Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

బాబితో ఇంటర్వ్యూ

interview with babi
న‌న్ను భ‌రించ‌న‌వ‌ల‌సిన అవ‌స‌రం ప‌వ‌న్ క‌ల్యాణ్ గారికి లేదు - బాబి

జాక్ పాట్ అంటే అది!
ల‌క్ అంటే.. అది!
కెరీర్‌లో అనుకోని మ‌లుపు అంటే అదీ!
రెండో సినిమాకే... ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో ప‌నిచేయ‌డం అంటే మాట‌లా?  ఒక్క సినిమా చూసి.. ప‌వ‌న్ ఆఫ‌ర్ ఇవ్వ‌డం..  అంటే మ‌మూలు విష‌య‌మా? ప‌వ‌ర్ సినిమాతో ఏకంగా ప‌వ‌ర్ స్టార్ సినిమాకే ద‌ర్శ‌కుడైపోయాడు బాబి.  ఇప్పుడు బాబీ టాలీవుడ్‌లో లక్కీయెస్ట్ డైరెక్ట‌ర్‌. అయితే.. చిన్న ఫీలింగ్ కూడా ఉంది. 'ప‌వ‌న్ సినిమాకి ప‌వ‌నే ద‌ర్శ‌కుడు. బాబిని సైడ్ చేశాడు' అన్న గాసిప్పులు బాబికి కాస్త షాకింగ్‌గానే త‌గిలాయి. మ‌రి వీటిపై బాబి స్పంద‌న ఏంటి?  ప‌వ‌న్‌తో ప‌నిచేయ‌డం బాబికి ఎలా అనిపించింది?  ఇంత‌కీ గ‌బ్బ‌ర్‌సింగ్ వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియ‌న్స్ ఎలా ఉంది? ఈ విష‌యాల‌న్నీ గోతెలుగు ఆరా తీసింది. 

* ఉగాది శుభాకాంక్ష‌లు..
- థ్యాంక్సండీ.. మీక్కూడా..

* పండ‌గ ఆనందం కంటే టెన్ష‌నే ఎక్కువ‌గా క‌నిపిస్తోంది..
- అదేం లేదండీ.. అంతా హ్యాపీనే. అన్ని చోట్ల నుంచీ సూప‌ర్ హిట్ టాక్ వినిపిస్తోంది. 

* ప‌వ‌న్‌తో బాబి అన‌గానే మేం షాక్ తిన్నాం..
- మీరేంటి ?  నా ప‌రిస్థితీ అంతే. ఓరోజు ప‌వ‌న్ క‌ల్యాణ్ గారి నుంచి ఫోన్ వ‌చ్చింది. వ‌చ్చి క‌ల‌వ‌మ‌న్నారు. ప‌వ‌ర్ సినిమా చూశా.. బాగుంది అంటార‌నుకొన్నా. అయితే ఆయ‌న ''స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌కి నువ్వే ద‌ర్శ‌కుడివి'' అని చెప్పి నాకు షాక్ ఇచ్చారు. అందులోంచి తేరుకోవ‌డానికి చాలా టైమ్ ప‌ట్టింది. అఫీషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్ బ‌య‌ట‌కు వ‌చ్చేంత వ‌ర‌కూ.. నేనింకా ఆ షాక్‌లోనే ఉండిపోయా. 

* ప‌వ‌న్ క‌థ వినిపించ‌గానే ఏం అనిపించింది?
- సూప‌ర్బ్ అనుకొన్నా... ప‌వ‌న్ గారి కోసం నేను క‌థ రాయాల‌నుకొన్నా అంత మంచి క‌థ దొర‌క్క‌పోదును. ఫ్యాన్స్ ఏం కోరుకొంటున్నారో... అవ‌న్నీ అందించాల‌నుకొన్నారాయ‌న‌. దానికి త‌గ్గ‌ట్టే క‌థ‌ని డిజైన్ చేశారు. ఆయ‌న క‌థ‌ని నేను అర్థం చేసుకొని. స్ర్కిప్టు ప‌నుల్లోకి దిగ‌డానికి ఐదు నెల‌లు ప‌ట్టింది. 

* గ‌బ్బ‌ర్ సింగ్ అంటే అంచ‌నాలు ఎక్కువ‌గా ఉంటాయి క‌దా?  వాటిని అందుకోవ‌డం కష్టం అనిపించ‌లేదా?
- క‌ష్ట‌మే. కానీ... అంచ‌నాలు అందుకోవ‌డానికి ఎంత క‌ష్ట‌ప‌డాలో అంతా ప‌డ్డాం. స్ర్కిప్ట్‌పై చాలా క‌స‌ర‌త్తులు చేశాం. గ‌బ్బ‌ర్ సింగ్ కంటే ఈ సినిమా మ‌రో లెవిల్లో ఉండాలి అన్న‌ది టీమ్ అంద‌రి ధ్యేయం. 

* మీలోనూ ఓ ర‌చ‌యిత ఉన్నాడు.. గ‌బ్బ‌ర్‌కి బాబిలోని ర‌చ‌యిత ఎంత వ‌ర‌కూ స‌హాయ‌ప‌డ్డాడు..
- ప‌వ‌న్ గారిచ్చిన క‌థ‌ని వేరే లెవిల్‌కి తీసుకెళ్లేందుకు నేనే కాదు.. మా టీమ్ అంతా క‌ష్ట‌ప‌డింది. ప‌వ‌న్ గారు చాలా ఇన్‌పుట్స్ ఇచ్చేవారు. వాట‌న్నింటికి క్యారీ చేస్తూ.. ప‌వ‌న్ అంచ‌నాల్ని అందుకోవ‌డానికి ఎంత చేయాలో, అంతా చేశాం.

* ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రమేయ‌మే ఎక్కువ‌ని, డైరెక్ష‌న్ కూడా ఆయ‌నే చేసేశార‌ని వార్త‌లొచ్చాయి.. వాటి సంగతేంటి?
- అవ‌న్నీ అవాస్త‌వం. ప‌వ‌న్‌గారితో ప‌నిచేసేట‌ప్పుడు ఏ ద‌ర్శ‌కుడైనా ఇలాంటి రూమ‌ర్లు భ‌రించాల్సిందే. ఆయ‌న ఇచ్చిన స్వేచ్ఛ అంతా ఇంతా కాదు. మా వేవ్ లెంగ్త్స్ బాగా క‌లిశాయి. ద‌ర్శ‌క‌త్వం విష‌యంలో జోక్యం చేసుకోలేదు. ఒక వేళ నేను న‌చ్చ‌క‌పోతే.. న‌న్ను భ‌రించాల్సిన అవ‌స‌రం ఆయ‌న‌కేంటి?  నా ప‌నితీరు న‌చ్చ‌క‌పోతే.. ఏ క్ష‌ణంలోనైనా ఆయ‌న బ‌య‌టకు పంపించేసేవారు.

* ఇంత‌కీ వ‌వ‌న్‌తో ప‌నిచేయ‌డం ఎలా అనిపించింది?
- సూప‌ర్బ్ అండీ. ఆయ‌న‌ది ప‌సిపిల్లాడి మ‌న‌స్త‌త్వం. మ‌న ప‌నిత‌నం న‌చ్చితే వెంట‌నే మెచ్చుకొంటారు. ఆయ‌న ఇచ్చే కాంప్లిమెంట్ కిక్కే వేరుగా ఉంటుంది. ఎవ‌రు స‌ల‌హా ఇచ్చినా తీసుకొంటారు. ఎలాంటి ఈగో ఉండ‌దు. అయితే ఆయ‌న‌తో ప‌నిచేయ‌డం అంత సుల‌భం కాదు. ఆయ‌న్ని అర్థం చేసుకొని ఆయ‌న‌తో ప్ర‌యాణం సాగించాలి. ఒక‌సారి అర్థ‌మైపోయాక‌.. మ‌నం చాలా కంఫ‌ర్ట్ అయిపోతాం. ప‌వ‌న్‌తో ప‌నిచేశాక నాలో స‌హ‌నం పెరిగింది.

* ఈ సినిమాకి బాలీవుడ్‌లోనూ విడుద‌ల చేయాల‌న్న ఆలోచ‌న ఎవ‌రిది?
- నూటికి నూరుశాతం ప‌వ‌న్ క‌ల్యాణ్ గారిదే. ఇలాంటి సినిమాలు బాలీవుడ్‌కీ బాగా న‌చ్చుతాయ‌ని ఆయ‌న ఉద్దేశం.   ఈ సినిమాలో వీణ స్టైప్ వేశారు ప‌వ‌న్‌. ఆ ఆలోచ‌న కూడా ఆయ‌న‌దే. ఏదో ఓ స‌న్నివేశంలో అన్న‌య్య చిరంజీవిగారిని గుర్తు చేయాల‌ని అనుకొన్నారు. స‌డ‌న్ గా వీణ స్టెప్పు గుర్తొచ్చింది. ప‌వ‌న్ ఆ స్టెప్పు వేస్తుంటే.. థియేట‌ర్ ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం.

* ప‌వ‌న్ నుంచి నేర్చుకొన్న‌దేంటి?
- ఆయ‌న మ‌ల్టీటాలెంటెడ్ ప‌ర్స‌న్‌. ఒక వ్య‌క్తిలో అన్ని క్వాలిటీసా?  అని ఆశ్చ‌ర్య‌పోతాం. సినిమా షూటింగ్‌లో ఉన్నా... ప్ర‌జ‌ల కోసం ఆలోచిస్తుంటారు. ఓసారి చిరంజీవి గారు మా సెట్‌కి వ‌చ్చారు. 'అన్న‌య్యా.. బాబి చాలా మంచి ద‌ర్శ‌కుడు. నువ్వూ ఆయ‌న‌తో ఓ సినిమా చేయాలి' అన్నారు. అంత‌కంటే గొప్ప కాంప్లిమెంట్ ఏముంటుంది?

* మ‌రి చిరంజీవి గారి కోసం క‌థ రెడీ చేస్తారా?
- అయ్యో ఎంత మాట‌..??  ఆయ‌న్నుంచి పిలుపు రావాలే గానీ, క‌థ వినిపించ‌డానికి నేను సిద్దం.

* రెండు మూడు సినిమాలు చేసి.. ప‌వ‌న్ రిటైర్‌మెంట్ తీసుకొంటా అంటున్నారు...
- అలా చేస్తే.. ప‌వ‌న్ ఇంటి ముందే నేను ధ‌ర్మా చేస్తా. ప‌వ‌న్ లాంటి హీరో ప‌రిశ్ర‌మ‌కు, నాలాంటి ద‌ర్శ‌కులకూ చాలా అవ‌స‌రం. ఆయ‌న సినిమాల‌కు దూర‌మైతే అభిమానిగా నేను భ‌రించ‌లేను.

* త‌దుప‌రి సినిమా ఏంటి?
- ప్ర‌స్తుతం స‌ర్దార్ ఇస్తున్న కిక్ లో ఉన్నా..  అతి త్వ‌ర‌లో నా మూడో సినిమా క‌బుర్లు పంచుకొంటా.

* ఓకే.. ఆల్ ద బెస్ట్‌
- థ్యాంక్యూ...

-కాత్యాయని
మరిన్ని సినిమా కబుర్లు
this is tamanna special