Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Then now - reshmi

ఈ సంచికలో >> సినిమా >>

నితిన్‌ సినిమాలో పవన్‌.. నిజమేనా?

pavan in nitin movie

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల మధ్య ఉన్న స్నేహం సంగతి అందరికీ తెలిసిందే. అదే విధంగా నితిన్‌కు పవన్‌పై ఉన్న వీరాభిమానం గురించి కూడా చెప్పనక్కర్లేదు. ఈ అభిమానంతోనే గత నాలుగైదు సినిమాల నుంచీ.. నితిన్‌ పవన్‌ను బాగా వాడేసుకోవడం మొదలెట్టాడు. కానీ నితిన్‌ సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కినట్లే ఎక్కి, మళ్ళీ వైఫల్యాల బాటపట్టాడు. అయితే, త్రివిక్రమ్‌తో నితిన్‌ ఓ సినిమాకి కమిట్‌ అయ్యాడన్న వార్తతో మళ్ళీ నితిన్‌ తెలుగు సినీ పరిశ్రమలో అందరి దృష్టినీ తనవైపుకు తిప్పుకోగలిగాడు. త్రివిక్రమ్‌, నితిన్‌ కాంబినేషన్లో 'అ,ఆ..' చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలో సెట్‌లో పవన్‌ సడెన్‌గా ప్రత్యక్షమయ్యాడు. 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌' రిలీజ్‌ తర్వాత కాస్త ఖాళీ చేసుకున్న పవన్‌ సరదాగా తన మిత్రుడిని పలకరించడానికని ఆక్కడికి వచ్చాడట. అయితే, ఈ కలయిక వెనుక మరేదో విషయం ఉందని గుసగుసలు విన్పిస్తున్నాయి. 'అ, ఆ..' సినిమాలో పవన్‌ స్పెషల్‌ అప్పియరెన్స్‌ ఉండబోతోందనే రూమర్‌ విన్పిస్తోంది. ఏమో అయినా కావచ్చు. తన ప్రాణ స్నేహితుడు త్రివిక్రమ్‌, వీరాభిమాని నితిన్‌ కోరితే పవన్‌ కాదంటాడా! వెయిట్‌ అండ్‌ సీ. అలాగే, తదుపరి త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమా గురించి పవన్‌ ఈ సందర్భంగా చర్చించాడని సమాచారమ్‌. 

మరిన్ని సినిమా కబుర్లు
balakrishna act in  krish direction