Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nani new flim evaditadu?

ఈ సంచికలో >> సినిమా >>

చిరంజీవి 'కత్తిలాంటోడు' కాదా?

chiru kattilantodu

చిరంజీవి 150వ సినిమా మే నెలలో పట్టాలెక్కనుందన్న విషయం తెలిసిందే. వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి టైటిల్‌ చిక్కులు వచ్చి పడ్డాయి. తమిళ్‌ సినిమా 'కత్తి'కి రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టుగా, అభిమానులు మెచ్చే విధంగా ఉండేట్లుగా తగిన టైటిల్‌ కోసం పరిశీలిస్తున్నారు. 'కత్తిలాంటోడు' అనే టైటిల్‌ను అనౌన్స్‌ చేసి, అభిమానుల అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు.

కానీ అభిమానుల నుంచి ఆ టైటిల్‌ విషయంలో అంతగా పాజిటివ్‌ రెస్పాన్స్‌ లభించకపోవడంతో మళ్లీ టైటిల్‌ మార్చే పనిలో పడింది చిత్ర బృందం. ఈ సినిమాలో చిరుకి జోడీగా మొదట్లో నయనతారను అనుకున్నారు. కానీ ఆమె కాల్షీట్లు దొరక్క మరో సీనియర్‌ హీరోయిన్‌ కోసం పరిశీలిస్తున్నారు. అనుష్క, కాజల్‌, త్రిష పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ ఏడాది కూడా చిరు సినిమా ప్రేక్షకులను చేరువ అయ్యే అవకాశాలు కన్పించడంలేదు. 150వ సినిమా అంటే ఎట్రాక్టివ్‌ టైటిల్‌, ఎట్రాక్టివ్‌ హీరోయిన్‌ కూడా ముఖ్యమే. అందుకే ఈ విషయాల్లో ఒకటికి పదిసార్లు ఆలోచిస్తోంది చిత్ర యూనిట్‌. అతి త్వరలోనే ఈ సినిమాపై అభిమానులకి క్లారిటీ ఇచ్చేయాలని చిరంజీవి భావిస్తున్నారట. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam