Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nitin super confidence

ఈ సంచికలో >> సినిమా >>

ఒన్స్‌ మోర్‌ బేబీ..అంటున్న రవితేజ

raviteja says once more baby

తొలి చిత్రం నుండీ గ్లామర్‌తో ఆకట్టుకుంటోంది అందాల ముద్దుగుమ్మ రాశీ ఖన్నా. సినిమా సినిమాకూ వేరియేషన్స్‌ ఉన్న పాత్రల్లో నటిస్తూ తనదైన గుర్తింపు తెచ్చుకుందీ బొద్దుగుమ్మ. గ్యాప్‌ లేకుండా అవకాశాలు చేజిక్కించుకుంటోన్న ఈ ముద్దుగుమ్మ మొన్నీమధ్యనే 'బెంగాల్‌ టైగర్‌' సినిమాతో విజయం అందుకుంది. తాజాగా 'సుప్రీం' సినిమాలో సాయి ధరమ్‌ తేజ్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. కొత్త దర్శకుడు చక్రి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్‌ మహరాజా రవితేజ సినిమాలోనూ ఛాన్స్‌ కొట్టేసింది రాశి ఖన్నా. రవితేజతో రాశి ఖన్నాకి ఇది బ్యాక్‌ టు బ్యాక్‌ రెండో సినిమా కావడం గమనార్హం. 'బెంగాల్‌ టైగర్‌'లో రాశీ అందానికీ, నటనకు ఫిదా అయిపోయిన మాస్‌ రాజా తన కొత్త సినిమాలో రాశీ ఖన్నానే ఎంచుకున్నాడట. దాంతో అమ్మడు మళ్లీ రవితేజ పక్కన నటించే ఛాన్స్‌ కొట్టేసింది. నటనే కాకుండా, స్వతహాగా సింగింగ్‌ టాలెంట్స్‌ కూడా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాకి తన సొంత గొంతును వినిపించే అవకాశాలు కూడా ఉన్నాయట.

మరిన్ని సినిమా కబుర్లు
tamanna inspiration anushka