Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
raviteja says once more baby

ఈ సంచికలో >> సినిమా >>

అనుష్కనే ఇన్సిపిరేషన్‌ అంటున్న తమన్నా

tamanna inspiration anushka

అప్పట్లో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ పాత్రలకు పెట్టింది పేరు విజయశాంతి. లేడీ అమితాబ్‌గా విజయశాంతి సంచలన విజయాల్ని అందుకున్నారు. ఇప్పుడు హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ పాత్రలకు ప్రాణం పోస్తోంది ముద్దుగుమ్మ అనుష్క. మొదట్లో అనుష్క అంటే కేవలం గ్లామర్‌ పాత్రలకే చేస్తుంది అనే టాక్‌ను ఒక్క సినిమాతో తుడిచి పెట్టేసింది. అదే 'అరుంధతి' సినిమా. ఆ సినిమాలో జేజమ్మ పాత్రలో అనుష్కని తప్ప మరో హీరోయిన్‌ని ఊహించుకోలేం అన్నంతగా ఆ పాత్రకు హుందాతనాన్ని తీసుకొచ్చింది.. ఆ తరువాత 'బాహుబలి', 'రుద్రమదేవి' వంటి సినిమాలతో తన సత్తా చాటింది. ఇప్పుడు హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ పాత్రలు చేయాలంటే ఏ హీరోయిన్‌కైనా అనుష్కే ఇన్సిపిరేషన్‌ అనేంతగా పాపులర్‌ అయిపోయింది. ఇప్పుడు మిల్కీ బ్యూటీ తమన్నా కూడా అనుష్క బాటలో నడవాలనుకుంటోంది. తొలిసారిగా హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ పాత్రకు సై అంటోంది. ఎ.ఎమ్‌. విజయ్‌ దర్శకత్వంలో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుందట. ఈ సినిమాలో ప్రభుదేవా, సోనూ సూద్‌ ముఖ్య పాత్రలు పోషించనున్నారు. ఈ సినిమా ద్వారా 'అభినేత్రి' పాత్రలో తమన్నా తనలోని మరో కోణాన్ని చూపిస్తానంటోంది. ఈ సినిమాను కోనవెంకట్‌ సమర్పణలో ఎమ్‌.వి.వి. సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి 'అభినేత్రి' అని టైటిల్‌ను ఖరారు చేశారు. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondichooddam