Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Raw Mango Pickle

ఈ సంచికలో >> శీర్షికలు >>

అందం - చందం - మానస

 

 వేసవి కాలంలో  స్కిన్ డీహైడ్రేషన్ వల్ల చర్మం డ్రైగా మారుతుంది. ఈ డ్రై స్కిన్ నివారించుకోవడానికి వేసవిలో విరివిగా దొరికే అరటిపండ్లు బాగా సహాయపడుతాయి.చౌకగా లభించే బనానా ముఖచర్మానికి ఎంతో మేలు చేస్తుంది. వయస్సుతో సంబంధం లేకుండా బనానా ఫేస్ ప్యాక్‌ను ఉపయోగించడం ద్వారా యాంటీ-ఏజింగ్ లక్షణాలను దూరం చేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ క్లీనింగ్‌కు గోరువెచ్చని నీటిని ఉపయోగించుకోవచ్చు. అరటి పండ్లలో ఎక్కువ న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి కాబట్టి, ఇవి చర్మానికి చాలా అవసరం అవుతాయి . ఇది చర్మానికి తగిన తేమను అందించడంతో పాటు, చర్మ యొక్క డ్రై నెస్ ను నివారిస్తుంది. డ్రై స్కిన్ నివారించడానికి కొన్ని బనాన ఫేస్ ప్యాక్స్ ఉన్నాయి. వాటిని మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాము. ఈ ఫేస్ ప్యాక్ మీ చర్మాన్నిచూడటానికి యవ్వనంగా మరియు మెరిసే విధంగా మార్చేస్తాయి. డ్యామేజ్ అయిన స్కిన్ మరియు డ్రై స్కిన్ నివారించడానికి అరటిపండ్లు గ్రేట్ గా సహాయపడుతాయి. దీన్ని ఒక హెల్తీ మీల్ గానే కాకుండా మీ చర్మ సంరక్షణకోసం స్కిన్ డైట్ లో తీసుకోవచ్చు. డ్రై స్కిన్ నివారించుకోవడానికి కొన్ని హోం మేడ్ బనానా ఫేస్ ప్యాక్ లను ఏవిధంగా తయారుచేయాలో తెలుసుకుందాం



అరటి - బటర్ ఫేస్ ప్యాక్: బాగా పండిన అరటిపండ్లను బాగా మ్యాష్ చేసి అందులో ఒక చెంచా వైట్ బటర్ వేసి బాగా మిక్స్ చేసి ఈ మిశ్రమాన్నిముఖానికి పట్టించి 15నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ మీ చర్మంను సాప్ట్ గా మరియు ప్రకాశవంతంగా మార్చుతుంది . డ్రై స్కిన్ కు ఇది ఒక బెస్ట్ అండ్ బనానా ఫేస్ ప్యాక్

అరటి- విటమిన్ ఇ ఫేస్ ప్యాక్: బాగా పండిన అరిటిపండు తీసుకొని మెత్తగా చేసి, విటమిన్ ఇ క్యాప్యూల్ నుండి ఆయిల్ తీసి అరటిపండులో మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి . ఇది మీ చర్మాన్ని హెల్తీగా మరియు గ్లోయింగ్ గా మరియు యంగ్ గా మార్చుతుంది. డ్రై స్కిన్ నివారించడంలో ఇది ఒక బెస్ట్ ఫేస్ ప్యాక్ .

అరటి - పెరుగు ఫేస్ ప్యాక్: బాగా పండిన అరటిపండుకు పెరుగు మిక్స్ చేసి దీన్ని ముఖానికి పట్టించాలి. 15నిముషాల తర్వాత శుభ్రం చేసుకుంటే, సన్ టాన్ నివారిస్తుంది . మరియు ఇది మీ ముఖాన్ని బ్రైట్ గా మరియు ఫ్రెష్ గా మార్చుతుంది . మీ చర్మానికి అవసరం అయ్యే హైడ్రేషన్ అందిస్తుంది మరియు డ్రై నెస్ నివారిస్తుంది.

అరటి- లెమన్ జ్యూస్ ప్యాక్: బాగా పండిన అరటిపండు తీసుకొని అందులో ఒక చెంచా నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి మరియు మెడకు ప్యాక్ లా వేసుకోవాలి. ఇది స్కిన్ పిగ్మెంటేషన్ మరియు బ్లెమ్ షెష్ ను నివారిస్తుంది . ఇంకా ఇది చర్మానికి రక్షణ కల్పిస్తుంది చర్మం డ్యామేజ్ కాకుండా చేస్తుంది.

అరటి-తేనె: మనందరికి తెలుసు అరటిపండులోనూ, తేనెలోనూ అద్భుతమైన న్యూట్రియంట్స్ కలిగి ఉన్నాయని. అరటి పండులోని సగభాగం తీసుకొని ఒక బౌల్ లో వేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దానికి ఒక చెంచా తేనె కలిపి బాగా మిక్స్ చేసి ముఖం, మెడకు అప్లై చేయాలి. ఇరవై నిమిషాలు అలాగే ఆరనివ్వాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ముఖం పొడిబారినట్లు కనబడుతుంటే కనుక ఫేషియల్ స్టీమింగ్ చేసుకోవాలి. తర్వాత ఫేస్ మాయిశ్చరైజర్ తో మసాజ్ చేసుకొని చూడండి అద్భుతమైన మార్పు కనబడుతుంది.

అరటిపండు-పాలు: రెండు చెంచాల అరటిపండు గుజ్జులో ఒక టేబుల్ స్పూన్ పాలు కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత కోల్డ్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. దాంతో మీ ముఖం కాంతివంతంగాను, తాజాగాను కనబడుతుంది.

అరటి-షుగర్: అరటి పండును బాగా మెత్గగా చేసి అందులో కొద్దిగా పంచదార మిక్స్ చేసి ముఖానికి పట్టించి మర్దన చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించడంతో పాటు చర్మానికి అవసరం అయ్యే పోషకాలను అందిస్తుంది.

అరటిపండు -రోజ్ వాటర్: వేసవికాలంలో చర్మానికి చల్లదాన్ని అందించే రోజ్ వాటర్ ను కొద్దిగా అరటిపండు గుజ్జులో మిక్స్ చేసి, ముఖానికి పట్టించి 15నిముషాల తర్వాత శుభ్రం చేసుకుంటే చర్మానికి తగినంత తేమను అందివ్వడంతో పాటు, డ్రై నెస్ ను నివారిస్తుంది..

మరిన్ని శీర్షికలు
pounch patas