Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

సావిత్రి చిత్రసమీక్ష

savitri movie review

చిత్రం: సావిత్రి 
తారాగణం: నారా రోహిత్‌, నందిత, మురళీశర్మ, వెన్నెల కిషోర్‌, అజయ్‌, రవిబాబు, శ్రీముఖి, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, షకలక శంకర్‌, సత్యం రాజేష్‌, ధన్య బాలకృష్ణన్‌ తదితరులు 
సంగీతం: శ్రావణ్‌ 
ఛాయాగ్రహణం: వసంత్‌ 
దర్శకత్వం: పవన్‌ సాధినేని 
నిర్మాత: వి.బి. రాజేంద్రప్రసాద్‌ 
విడుదల తేదీ: 1 ఏప్రియల్‌ 2016

క్లుప్తంగా చెప్పాలంటే
సావిత్రి (నందిత)కి చిన్నప్పటినుంచీ పెద్దలు కుదిర్చిన పెళ్ళి అంటే అదో ఇష్టం. పెద్దలు కుదిర్చిన పెళ్ళి ఇష్టం లేక, ఆమె ఇల్లు వదిలి పారిపోవాలనుకుంటే, సావిత్రి తన అక్కను పట్టించేస్తుంది. అలాంటి సావిత్రిని తొలి చూపులోనే ప్రేమించేస్తాడు రిషి (నారా రోహిత్‌). అయితే, ప్రేమ పెళ్ళికి సావిత్రి ససేమిరా అంటుంది. సావిత్రి మీద ప్రేమతో, తనకు వచ్చిన సంబంధాన్ని కాదనుకుంటాడు. అతను కాదనుకున్నది సావిత్రేనని ఆ తర్వాత తెలుసుకుంటాడు. కానీ, అప్పటికే పరిస్థితి చెయ్యిదాటిపోతుంది. సావిత్రి ఇంకో పెళ్ళికి రెడీ అయిపోతుంది. మరి రిషి ఏం చేశాడు? ప్రేమించిన సావిత్రిని దక్కించుకున్నాడా? లేదా? అనేది తెరపై చూస్తేనే బాగుంటుంది.

మొత్తంగా చెప్పాలంటే
నారా రోహిత్‌ డిఫరెంట్‌ అప్రోచ్‌తో తెరపై కనిపిస్తుంటాడు. పాత్రలో ఒదిగిపోతుంటాడు. సెటిల్డ్‌ పెర్ఫామెన్స్‌లో సత్తా చాటుకుంటూ వస్తున్న ఈ యంగ్‌ హీరో, ఈసారి కూడా మార్కులు కొట్టేశాడు. సినిమాలో ఏ సీన్‌కి తగ్గట్టు ఆ సీన్‌లో నటించి మెప్పించాడు. కామెడీ టైమింగ్‌తోనూ ఈసారి ఆకట్టుకున్నాడు. డైలాగ్‌ మాడ్యులేషన్‌ ఎప్పుడూ అతనికి ప్లస్సే. ఇప్పుడు కూడా అది అతనికి బాగా సెట్టయ్యింది. కంటెంట్‌ ఉన్న సినిమాల్ని ఎంచుకుంటూ, రాణిస్తున్న రోహిత్‌కి ఈ సినిమా నటుడిగానూ ప్రశంసలు వచ్చేలా చేస్తుంది.

హీరోయిన్‌ నందిత నేచురల్‌ అందంతో ఆకట్టుకుంది. నటనతోనూ మార్కులేయించుకుంటుంది. హీరోయిన్‌ తండ్రిగా మురళీ శర్మ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. బాబాయ్‌ పాత్రలో అజయ్‌ ఒదిగిపోయాడు. ప్రభాస్‌ శ్రీను, షకలక శంకర్‌, పోసాని కృష్ణమురళి తదితరులు కామెడీతో కడుపుబ్బా నవ్వించారు. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగా చేశారు. రవిబాబుని సరిగ్గా ఉపయోగించుకోలేదు. 
కథ మరీ కొత్తదేమీ కాదుగానీ, ట్రీట్‌మెంట్‌ పరంగా దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకుని, మంచి ఔట్‌ పుట్‌ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. ఎంటర్‌టైనింగ్‌గా సినిమాని తీర్చిదిద్దుతూ అవసరమైన చోట్ల ఎమోషన్స్‌ని బాగా మిక్స్‌ చేశాడు. డైలాగ్స్‌ బాగున్నాయి. మ్యూజక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకి ప్లస్‌ అయ్యాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్‌ అక్కడక్కడా అవసరం అనిపిస్తుంది. ఓవరాల్‌గా ఓకే. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి. రిచ్‌గా సినిమా తెరకెక్కిందంటే నిర్మాణపు విలువలు బాగున్నాయనే కదా.

ఫస్టాఫ్‌ సరదా సరదా సాగిపోతుంది. కాస్త లవ్‌, కాస్త ఎంటర్‌టైన్‌మెంట్‌, అక్కడక్కడా ఎమోషన్స్‌తో ఫస్టాఫ్‌, సెకెండాఫ్‌ ఎక్కడా ఆడియన్స్‌ని బోర్‌ కొట్టించవు. డైలాగ్స్‌ ఆలోచింపజేసేలా వుంటూనే, హాస్యాన్ని పండించాయి. ఓవరాల్‌గా ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్‌ అయ్యే చిత్రమిది. క్లాస్‌ ఆడియన్స్‌తో పాటు మాస్‌ ఆడియన్స్‌ని కూడా మెప్పించేలా దర్శకుడు సినిమాని రూపొందించాడు. సెకెండాఫ్‌లో ఎమోషనల్‌ సీన్స్‌ ఎక్కువగానే వున్నా, అవి మనసుకి హత్తుకునేలా ఉంటాయి. సినిమాకి ఏది ఎక్కడ ఎంత అవసరమో అంతలా ప్లాన్‌ చేసి, కమర్షియల్‌గా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని దర్శకుడు తెరకెక్కించాడు.

ఒక్క మాటలో చెప్పాలంటే
కూల్‌ అండ్‌ లవ్‌లీ ఎంటర్‌టైనర్‌


అంకెల్లో చెప్పాలంటే: 3.25/5

మరిన్ని సినిమా కబుర్లు
cinechuraka