Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
as soon as sunil comedy comming

ఈ సంచికలో >> సినిమా >>

నితిన్‌ సూపర్బ్‌ కాన్ఫిడెన్స్‌

nitin super confidence

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కబోతోన్న చిత్రం 'అ..ఆ..'లో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. మే 6న విడుదల కానున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. మాటల మాంత్రికుడు, టాప్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ ఈ సినిమాకి డిఫరెంట్‌ టైటిల్‌ని పెట్టి, టైటిల్‌తోనే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తున్నాడు. 'అనసూయ రామలింగం, ఆనంద్‌ విహారి' పూర్తి టైటిల్‌. దాన్ని 'అ ఆ' అని షార్ట్‌ కట్‌ చేశాడు. ఆనంద్‌ విహారి, అనసూయ రామలింగం పాత్రల్లో నితిన్‌, సమంతల నటన ఆకట్టుకొనేలా ఉంటుందట. ఫీల్‌ గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు, అత్తా, అల్లుళ్ల మధ్య జరిగే చిన్ని, చిన్ని గిల్లికజ్జాలు, ఎత్తుకి పై ఎత్తులతో ఈ సినిమా ఆధ్యంతం వినోదభరితంగా సాగుతుందట. 'అత్తారింటికి దారేది' సినిమాతో అత్త పాత్రలకు మాంచి క్రేజ్‌ సంపాదించుకున్న నదియానే ఈ సినిమాలో మరోసారి అత్త పాత్రలో మెప్పించనుంది. అనుపమ పరమేశ్వరన్‌ గెస్ట్‌ రోల్‌లో కనిపించనుంది. 'ఇష్క్‌, 'గుండె జారి గల్లంతయ్యిందే' చిత్రాలతో సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కిన నితిన్‌, మళ్ళీ ఈ మధ్య కొంచెం స్లో అయ్యాడు. సరైన విజయం కోసం ఎదురు చూస్తున్న నితిన్‌కు 'అఆ' మంచి విజయాన్ని తెచ్చిపెట్టనుందని ఇండస్ట్రీ వర్గాల టాక్‌. నితిన్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. 

మరిన్ని సినిమా కబుర్లు
raviteja says once more baby