Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

ముచ్చటగా మూడు వసంతాలు పూర్తి చేసుకుని నవ్యోత్సాహంతో నాలుగో వసంతంలోకి - -బన్ను

turning to fourth year

వార పత్రిక......
ఆలోచన అందమైనదే కానీ ఆచరణ కష్టసాధ్యమైనది....అచ్చులో అయితే మరీనూ...ఎన్ని వ్యయ ప్రయాసలకోర్చినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు పాఠకులకు పత్రికను చేరవెయ్యడం దుస్సాధ్యం....ఆ ఆలోచనలోంచి వచ్చినదే గోతెలుగు.కాం అంతర్జాల పత్రిక...సరిగ్గా మూడేళ్ళ క్రితం ఉగాది కోయిల కమ్మని పాటకు తోడై, తెలుగు లోగిళ్ళల్లో షడ్రసోపేత ఉగాది పచ్చడికి జతై తెలుగు పాఠకులను పలకరించింది..అంతర్జాలంలో అప్పటిదాకా(ఇప్పుడు కూడా) మాస పత్రికలే కానీ వార పత్రికలు, అందునా ఇంత స్థాయిలో లేకపోవడం, లబ్దప్రతిష్టులైన సాహితీమూర్తులతోబాటు ఔత్సాహికులెందరో గోతెలుగు.కాం వేదికగా పాఠకులను అలరించడంతో సాహిత్యాభిమానుల హృదయాల్లో సుస్థిర స్థానమేర్పరచుకొంది. ముందుగా ముఖ చిత్రం..క్లిక్ చేయగానే విషయసూచిక...ఏది క్లిక్ చేస్తే ఆ పేజీ లోకి వెళ్ళి కావలసినవి చదువుకోవడానికి పాఠకులకు అనుకూలంగా పత్రికను తీర్చి దిద్దడం. ఆ సంచిక కాలపరిమితి అయిపోయి కొత్త సంచిక విడుదలవగానే ఈ సంచిక గత సంచికలలో వెళ్ళిపోవడం...ప్రారంభ సంచిక నుండీ తాజా సంచిక దాకా ఏది కావాలన్నా అన్నీ లైబ్రరీలో సిద్ధంగా ఉంచడం..ఇదంతా సాంకేతిక ప్రక్రియ...ఇదేమంత తేలికైన విషయం కాదు. ఇవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ప్రారంభ సంచికకు బాపుగారు ముఖ చిత్రం గీస్తే శుభమూ, పత్రికకు దీర్ఘాయువు అని గురుదేవులు కార్టూన్ పితామహులు శ్రీ జయదేవ్ గారి సూచనతో శ్రీ బాపుగారిని అభ్యర్థించడం, వారు అద్భుతమైన ముఖ చిత్రాన్ని అందించడంతో మొదలైంది గోతెలుగు సాహితీ ప్రస్థానం. మిత్రులు సిరాశ్రీ గారి సహకారం తోడైంది. ఇక అక్కడి నుండీ లబ్ధ ప్రతిష్టులైన రచయిత(త్రు)లు..శ్రీ మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు, శ్రీ వంశీ గారు, శ్రీ వి. ఎన్. ఆదిత్య గారు, శ్రీ సూర్యదేవర రాం మోహన్ రావు గారు, శ్రీ భాస్కరభట్ల రవికుమార్ గారు, శ్రీ చంద్రబోస్ గారు గోతెలుగు కుటుంబంలో సభ్యులైపోయారు....అలాగే ఎందరో ఔత్సాహిక రచయిత(త్రు)ల ప్రతిభను ప్రోత్సహించే వేదికైంది గోతెలుగు. ఒకే రచయిత(త్రి) రచనలను వరుసగా ప్రచురించే సరికొత్త సంప్రదాయానికీ గోతెలుగు శ్రీకారం చుట్టింది...ఇక కార్టూన్ల విషయానికొస్తే సీనియర్ కార్టూనిస్టులు శ్రీ జయదేవ్ బాబు గారు, శ్రీ సరసి గారు, శ్రీ శంకు గారి నుండీ ఎందరో ఔత్సాహిక కార్టూనిస్టులూ గోతెలుగు కార్టూన్ ఇష్టులను అలరిస్తున్నారు. గోతెలుగు రచనలకు చక్కని చిత్రాలను గీయడమే కాక సంపాదక బాధ్యతలను కూడా నిబద్ధతతో నిర్వర్తిస్తోన్న మాధవ్ గారి సేవలు గోతెలుగు విజయానికి సహకారమందిస్తోన్నవే... ముచ్చటగా మూడు వసంతాలు పూర్తి చేసుకుని నవ్యోత్సాహంతో నాలుగో వసంతంలోకి అడుగిడుతోంది గోతెలుగు. మరిన్ని మంచి రచనలతో, హాయిగా నవ్వించే కార్టూన్లతో సాగిపోయేందుకు ఆ భగవంతుడు గోతెలుగుకు దీర్ఘాయువును ప్రసాదించాలనీ, పది కాలాల పాటు పాఠకులను అలరించాలనీ కోరుకుంటూ,

అందరికీ శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో.....
మీ
బన్ను

మరిన్ని శీర్షికలు
saradanandam