Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
summer special issues

ఈ సంచికలో >> శీర్షికలు >>

అందం - చందం - మానస

 

వేసవిలో పెదాల సంరక్షణ.... 

వేసవిలో ఎండతాపం ప్రభావానికి చర్మం పొడిగా మారిపోతుంది. ముఖ్యంగా ముఖం నల్లగా-జిడ్డుగా మారడం, కంటికింద నల్లని వలయాలు ఏర్పడటం లాంటివి తలెత్తుతాయి. అలాగే సున్నితంగా వుండే పెదాలు కూడా సూర్యునితాపానికి గురై పగిలిపోతాయి. ఇలా పగిలిన పెదాలను మళ్లీ మృదువుగా మార్చుకోవాలంటే.. అందుకు కొన్ని బ్యూటీ టిప్స్ అందుబాటులో వున్నాయి.

* దానిమ్మ, పాల మీగడతో పగిలిన పెదాలను తిరిగి మృదువుగా మార్చుకోవచ్చునని బ్యూటీషన్లు అంటున్నారు. దానిమ్మ రంగులా పెదవులు అదే ఎరుపు రంగును సంతరించుకోవాలంటే ముందుగా దానిమ్మ విత్తనాలను ఒక బౌల్ లో తీసుకుని మెదపాలి. అనంతరం అందులో సరిపోయేంత పాల మీగడ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని పెదాలపై ప్యాక్‌లా వేసుకోవాలి. కొద్దిసేపు తర్వాత అలాగే వుంచుకున్న అనంతరం శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా రోజూ చేస్తే గులాబీ రేకుల్లాంటి పెదవుల్ని పొందవచ్చు.

* ఒక గిన్నెలో కొద్దిగా పాలు తీసుకుని అందులో గులాబీ రేకులు వేసి కొద్దిసేపటివరకు నానబెట్టాలి. తరువాత దానిని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్టులో తేనె, గ్లిజరిన్‌ని కూడా కలపవచ్చు. ఈ మిశ్రమాన్ని పెదాలపై పూతలా వేసుకుని.. కొద్ది పాలతో మసాజ్ చేయాలి. ఈ విధంగా వారానికి నాలుగు సార్లు చేస్తే పెదవులు మృదువుగా తయారవుతాయి.

పెదాలు పగలకుండా ఉండటానికి చిట్కాలు…
1.పెదవులు ఎక్కువగా పగులుతుంటే వాటికి పాల మీగడ రాయాలి.

2.గులాబీ రేకులను పాలలో కలిపి పెదవులపై రాసి కొంచెం సేపాగిన తర్వాత కడుక్కుంటే మృదువుగా తయారవుతాయి.

3.పెదాలపై వున్న నలుపు పోగొట్టాలంటే తేనే,గ్లిజరిన్,నిమ్మరసం కలిపి రాసుకోవాలి.

4.మీగడలో సెనగ పిండి,నిమ్మరసం కలిపి పెదాలకు రాసుకుంటే మృదువుగా తయారవుతాయి.

* సహజమైన గులాబీ రేకుల్లాంటి పెదవులను పొందాలంటే.. రాత్రివేళల్లో నిద్రపోవడానికి ముందు కాస్త బీట్రూట్ రసాన్ని పెదవులపై రాస్తే మంచి ఫలితం ఉంటుంది.

 

 

....

మరిన్ని శీర్షికలు
sarasadarahasam