాగ్‌కి హ్యాట్సాఫ్‌ చెప్పకుండా ఉండలేం. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam