Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
balayya for hundred movie

ఈ సంచికలో >> సినిమా >>

మళ్లీ నవ్వుల ప్రపంచంలోకి సునీల్‌

as soon as sunil comedy comming

 మంచి టైమింగ్‌ ఉన్న కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన సునీల్‌ కొద్ది కాలంలోనే కామెడీలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పర్చుకున్నాడు. కొన్ని సినిమాల్లో కామెడీకే కాకుండా పతాక సన్నివేశాల్లో హీరోకి మంచి సపోర్టర్‌గా ఉండి కూడా ప్రముఖుల మెప్పు పొందాడు. ఆ తరువాత రాజమౌళి పుణ్యమా అని 'మర్యాద రామన్న' సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. సిక్స్‌ పాక్‌ బాడీతో కామెడీ హీరోగానే కాకుండా యాక్షన్‌ హీరోగా కూడా సునీల్‌ పర్‌ఫెక్ట్‌ అన్పించుకున్నాడు. ఇటీవల దిల్‌ రాజు నిర్మాణంలో 'కృష్ణాష్టమి' సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఇప్పుడు ఆధ్యంతం నవ్వుల్తో సాగిపోయే ఎంటర్‌టైనింగ్‌ స్టోరీని ఎంచుకుని హీరోగా కమెడియన్స్‌కి పోటీగా కడుపుబ్బ నవ్విస్తానంటున్నాడు. కె. క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కబోతోన్న ఈ సినిమాకు పరుచూరి కిరీటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తమిళంలో పాపులరైన ముద్దుగుమ్మ మియ ఈ సినిమాలో సునీల్‌కి జంటగా నటిస్తోంది. మే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది. 

మరిన్ని సినిమా కబుర్లు
nitin super confidence