Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

సరైనోడు చిత్రసమీక్ష

sarainodu movie review

చిత్రం: సరైనోడు

తారాగణం: అల్లు అర్జున్‌, ఆది, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, క్యాథరీన్‌ ట్రెసా, శ్రీకాంత్‌, బ్రహ్మానందం, సుమన్‌, సాయికుమార్‌, వినయ ప్రసాద్‌, ప్రదీప్‌ రావత్‌, విద్యుల్లేఖ రామన్‌, అంజలి (స్పెషల్‌ సాంగ్‌) తదితరులు.

సంగీతం: థమన్‌ ఎస్‌ఎస్‌ 
ఛాయాగ్రహణం: రిషి పంజాబి 
దర్శకత్వం: బోయపాటి శ్రీను 
నిర్మాత: అల్లు అరవింద్‌ 
నిర్మాణం: గీతా ఆర్ట్స్‌ 
విడుదల తేదీ: 22 ఏప్రియల్‌ 2016

క్లుప్తంగా చెప్పాలంటే :
మిలిటరీ అధికారి అయిన గణ (అల్లు అర్జున్‌), ఉద్యోగాన్ని వదిలి హైద్రాబాద్‌లో కుటుంబంతో కలిసి ఉంటాడు. బాబాయ్‌ (శ్రీకాంత్‌) సహాయంతో చెడుని ఏరిపారేయడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తుంటాడు. తను నివసిస్తున్న నియోజకవర్గ ఎమ్మెల్యే హన్షితా రెడ్డి (క్యాథరీన్‌ ట్రెసా)తో ప్రేమలో పడతాడు గణ. ఈలోగా తనను రక్షించాలంటూ మహాలక్ష్మి (రకుల్‌ ప్రీత్‌ సింగ్‌) గణ వద్దకు వస్తుంది. ఆమెను రక్షించే క్రమంలో ధనుష్‌ (ఆది)తో తలపడాల్సి వస్తుంది గణకి. మహాలక్ష్మికీ ఆదికీ సంబంధమేంటి? హన్షితారెడ్డితో గణ ప్రేమాయణం ఏమయ్యింది? వంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం తెరపై చూడాల్సిందే.

మొత్తంగా చెప్పాలంటే 
కంప్లీట్‌ మాస్‌ లుక్‌తో అల్లు అర్జున్‌ అదరగొట్టేశాడు. పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. నటన, డైలాగ్‌ డెలివరీ, యాక్షన్‌ ఎపిసోడ్స్‌, కామెడీ సీన్స్‌, డాన్సులు ఒకటేమిటి, అన్నిట్లోనూ అల్లు అర్జున్‌ సత్తా చాటాడు. విలన్‌గా చేసినా ఆది చాలా పవర్‌ఫుల్‌గా కనిపించాడు. సాధారణంగా తెలుగు సినిమాల్లో విలన్‌ అంటే హీరో చేతిలో తన్నులు తినడానికే పరిమితం. విలనిజం ఎంత బాగా ఎలివేట్‌ అయితే, హీరోయిజం అంత స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఆన్‌ స్క్రీన్‌ అల్లు అర్జున్‌కి ఆది పెర్‌ఫెక్ట్‌ పోటీ ఇచ్చాడు.

అటు గ్లామర్‌లోనూ ఇటు నటనలోనూ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, క్యాథరీన్‌ ట్రెసా ఆకట్టుకున్నారు. గ్లామర్‌లో ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. క్యాథరీన్‌ స్టైలిష్‌ లుక్‌తో కొన్ని సీన్స్‌లో అలరించింది. శ్రీకాంత్‌ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. బ్రహ్మానందం కామెడీ ఓకే. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగా చేశారు. 
కథ కొత్తదేమీ కాదు. పరిచయం ఉన్నదే. మాస్‌ మసాలా అంశాల్ని దట్టించి దర్శకుడు తనదైన ట్రిక్‌ని ప్లే చేశాడు. మాటలు బాగున్నాయి. కథనం ఓకే. అక్కడక్కడా సాగతీతలా అనిపిస్తుంది. మాస్‌ ఎలిమెంట్స్‌కి కొదవ లేదు. ఎడిటింగ్‌ అక్కడక్కడా అవసరం అనిపిస్తుంది. సంగీతం ఓకే. పాటలు తెరపై చూడ్డానికి అందంగా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాగుంది. సినిమా రిచ్‌గా తెరకెక్కింది. నిర్మాణపు విలువలు చాలా బాగున్నాయి. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సినిమాకి హెల్పయ్యాయి.

మాస్‌ సినిమాలకు పెట్టింది పేరు. మాస్‌ సినిమాకి ఏయే కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఎలా జోడించాలో బాగా తెలిసిన వ్యక్తి బోయపాటి శ్రీను. అతని సినిమాల్లో కొత్తదనం సంగతెలా ఉన్నా, మాస్‌ని థియేటర్లలో కూర్చోబెట్టే సీన్స్‌ అతని సినిమాల్లో ఎక్కువగా ఉంటాయి. ఇందులోనూ అంతే. మాస్‌ని మెప్పించే అంశాలకు కొదవ ఏమీ లేదు. ఫస్టాఫ్‌ కొంచెం యాక్షన్‌, కొంచెం గ్లామర్‌, కొంచెం రొమాన్స్‌, కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్‌, ఇంట్రెస్టింగ్‌ ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ ఇలా సాగిపోతాయి. సెకెండాఫ్‌లో సినిమా పేస్‌ తగ్గుతుంది. అక్కడక్కడా మాస్‌ మెచ్చే అంశాలు కనిపిస్తాయి. ఓవరాల్‌గా సినిమా అల్లు అర్జున్‌ నటనతో, డాన్సులతో, మాస్‌ సీన్స్‌తో ఆడియన్స్‌ని అలరించేలానే ఉంది. క్లాస్‌ ఆడియన్స్‌ మాత్రం లౌడ్‌నెస్‌ ఫీల్‌ అవుతారు. ఓవరాల్‌గా సినిమా ఓకే. మాస్‌ రాజపోషకులు గనుక, మాస్‌ ఆడియన్స్‌ ఏ స్థాయిలో సినిమాని ఆదరిస్తారనేదానిపైనే సినిమా సక్సెస్‌ రేంజ్‌ ఆధారపడి ఉంటుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే 
మాస్‌కి సరైనోడే 
అంకెల్లో చెప్పాలంటే: 3.25/5

మరిన్ని సినిమా కబుర్లు
interview with boyapati srinu