Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
rashikahanna performence super..

ఈ సంచికలో >> సినిమా >>

'నాయకి'గా త్రిష అదుర్స్‌

trisha as nayaki..

గోవి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న డిఫరెంట్‌ థ్రిల్లింగ్‌ మూవీ 'నాయికి'. త్రిష ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ఈ సినిమా తెలుగు, తమిళం రెండు భాషల్లో తెరకెక్కుతోంది. దాదాపుగా షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమాను వచ్చే నెల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే యోచనలో ఉంది చిత్ర బృందం. ఈ సినిమా త్రిష కెరీర్‌లో ది బెస్ట్‌ అవుతుంది అనే నమ్మకం వ్యక్తం చేస్తోంది. ఇంతవరకూ తాను కనిపించని విధంగా త్రిష ఈ సినిమాలో భిన్న కోణాల్లో కనిపిస్తుందట.

ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌ ద్వారా ఆమె క్యారెక్టర్‌లోని హుందాతనం, ముఖంలోని హావభావాలు ప్రేక్షకుల్లో ఆశక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇంతవరకూ చాలా హారర్‌ అండ్‌ థ్రిల్లింగ్‌ సినిమాలు వచ్చాయి. సక్సెస్‌ అయ్యాయి. కానీ ఈ సినిమా వాటన్నింటికీ డిఫరెంట్‌గా, సరికొత్త కథతో తెరకెక్కబోతోందట. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో వస్తున్న ఈ సినిమా తప్పకుండా తనకు మంచి పేరు తీసుకొస్తుందని అంటోంది ముద్దుగుమ్మ త్రిష. అంతేకాదు ఈ సినిమాలో త్రిష తొలిసారిగా తన గొంతును సవరించుకోబోతోంది తన సొంత గొంతుతో త్రిష ఈ సినిమాలో ఒక పాట కూడా పాడింది. ఈ పాట ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ సినిమాకి రఘుకుంచె మ్యూజిక్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. 

మరిన్ని సినిమా కబుర్లు
lover boy comming