Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

రాశి ఖన్నాకి 'కిక్‌' ఇచ్చేది అదేనట

rashi khanna intrestead  de glamour roles

అందంగుండడమే కాదు అభినయం కూడా ఉండాలి అందరూ చెప్పే మాటే.. కానీ ఆ మాట మీద ఖచ్చితంగా నిలబడతానంటోంది అందాల తార రాశీ ఖన్నా. ఆమె అందంగా ఉంటానని ఎలాగూ నిరూపించుకుంది. కానీ అదొక్కటే చాలదంటోంది ఈ ముద్దుగుమ్మ. ప్రేక్షకుల్ని మెప్పించే అభినయం ఉంటేనే నటనకి పూర్తిగా న్యాయం చేసినట్లు అంటోంది. ఎలాంటి పాత్ర చేసినా సరే.. ఆ పాత్రకు తగ్గట్టుగా ఒదిగిపోతేనే అసలైన కిక్‌ అంటోంది ఈ ముద్దుగుమ్మ. త్వరలోనే సాయి ధరమ్‌ తేజ్‌తో 'సుప్రీమ్‌' సినిమా ద్వారా మన ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది

ఈ బ్యూటీ. ఈ సినిమాలో రాశీ పాత్రకు ఎక్కువ ప్రాధన్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక కామెడీ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తానంటోంది రాశీ. అంతేకాదు.. ఎప్పుడూ గ్లామర్‌ పాత్రల్లోనే కనిపిస్తే మజా ఏముంటుంది. సాంగ్స్‌ టీజర్స్‌లో రాశి ఖన్నా గ్లామర్‌ కెవ్వుకేక అనకుండా ఉండలేం. కాస్త బొద్దుగా మొదట్లో కనిపించిన ఈ భామ ఇప్పుడు స్లిమ్‌గా తయారైంది. ఎప్పుడూ గ్లామరేనా, అప్పుడప్పుడూ డీ గ్లామర్‌ రోల్స్‌లో కూడా కనిపిస్తే బావుంటుందనిపిస్తుందట రాశి ఖన్నాకి. అవకాశమొస్తే తప్పకుండా డీగ్లామర్‌ క్యారెక్టర్స్‌కూ సై అంటోంది ముద్దుగుమ్మ రాశీ ఖన్నా. 

మరిన్ని సినిమా కబుర్లు
Then now - reshmi